Monday, 26 June 2017

Officer jobs in NABARD,Jobs at ESI Medical Colleges. నాబార్డ్‌లో ఆఫీసర్ ఉద్యోగాలు, ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు.

నాబార్డ్‌లో ఆఫీసర్ ఉద్యోగాలు,

-డిగ్రీ/పీజీ అభ్యర్థులకు అవకాశం
-ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
- ప్రారంభవేతనం నెలకు రూ. 55 వేలు.
- మొత్తం ఖాళీల సంఖ్య-108

ముంబై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (నాబార్డ్) గ్రేడ్ ఏ, గ్రేడ్ బీ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
BANK-POS
వివరాలు:

నాబార్డు పూర్తిగా భారత ప్రభుత్వ (ఆర్‌బీఐ) పరిధిలోని సంస్థ. దీన్ని బీ శివరామన్ కమిటీ సూచనమేరకు జూలై 12, 1982న ఏర్పాటు చేశారు. నాబార్డు బ్యాంక్ దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఆర్థిక కార్యకలాపాలకు రుణ రంగంలో విధానాలు, ప్రణాళిక కార్యకలాపాలకు సంబంధించిన విషయాలపై క్రియాశీలకంగా వ్యవరిస్తుంది.
-పోస్టు: అసిస్టెంట్ మేనేజర్. రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ విభాగంలో గ్రేడ్ ఏ పోస్టులు.
-మొత్తం ఖాళీల సంఖ్య- 91 పోస్టులు (జనరల్- 47, ఎస్సీ- 14, ఎస్టీ- 6, ఓబీసీ- 24. వీటిలో పీహెచ్‌సీలకు 3 పోస్టులు కేటాయించారు)
-విభాగాల వారీగా.. జనరల్- 46, ఎకనామిక్స్- 5, అగ్రికల్చర్- 6, అగ్రికల్చర్ ఇంజినీరింగ్- 2, ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్- 4, యానిమల్ హస్బెండరీ- 5, ఫిషరీస్- 3, ఫుడ్ ప్రాసెసింగ్- 3, ఫారెస్ట్రీ- 3, ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్- 3, వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్- 4, సోషల్ వర్క్- 2, చార్టెర్డ్ అకౌంటెంట్-3, కంపెనీ సెక్రటరీ- 2 ఖాళీలు ఉన్నాయి.

-అర్హతలు: అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు విభాగాల వారీగా..
-జనరల్: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి 50 శాతం మార్కులతో ఏదైనా సబ్జెక్టులో డిగ్రీ లేదా పీజీ లేదా పీహెచ్‌డీ చేసినవారు అర్హులు. లేదా డిగ్రీతోపాటు సీఏ/సీఎస్ లేదా కంపెనీ సెక్రటరీ లేదా డిగ్రీతోపాటు రెండేండ్ల ఫుల్‌టైం పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్/ఫుల్‌టైం ఎంబీఏ చేసినవారు.
-ఎకనామిక్స్: కనీసం 50 శాతం మార్కులతో ఎకనామిక్స్ డిగ్రీ లేదా పీజీ లేదా తత్సమాన కోర్సు.
-అగ్రికల్చర్: కనీసం 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ అగ్రికల్చర్.
-అగ్రికల్చరల్ ఇంజినీరింగ్: కనీసం 50 శాతం మార్కులతో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఏదైనా ఇంజినీరింగ్ చేసి పీజీలో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ చేసినవారు అర్హులు.
-ప్లాంటేషన్ అండ్ హార్టికల్చర్: కనీసం 50 శాతం మార్కులతో హార్టికల్చర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-యానిమల్ హస్బెండరీ: కనీసం 50 శాతం మార్కులతో వెటర్నరీ సైన్సెస్/యానిమల్ హస్బెండరీ డిగ్రీ ఉత్తీర్ణత. లేదా పీజీలో వెటర్నరీ/హస్బెండరీ కోర్సు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఫిషరీస్: కనీసం 50 శాతం మార్కులతో ఫిషరీష్‌లో బ్యాచిలర్‌డిగ్రీ ఉత్తీర్ణత.
-ఫుడ్ ప్రాసెసింగ్: డిగ్రీ/బీఈ లేదా బీటెక్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ లేదా ఫుడ్ టెక్నాలజీలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఫారెస్ట్రీ: కనీసం 50 శాతం మార్కులతో ఫారెస్ట్రీ డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణత.

-ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్: 50 శాతం మార్కులతో ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
-వాటర్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అండ్ మేనేజ్‌మెంట్: 50 శాతం మార్కులతో డిగ్రీలో హైడ్రాలజీ/అప్లయిడ్ హైడ్రాలజీ లేదా జియాలజీ లేదా అప్లయిడ్ జియాలజీ/ ఇరిగేషన్ లేదా వాటర్‌సప్లయ్ అండ్ శానిటేషన్‌లో ఏదో ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.
-సోషల్‌వర్క్: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ/పీజీలో సోషల్‌వర్క్ ఉత్తీర్ణత.
-చార్టెర్డ్ అకౌంటెంట్: డిగ్రీతోపాటు ఐసీఏఐలో మెంబర్‌షిప్ కలిగి ఉండాలి.
-కంపెనీ సెక్రటరీ: డిగ్రీతోపాటు ఐసీఎస్‌ఐలో అసోసియేట్ మెంబర్‌షిప్ ఉండాలి.
-వయస్సు: 2017, జూన్ 1 నాటికి 21-30 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1987, జూన్ 2 - 1996, జూన్ 1 మధ్య జన్మించి ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

-పోస్టు: అసిస్టెంట్ మేనేజర్. రూరల్ డెవలప్‌మెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ విభాగంలో గ్రేడ్ బీ పోస్టులు.
-మొత్తం ఖాళీల సంఖ్య - 17 పోస్టులు(జనరల్- 8, ఎస్సీ- 2, ఎస్టీ- 2, ఓబీసీ- 5. వీటిలో పీహెచ్‌సీలకు 1 పోస్టు కేటాయించారు)
-విభాగాల వారీగా.. జనరల్- 9, అగ్రికల్చర్- 8 ఖాళీలు ఉన్నాయి.
-అర్హతలు: మేనేజర్ పోస్టులకు విభాగాల వారీగా..
-జనరల్- ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ 55 శాతం) మార్కులతో లేదా పీజీలో 55 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత.
-అగ్రికల్చర్- బ్యాచిలర్ డిగ్రీ (అగ్రికల్చర్)లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ 55 శాతం) మార్కులతో లేదా పీజీ (అగ్రికల్చర్)లో 55 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017, జూన్ 1 నాటికి 21 - 35 ఏండ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం:
-మూడు దశల్లో ఉంటుంది.
-ఫేజ్- 1 ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్)
-ఈ పరీక్ష మల్టిపుల్‌చాయిస్ విధానంలో, 200 మార్కులకు ఉంటుంది. కాలవ్యవధి 2 గంటలు.
-రీజనింగ్- 20, ఇంగ్లిష్ లాంగ్వేజ్- 40, కంప్యూటర్ నాలెడ్జ్- 20, జనరల్ అవేర్‌నెస్- 20, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్- 20, ఎకనామిక్స్ అండ్ సోషల్ ఇష్యూస్- 40, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ (రూరల్ ఇండియాపై)- 40 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది.
-ఫేజ్- 2 మెయిన్ ఎగ్జామినేషన్ (ఆన్‌లైన్ టెస్ట్)
-దీనిలో రెండు పేపర్లు ఉంటాయి.

-పేపర్-1 జనరల్ ఇంగ్లిష్ (ఆన్‌లైన్‌లో)
-ఈ పేపర్‌లో డిస్క్రిప్టివ్ ప్రశ్నలు ఇస్తారు.
-మొత్తం 100 ప్రశ్నలకు గంటన్నర కాలవ్యవధిలో సమాధానాలు గుర్తించాలి.
-పేపర్-2 దీనిలో మల్టిపుల్‌చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. సంబంధిత విభాగాలపై లేదా ఎకనామిక్స్, సోషల్ ఇష్యూస్, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-100 మార్కులకు పరీక్ష. కాలవ్యవధి గంటన్నర.
-ఫేజ్-2లో వచ్చిన మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేసి ఎంపిక చేస్తారు.
-ఫేజ్-3 ఇంటర్వ్యూకు 25 మార్కులు.

