Thursday, 1 June 2017

NCC Special Entry in Air Force,Admissions to MSME Technical Courses,Center for Excellence Entries in 8,9 classes,Diploma Course in CDAC ఎయిర్‌ఫోర్స్‌లో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ, ఎంఎస్‌ఎంఈ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలు, సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ 8,9 తరగతుల్లో ప్రవేశాలు, సీ-డాక్‌లో డిప్లొమా కోర్సు.

ఎయిర్‌ఫోర్స్‌లో ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ,

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ప్లయింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న కమిషన్డ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఎన్‌సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీం కింద పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:

రక్షణశాఖ పరిధిలో పనిచేస్తున్న ఇండియన్ ఎయిర్
ఫోర్స్‌లో ఈ పోస్టులు ఉన్నాయి. ఇది జనవరి 2018లో ప్రారంభమవుతుంది. షార్ట్‌సర్వీస్ కమిషన్‌లో భాగంగా పురుష/మహిళా అభ్యర్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
-పోస్టు పేరు: కమిషన్డ్ ఆఫీసర్
-అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీ (బీఈ/బీటెక్)తోపాటు ఎన్‌సీసీ సీ సర్టిఫికెట్ ఉన్నవారు అర్హులు. ఇంటర్‌స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్ట్‌లను చదివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియాలో అసోసియేట్ మెంబర్‌షిప్/ ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియాలో ఏ అండ్ బీ ఎగ్జామినేషన్‌లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
-వయస్సు: 2018 జనవరి 1 నాటికి 20 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. 1994, జనవరి 2 - 1998, జనవరి 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎత్తు, బరువు: 162.5 సెంటీమీటర్లు ఎత్తుతోపాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
-ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
ఎంపిక విధానం:

-అభ్యర్థుల అర్హతలను బట్టి షార్ట్‌లిస్ట్ చేసి ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డు రాతపరీక్ష, ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
-డెహ్రాడూన్, మైసూర్, వారణాసి ఏఎఫ్‌ఎస్‌బీ క్యాంపస్‌ల్లో ఎంపికైన వారిని మూడు అంచెల పద్ధతిలో పరీక్షించి శిక్షణకు ఎంపిక చేస్తారు.
-జీతం : నెలకు సుమారుగా రూ. 82,050/-
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-చివరితేదీ: జూన్ 15
-జాబ్ వచ్చాక పాన్‌కార్డ్‌ను తప్పనిసరిగా ఉండాలి





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎంఎస్‌ఎంఈ టెక్నికల్ కోర్సుల్లో ప్రవేశాలు,

దేశవ్యాప్తంగా నిష్ణాతులైన సాంకేతిక నిపుణులను తయారుచేయడానికి ఏర్పాటుచేసిన టూల్‌రూంలలో ప్రవేశాల కోసం హైదరాబాద్, ఔరంగాబాద్, కోల్‌కతా క్యాంపస్‌ల ప్రకటనలు విడుదలయ్యాయి.
MSME-PEOPLES
వివరాలు:

కేంద్ర పరిధిలోని ఎంఎస్‌ఎంఈ మంత్రిత్వశాఖ పరిధిలో ఈ టూల్‌రూంలు పనిచేస్తాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన నిపుణుల తయారీకోసం డెన్మార్క్, జర్మనీ వంటి దేశాలతో కలిసి దేశంలో ఈ కేంద్రాలను స్థాపించారు. ప్రస్తుతం ఇండోర్, అహ్మదాబాద్, లూథియానా, హైదరాబాద్, భువనేశ్వర్, జంషెడ్‌పూర్, కోల్‌కతా, జలంధర్, నాగ్‌పూర్‌లలో టూల్‌రూంలు ఉన్నాయి. ఇవేకాకుండా టూల్ డిజైన్ సెంటర్లు కూడా ఉన్నాయి.
-టూల్‌రూం - హైదరాబాద్:
-ఎంఎస్‌ఎంఈ - టూల్‌రూం బాలానగర్‌లో ఉంది.
కోర్సులు -అర్హతలు:
-మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ మెకానికల్ క్యాడ్/క్యామ్
-ఈ కోర్సు రెండేండ్ల కాలవ్యవధిగలది.
-సీట్ల సంఖ్య - 32
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో మెకానికల్ లేదా మెకట్రానిక్స్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ - టూల్ డిజైన్:
-ఈ కోర్సు రెండేండ్ల కాలపరిమితిగలది.
-సీట్ల సంఖ్య - 32
-అర్హతలు: బీఈ/బీటెక్‌లో కనీసం 55 శాతం మార్కులతో మెకానికల్/ప్రొడక్షన్ లేదా మెకట్రానిక్స్‌లో ఉత్తీర్ణత.
-మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ - డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్
-ఇది రెండేండ్ల కోర్సు.
-సీట్ల సంఖ్య - 32
-అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఆటోమొబైల్ లేదా ఏరోనాటికల్ లేదా మెకానికల్, మెకట్రానిక్స్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-కోర్సుఫీజు: సెల్ఫ్ స్పాన్సర్డ్ అభ్యర్థులకు సెమిస్టర్‌కు రూ. 41,000/-
-ఎంపిక: ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ ద్వారా
-ఎగ్జామ్‌తేదీ: జూలై 2, ఓయూ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, ఓయూ క్యాంపస్, హైదరాబాద్‌లో ఉదయం 11 గంటలకు.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
-చివరితేదీ: జూన్ 10
-వెబ్‌సైట్: www.citdi-dia.org

ఎంఎస్‌ఎంఈ - టూల్‌రూం కోల్‌కతా కోల్‌కతాలోని టూల్‌రూంలో కింది కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:

కోల్‌కతా టూల్‌రూంని టెక్నికల్ కోఆపరేషన్ ప్రోగ్రామ్‌లో భాగంగా భారత్ - డెన్మార్క్ కలిసి ఏర్పాటు చేశాయి. సెంట్రల్ టూల్‌రూం అండ్ ట్రెయినింగ్ సెంటర్ (సీటీటీసీ)లో కోర్సులు చేసిన 93 శాతం మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్ లభించింది.
కోర్సులు - వివరాలు:
-పోస్ట్ డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్
-ఇది ఏడాది కోర్సు. ఫీజు: రూ. 61,000/-
-అర్హతలు: మెకానికల్/ప్రొడక్షన్ లేదా ఇన్‌స్ట్రుమెంటేషన్‌లో ఇంజినీరింగ్‌లో డిప్లొమా లేదా డిగ్రీ ఉత్తీర్ణత.
-అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ మెషీన్ మెయింటెనెన్స్ అండ్ ఆటోమేషన్
-ఇది ఆరునెలల కోర్సు. ఫీజు: రూ. 44,500/-
-డిప్లొమా ఇన్ టూల్ అండ్ డై మేకింగ్ కోర్సు:
-ఇది నాలుగేండ్ల కాలవ్యవధిగల కోర్సు.
-అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సులో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులయితే 40 శాతం మార్కులు వస్తే సరిపోతుంది.
-వయస్సు: 15 - 19 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఈ కోర్సు పూర్తిచేసిన వారికి గతంలో 100 శాతం ప్లేస్‌మెంట్ అసిస్టెంట్స్ లభించింది.
-ఎంపిక: రాతపరీక్ష ద్వారా
-రాతపరీక్ష తేదీ: జూన్ 25
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
-చివరితేదీ: జూన్ 10
-వీటితోపాటు మాస్టర్ సర్టిఫికెట్ కోర్సు ఇన్ ఆటోమేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, అడ్వాన్స్‌డ్ ఎంబెడెడ్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ సర్టిఫికెట్ కోర్సు ఇన్ టూల్‌రూం డిజైన్ అండ్ క్యాడ్/క్యామ్, సర్టిఫికెట్ కోర్సులు - మెషనింగ్, సీఎన్‌సీ మిల్లింగ్, సీఎన్‌సీ టర్నింగ్ ఉన్నాయి.
-వెబ్‌సైట్: www.msmetoolroomkolkata.com





