Wednesday, 7 June 2017

NIN Recruitment Notification,MECIL managers Jobs,Indian OIL Recruitment Notification,Jobs at BECIL. ఎన్‌ఐఎన్‌లో ఉద్యోగాలు, ఎమ్‌ఈసీఎల్‌లో మేనేజర్లు ఉద్యోగాలు, ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాలు, బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.

ఎన్‌ఐఎన్‌లో ఉద్యోగాలు,

హైదరాబాద్ తార్నాకలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్‌ఐఎన్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
NIN-HYD 
వివరాలు:

ఎన్‌ఐఎన్ ఐసీఎంఆర్ పరిధిలో పనిచేస్తుంది. ప్రస్తుతం ఏసీహెచ్‌ఈ ప్రాజెక్ట్‌లో పనిచేయడానికి ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
-సీనియర్ ప్రాజెక్ట్ రిసెర్చ్ ఫెలో - 1 ఖాళీ
-అర్హతలు: ఎంఫార్మాలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. రెండేండ్ల రిసెర్చ్ అనుభవం.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-జీతం: నెలకు రూ. 28 వేలు. దీంతోపాటు హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
-కాలపరిమితి: మొదట ఏడాది కాలానికి భర్తీ చేస్తారు. తర్వాత పొడిగించే అవకాశం ఉంది.
-ఎంపిక: జూన్ 15న నిర్వహించే ఇంటర్వ్యూ/ రాతపరీక్ష ద్వారా
-డాటా ఎంట్రీ ఆపరేటర్ - 1
-అర్హత: ఇంటర్‌తోపాటు కంప్యూటర్‌పై గంటకు కనీసం 15వేల కీ డిప్రెషన్స్ టైప్ చేసే సామర్థ్యం కలిగి ఉండాలి.
-జీతం: నెలకు రూ. 17,000/-
-కాలపరిమితి: మొదట ఏడాది కాలానికి పోస్టింగ్ ఇస్తారు. తర్వాత పొడిగించే అవకాశం ఉంది.
-మల్టీటాస్కింగ్ స్టాఫ్ - 1 ఖాళీ
-అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష 
ఉత్తీర్ణత.
-వయస్సు: 25 ఏండ్లు మించరాదు
-అనుభవం: ప్రభుత్వ ఆర్గనైజేషన్స్‌కు చెందిన ల్యాబ్స్‌లో పనిచేసిన అనుభవం ఉండాలి.
-జీతం: నెలకు రూ. 15,800/-
-ఎంపిక: ఇంటర్వ్యూ / రాతపరీక్ష ద్వారా
-స్థలం: ఎన్‌ఐఎన్‌లో జూన్ 15న ఈ పరీక్షలు నిర్వహించి ఎంపికచేస్తారు.

-వెబ్‌సైట్: http://www.ninindia.org




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఎమ్‌ఈసీఎల్‌లో మేనేజర్లు ఉద్యోగాలు,

మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎమ్‌ఈసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
MECL-RECRUITEMENT
వివరాలు:
మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పరిధిలో పనిచేస్తున్న మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఒక మినీరత్న కంపెనీ.
-మొత్తం పోస్టుల సంఖ్య : 15
-పోస్టు పేరు: మేనేజర్ (జియాలజీ)-11 పోస్టులు (జనరల్-8, ఓబీసీ-2, ఎస్సీ-1)
-పోస్టు: అసిస్టెంట్ మేనేజర్ (జియాలజీ)-4 పోస్టులు (ఓబీసీ-1, ఎస్సీ-1, ఎస్టీ-2)
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ/ఎంటెక్ (జియాలజీ, అప్లయిడ్ జియాలజీ), ఎంటెక్ (జియలాజికల్ టెక్నాలజీ) లేదా తత్సమాన 
పరీక్షలో ఉత్తీర్ణత.
-పోస్టు పేరు: అసిస్టెంట్ కెమిస్ట్-5 పోస్టులు
-వయస్సు: 2017 మే 9 నాటికి అసిస్టెంట్ 
మేనేజర్‌కు 40 ఏండ్లు, మేనేజర్‌కు 45 ఏండ్లుకు మించరాదు. వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ.29,100-54500/-
(అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.24,900-54500/-)
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: జూన్ 30

