Tuesday, 13 June 2017

NPCIL Recruitment Executive Trainees Posts,Jobs in Mahatma Gandhi University. ఎన్‌పీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు, మహాత్మా గాంధీ యూనివర్సి టీలో ఉద్యోగాలు.

ఎన్‌పీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు,

డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పని చేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి (గేట్ 2017 స్కోర్ ద్వారా) అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
image
వివరాలు:
ఎన్‌పీసీఐఎల్ అనేది అణు శక్తి విడ్యుత్ ఉత్పత్తి, పంపిణీ చేసే ప్రీమియర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ. దీన్ని సెప్టెంబర్ 17, 1987లో స్థాపించారు. ఈ కంపెనీ నినాదం మొదట భద్రత & తదుపరి ఉత్పత్తి. అణు టెక్నాలజీకి సంబంధించిన సైట్ సెలక్షన్, డిజైన్, కన్‌స్ట్రక్షన్, ఆపరేషన్, మెయింటెనెన్స్, రినోవేషన్, మోడ్రనైజేషన్ అండ్ అప్ గ్రేడేషన్, ప్లాంట్ లైఫ్ ఎక్స్‌టెన్షన్, న్యూక్లియర్ రియాక్టర్‌కు సంబంధించిన తదితర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది.

పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
మొత్తం పోస్టుల సంఖ్య: 150 (జనరల్-61, ఓబీసీ-36, ఎస్సీ-25, ఎస్టీ-28)
పనిచేసే ప్రదేశం: దేశంలోని ఎన్‌పీసీఐఎల్ యూనిట్లలో ఎక్కడైనా
విభాగాలవారీగా ఖాళీలు: మెకానికల్-52, , కెమికల్-12, సివిల్-40, ఎలక్ట్రికల్-30, ఇన్‌స్ట్రుమెంటేషన్-8, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్-8
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత. గేట్-2017లో ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు: 2017 జూన్ 15 నాటికి 26 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్ : ఎగ్జిక్యూటివ్ శిక్షణ కాలంలో రూ. 35,000/-(స్టయిఫండ్), ఒకసారి బుక్ అలవెన్స్ రూ. 10,000/- ఇస్తారు.ప్రొబేషనరీ పీరియడ్ తర్వాత సైంటిఫిక్ ఆఫీసర్ హోదాలో రూ. 56,100/- జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది. ఓరియేంటేషన్ కోర్సు ప్రోగ్రాం న్యూక్లియర్ ట్రెయినింగ్ సెంటర్లలో (తారాపూర్, రావత్‌బట్టా, కల్పకం,కైగా, కుడంకుళం) ఉంటుంది
ఎంపిక: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2017 స్కోర్ ఆధారంగా.. పర్సనల్ ఇంటర్వ్యూ.

పర్సనల్ ఇంటర్వ్యూ 100 మార్కులకు ఉంటుంది. దీనిలో జనరల్ కేటగిరీ అభ్యర్థులు 70 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 60 శాతం మార్కులను తప్పనిసరిగా సాధించాలి.
ప్రొబేషనరీ పీరియడ్‌లో చూపిన పర్‌ఫార్మెన్స్ ఆధారంగా దేశంలో ఏక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 15
వెబ్‌సైట్: www.npcilcareers.co.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------



మహాత్మా గాంధీ యూనివర్సి టీలో ఉద్యోగాలు.


మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీ (బీహార్)లో టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
MAHATHMA
వివరాలు:

పార్లమెంటరీ యాక్ట్ ప్రకారం ప్రారంభించిన బీహార్‌లోని మహాత్మాగాంధీ సెంట్రల్ యూనివర్సిటీ ఈస్ట్ చంపారన్ జిల్లాలో ఉంది.
ప్రొఫెసర్ - 14 ఖాళీలు
అసోసియేట్ ప్రొఫెసర్ - 20 ఖాళీలు
విభాగాలు : లైఫ్ సైన్సెస్, కామర్స్ అండ్ మేనేజ్‌మెంట్ సైన్సెస్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, మ్యాథ్స్, స్టాటిస్టికల్ సైన్సెస్, సోషల్ సైన్సెస్, ఫిజికల్, మెటీరియల్ సైన్సెస్, హ్యూమానిటీస్ అండ్ లాంగ్వేజెస్.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: జూన్ 27
ఫీజు: రూ. 1,000/-
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
వెబ్‌సైట్: http://www.mgcub.ac.in

0 comments:

Post a Comment