-ఫేజ్-1 పరీక్ష సెంటర్లు: హైదరాబాద్/రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం.
-ఫేజ్-2 పరీక్ష సెంటర్లు: హైదరాబాద్, అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జైపూర్, కోల్‌కతా, లక్నో, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, పుణె, రాయ్‌పూర్, రాంచీ, షిల్లాంగ్, జమ్ము, తిరువనంతపురం.
-అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 150/-,జనరల్/ఓబీసీలకు రూ. 800/-
-పేస్కేల్: నెలకు సుమారుగా రూ. 55,587/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 10(గ్రేడ్ బీ ఆఫీసర్‌కు జూలై 7)
-వెబ్‌సైట్: www.nabard.org.


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీల్లో ఉద్యోగాలు.


న్యూఢిల్లీలోని ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐసీ) పరిధిలో పనిచేస్తున్న ఈఎస్‌ఐసీ మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
esi-professors
వివరాలు:
ఈఎస్‌ఐసీని మాజీ ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 1952 ఫిబ్రవరి 24న స్థాపించారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 97 (ఈ పోస్టులు సనత్‌నగర్ (తెలంగాణ), ఫరీదాబాద్ (హర్యానా), గుల్బర్గా (కర్ణాటక), రోహిణి (న్యూఢిల్లీ) ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీల్లో భర్తీచేస్తారు.
-సనత్‌నగర్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్- 11 పోస్టులు (అసోసియేట్ ప్రొఫెసర్- 5, అసిస్టెంట్ ప్రొఫెసర్- 6)
-ఫరీదాబాద్ ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్- 56 పోస్టులు (ప్రొఫెసర్- 12, అసోసియేట్ ప్రొఫెసర్- 18, అసిస్టెంట్ ప్రొఫెసర్- 26)
-గుల్బర్గా ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్- 15 పోస్టులు (ప్రొఫెసర్- 1, అసోసియేట్ ప్రొఫెసర్- 5, అసిస్టెంట్ ప్రొఫెసర్- 9)
-రోహిణి ఈఎస్‌ఐ మెడికల్ కాలేజ్- 15 పోస్టులు (అసోసియేట్ ప్రొఫెసర్-7, అసిస్టెంట్ ప్రొఫెసర్- 8)

అర్హతలు:
-ప్రొఫెసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత, సంబంధిత టీచింగ్ రంగంలో అసోసియేట్ ప్రొఫెసర్ స్థాయిలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-అసోసియేట్ ప్రొఫెసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. అసిస్టెంట్ ప్రొఫెసర్/లెక్చరర్ స్థాయిలో ఐదేండ్ల అనుభవం ఉండాలి.
-అసిస్టెంట్ ప్రొఫెసర్: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్)లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీ, పీహెచ్‌డీలో ఉతీర్ణత. సంబంధిత రంగంలో మూడేండ్ల అనుభవం ఉండాలి.
-వయస్సు: 50 ఏండ్లకు మించరాదు.

పే అండ్ అలవెన్స్‌లు:
-ప్రొఫెసర్‌కు రూ. 37,400-67,000+గ్రేడ్ పే రూ. 8700+ఎన్‌పీఏ
-అసోసియేట్ ప్రొఫెసర్‌కు రూ. 15,600-39,100+గ్రేడ్ పే రూ. 7600+ఎన్‌పీఏ
-అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు రూ. 15,600-39,100+గ్రేడ్ పే రూ. 6600+ఎన్‌పీఏ
-అప్లికేషన్ ఫీజు: రూ. 225 (డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో). ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఈఎస్‌ఐ ఎంప్లాయీస్, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: సబ్జెక్టుల వారీగా వివిధ తేదీల్లో ఈఎస్‌ఐసీ సెలక్షన్ బోర్డు సనత్‌నగర్, గుల్బర్గా, న్యూఢిల్లీలో ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతపరిచి, రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పంపాలి.
-ఇంటర్వ్యూ రోజున సంబంధిత ఈఎస్‌ఐ మెడికల్ కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్, ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్‌తో సంబంధిత అధికారి వద్ద హాజరుకావాలి.
-ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు అప్లయ్ చేస్తే వేర్వేరుగానే దరఖాస్తు చేసుకోవాలి.
చిరునామా: ESIC Medical CollegeSanathnagar, Hyderabad-38
-దరఖాస్తులకు చివరితేదీ: జూలై 20
-వెబ్‌సైట్: http://esic.nic.in

0 comments:

Post a Comment