-వెబ్‌సైట్:www.mecl.gov.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇండియన్ ఆయిల్‌లో ఉద్యోగాలు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్)లో రిసెర్చ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు:
ఇండియన్ ఆయిల్ ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీ జాబితాలో 161వ స్థానంలో ఉంది. దేశంలోని 23 రిఫైనరీల్లో 11 రిఫైనరీలు ఐవోసీఎల్ పరిధిలో ఉన్నాయి. 
-మొత్తం ఖాళీల సంఖ్య - 33. 
-గ్రేడ్ - ఏ రిసెర్చ్ ఆఫీసర్ - 14 ఖాళీలు.
-అర్హతలు: కెమిస్ట్రీలో పీహెచ్‌డీ (ఆర్గానిక్/ఇనార్గానిక్ లేదా ఫిజికల్, అనలిటికల్, ఆర్గానో మెటాలిక్స్) చేసి ఉండాలి. కనీసం 65 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
-రిసెర్చ్ ఏరియా: ఇండస్ట్రియల్ ల్యూబ్రికెంట్స్, సింథటిక్ ల్యూబ్రికెంట్స్, మెటల్ వర్కింగ్ ఆయిల్, గ్రీజ్, నానోటెక్నాలజీ, అనలిటికల్, ఆల్టర్నేటివ్ ఎనర్జీ, ఫ్యూయల్ అండ్ ఆడిటివ్ విభాగాలు.
-వయస్సు: 32 ఏండ్లు మించరాదు
-రిసెర్చ్ ఆఫీసర్ - 2 ఖాళీలు
డఅర్హతలు: పీహెచ్‌డీలో ఆర్గానిక్ లేదా ఆర్గానో మెటాలిక్స్, పాలిమర్ కెమిస్ట్రీ చేసి ఉండాలి. కనీసం 65 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ 
ఉత్తీర్ణత.
రిసెర్చ్ ఏరియా: పెట్రోకెమికల్, పాలిమర్స్
-వయస్సు: 32 ఏండ్లు మించరాదు.
-రిసెర్చ్ ఆఫీసర్ - 1
రిసెర్చ్ ఏరియా: క్యాటలిస్ట్
-అర్హతలు: పీహెచ్‌డీలో క్యాటలిస్ట్/మెటీరియల్ సైన్సెస్. డిగ్రీ, పీజీలో కనీసం 65 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-రిసెర్చ్ ఆఫీసర్ - 2 ఖాళీలు
రిసెర్చ్ ఏరియా - బ్యాటరీ
-రిసెర్చ్ ఆఫీసర్ - 2 ఖాళీలు
రిసెర్చ్ ఏరియా: ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ
-ఇవేకాకుండా మరికొన్ని విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి. వివరాలు వెబ్‌సైట్‌లో చూడవచ్చు.
-ఎంపిక: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల సంఖ్యను బట్టి టైర్ -1 లేదా టైర్ - 1, 2 విధానంలో ఎంపికచేస్తారు.
-పేస్కేల్: చీఫ్ రిసెర్చ్ ఆఫీసర్ -రూ. 43,200 - 66,000*
-రిసెర్చ్ మేనేజర్ - రూ. 32,900 - 58,000*
-అసిస్టెంట్ మేనేజర్ రిసెర్చ్ - రూ. 29,100-54,500*
-రిసెర్చ్ ఆఫీసర్ - రూ. 24,900-50,500*
-దరఖాస్తు ఫీజు: రూ. 300/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూలై 7 
-వెబ్‌సైట్: www.iocl.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో ఉద్యోగాలు.



బ్రాడ్‌కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
Broadcast-Engineering
వివరాలు:
బీఈసీఐఎల్ భారత ప్రభుత్వ సంస్థ. ఇది సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. ఇది ఒక మినీరత్న కంపెనీ.
-ప్రాజెక్ట్ మేనేజర్ - 2, టీమ్ లీడ్ - 1, డాటా బేస్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ - 2, డాటాబేస్ అడ్మినిస్ట్రేషన్ సపోర్ట్ లెవల్: 1 - 2 పోస్టులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్ - 2, టెస్టర్ - 1 ఖాళీ ఉన్నాయి.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: జూన్ 26 
-వెబ్‌సైట్: www.becil.com.

0 comments:

Post a Comment