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ 8,9 తరగతుల్లో ప్రవేశాలు,

కరీంనగర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ 2017-18 విద్యాసంవత్సరానికిగాను ఎనిమిది, తొమ్మిదో తరగతి ప్రవేశాల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Social-Welfare
వివరాలు:

తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్యర్యంలో నడుస్తున్న సంస్థ.
-కరీంనగర్‌లోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో సీట్ల వివరాలు:
-మొత్తం సీట్ల సంఖ్య: 160
(ఎనిమిదో తరగతి-80, తొమ్మిదో తరగతి-80 )
గమనిక: టీఎస్‌డబ్ల్యూఆర్ ఇన్‌స్టిట్యూషన్లలో ఆరు నుంచి తొమ్మిదో తరగతిల్లో ఖాళీగా ఉన్న సీట్లు కోసం.
-అర్హత: 2016-17 విద్యాసంవత్సరంలో ఇంగ్లిష్ మీడియంలో 5 నుంచి 8వ తరగతి చదివిన విద్యార్థులు అర్హులు.
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా.
-ఆరు నుంచి ఏడోతరగతి పరీక్ష సిలబస్- ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. 120 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్-30, మ్యాథ్స్-30, సైన్స్-30, మెంటల్ ఎబిలిటీ-10.
-ఎనిమిదో తరగతి పరీక్ష సిలబస్- మొత్తం 140 మార్కులకు ఉంటుంది. 150 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇంగ్లిష్-30, మ్యాథ్స్-30, జనరల్ సైన్స్-40, కరెంట్ అఫైర్స్ అండ్ ఆప్టిట్యూడ్-40
-తోమ్మిదో తరగతి పరీక్ష సిలబస్- మొత్తం 140 మార్కులకు ఉంటుంది. 150 నిమిషాల్లో పూర్తిచేయాలి. ఇంగ్లిష్-30, మ్యాథ్స్-30, ఫిజికల్ సైన్స్-20, బయాలజీ -20, కరెంట్ అఫైర్స్ అండ్ ఆప్టిట్యూడ్-40.
-ఈ ప్రశ్నలు ప్రీవియస్ తరగతి నుంచి వస్తాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 7
-హాల్‌టిక్కెట్స్ డౌన్‌లోడింగ్: జూన్ 8
-ప్రవేశ పరీక్ష: జూన్ 18



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీ-డాక్‌లో డిప్లొమా కోర్సు.


హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ ( సీ-డాక్) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CDAC
వివరాలు:

ఇది మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అనుబంధంగా పనిచేస్తుంది.
-విభాగాలు: జియోఇన్ఫర్మాటిక్స్, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్, మొబైల్ కంప్యూటింగ్/ఎంబె డెడ్ సిస్టమ్ డిజైన్/సిస్టమ్ సాప్ట్‌వేర్ డెవలప్‌మెంట్, ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సిస్టమ్ అండ్ సెక్యూరిటీ, వీఎల్‌ఐసీ డిజైన్, బయోమెడికల్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ హెల్త్ ఇన్ఫర్మాటిక్స్, బిగ్‌డాటా అనలిటిక్స్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్, హెచ్‌పీసీ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్
-అర్హత: బీఈ/బీటెక్, పీజీ (అప్లయిడ్ సైన్స్, జాగ్రఫీ, జియాలజీ, ఫిజిక్స్, మ్యాథమెటిక్స్), ఎంసీఏ, ఎంసీఎం, బయోమెడికల్ ఇంజినీరింగ్ బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.
-ఎంపిక: కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
-హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్: జూన్ 15 నుంచి 22 వరకు
-చివరితేదీ: జూన్ 8
-ప్రవేశ పరీక్షతేదీ : జూన్ 18,25



0 comments:

Post a Comment