Monday, 26 June 2017

NIELIT Admissions,RGIPT Admissions Notification ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ప్రవేశాలు, ఆర్‌జీఐపీటీలో ప్రవేశాలు.

ఎన్‌ఐఈఎల్‌ఐటీలో ప్రవేశాలు,

ఔరంగాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎన్‌ఐఈఎల్‌ఐటీ) ఎంటెక్, బీటెక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
NIELIT
వివరాలు:
ఎన్‌ఐఈఎల్‌ఐటీ భారత ప్రభుత్వరంగ సంస్థ. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది.
మొత్తం సీట్ల సంఖ్య: 169
-ఎంటెక్ (ఈడీటీ) ఫుల్‌టైమ్- 25, పార్ట్‌టైమ్-24
-బీటెక్ (ఈఎస్‌ఈ)- 60
అర్హత: లేటరల్ ఎంట్రీ ద్వారా డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-డిప్లొమా (డీఈపీఎం)- 60
అర్హత: లేటరల్ ఎంట్రీ ద్వారా పదోతరగతి+ఐటీఐ, ఇంటర్ అభ్యర్థులకు అవకాశం
చివరితేదీ: జూలై 1
-పూర్తి వివరాల కోసం
వెబ్‌సైట్: nielit.gov.in/aurangabad----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌జీఐపీటీలో ప్రవేశాలు.
ఉత్తరప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ (ఆర్‌జీఐపీటీ) 2017-18 విద్యా సంవత్సరానికి బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
rajiv-gandhi-institute
వివరాలు:
ఆయిల్ ఇండస్ట్రీ డెవలప్‌మెంట్ బోర్డు సహకారంతో ఆర్‌జీఐపీటీ ఆరు పబ్లిక్ సెక్టార్ యూనిట్లు (ONGC, IOCL, OIL, GAIL, BPCL, HPCL)
సహాయాన్ని అందిస్తుంది.
కోర్సు పేరు: నాలుగేండ్ల బీటెక్ (పెట్రోలియం/కెమికల్ ఇంజినీరింగ్)
మొత్తం సీట్ల సంఖ్య: 120 (పెట్రోలియం- 60 సీట్లు, కెమికల్- 60 సీట్లు)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్ (పీసీఎం) లేదా తత్సమాన పరీక్షలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఐఐటీ జేఈఈ-2017 అడ్వాన్స్‌డ్‌లో ర్యాంక్‌ను సాధించాలి.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 1000/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 500/-
ఎంపిక: ఐఐటీ జేఈఈ-2017 అడ్వాన్స్‌డ్‌లో వచ్చిన ర్యాంక్ ఆధారంగా.

కోర్సు పేరు: ఎంటెక్ (పెట్రోలియం/ కెమికల్ ఇంజినీరింగ్)
మొత్తం సీట్ల సంఖ్య: 40 (పెట్రోలియం- 20 సీట్లు, కెమికల్- 20 సీట్లు)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఈ/బీటెక్ (పెట్రోలియం/కెమికల్ ఇంజినీరింగ్)లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో ఉత్తీర్ణత.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 400/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 200/-
ఎంపిక: గేట్ స్కోర్, రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
కోర్సు పేరు: పీహెచ్‌డీ
విభాగాలు: పెట్రోలియం ఇంజినీరింగ్, జియాలజికల్ సైన్స్, బేసిక్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్, మేనేజ్‌మెంట్ అండ్ హ్యూమనిటీస్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్, ఎంటెక్, మాస్టర్ డిగ్రీలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. గేట్, నెట్, ఎన్‌బీహెచ్‌ఎం, క్యాట్, జీమ్యాట్, జీఆర్‌ఈలో స్కోర్ కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక: గేట్ రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 30, బీటెక్ కోర్సులకు జూలై 9
రాతపరీక్ష తేదీ: ఎంటెక్ అభ్యర్థులకు జూలై 13, పీహెచ్‌డీ అభ్యర్థులకు జూలై 23
వెబ్‌సైట్: www.rgipt.ac.in0 comments:

Post a Comment