Wednesday, 14 June 2017

Junior Trainees in Steel plant,Benaras Hindu University Recruitment Teaching Non teaching Jobs,Senior Residences in Aims,National Resource Person at NIRDPR. స్టీల్‌ప్లాంట్‌లో జూనియర్ ట్రెయినీలు, బెనారస్ హిందూ యూనివర్సిటీలో, ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్లు, ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో నేషనల్ రిసోర్స్ పర్సన్.

స్టీల్‌ప్లాంట్‌లో జూనియర్ ట్రెయినీలు,

ఎస్సెస్సీతోపాటు ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు అవకాశం
-మొత్తం పోస్టుల సంఖ్య -736
-ఉద్యోగ భద్రత, మంచి జీతభత్యాలు
-రాతపరీక్ష ద్వారా ఎంపిక
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 21

trainees 
రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్‌కు చెందిన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ (వీఎస్‌పీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ ట్రెయినీ, ఫీల్డ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భారతదేశంలోని సముద్ర తీర ఆధారిత ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్. ఇది నవరత్న కంపెనీ.
పోస్టు పేరు: జూనియర్ ట్రెయినీ 
మొత్తం పోస్టుల సంఖ్య: 645. దీనిలో మెకానికల్ -344, ఎలక్ట్రికల్-203, మెటలర్జీ-98 పోస్టులు ఉన్నాయి.
విభాగాలవారీగా ఖాళీలు: 
-ఎలక్ట్రికల్-203 పోస్టులు (జనరల్-105, ఓబీసీ-58, ఎస్సీ-34, ఎస్టీ-6)
-మెకానికల్-344 పోస్టులు (జనరల్-174, ఓబీసీ-103, ఎస్సీ-59, ఎస్టీ-8)
-మెటలర్జీ-98 పోస్టులు (జనరల్-49, ఓబీసీ-29, ఎస్సీ-19, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి ఎస్సెస్సీ/మెట్రిక్యులేషన్+ ఫుల్‌టైమ్ ఐటీఐ (ఫిట్టర్, మెషినిస్ట్, మిల్‌రైట్, టర్నర్, ఎలక్ట్రీషియన్) లేదా డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (మెకానికల్, ఎలక్ట్రికల్, మెటర్జికల్)లో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 50 శాతం) మార్కులతో ఉత్తీర్ణత. ఇంటర్, బీఎస్సీ, బీకాం, బీఏ చదివిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

-ఫీల్డ్ అసిస్టెంట్ ట్రెయినీ-91 పోస్టులు (జనరల్-46, ఓబీసీ-25, ఎస్సీ-14, ఎస్టీ-6)
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/బోర్డు నుంచి ఎస్సెస్సీ/మెట్రిక్యులేషన్‌లో ఉత్తీర్ణత. ఇంటర్, ఐటీఐ చేసిన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2017 మార్చి 1 నాటికి 27 ఏండ్లకు మించరాదు. కంపెనీ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్: జూనియర్ ట్రెయినీ పోస్టులకు శిక్షణలో భాగంగా మొదటి ఏడాది రూ. 10,700/- (కన్సాలిడేటెడ్ పే), రెండో ఏడాది రూ. 12,200/- స్టయిఫండ్ ఇస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ పే స్కేల్ రూ. 16800-3%-24,110/- ఇస్తారు. ఫీల్డ్ అసిస్టెంట్ ట్రెయినీ పోస్టులకు శిక్షణలో భాగంగా మొదటి ఏడాది రూ. 8,600/- (కన్సాలిడేటెడ్ పే), రెండో ఏడాది రూ. 10,000/- స్టయిఫండ్ ఇస్తారు. ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత రెగ్యులర్ పే స్కేల్ రూ. 15,830-3%-22,150/- ఇస్తారు.
ఎత్తు: పురుష అభ్యర్థులు-150 సెంటీమీటర్లు, మహిళా అభ్యర్థులు 143 సెంటీమీటర్లు.
బరువు: పురుష అభ్యర్థులు కనీసం 45 కిలోలు, మహిళా అభ్యర్థులు 35 కిలోలు ఉండాలి. 

ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు
అప్లికేషన్ ఫీజు: రూ. 300/-జనరల్, ఓబీసీ అభ్యర్థులు, ఎస్సీ, ఎస్టీ , పీహెచ్‌సీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
రాతపరీక్ష సిలబస్: జనరల్ ఆప్టిట్యూడ్, సంబంధిత సబ్జెక్ట్ (మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలర్జీ) అంశాలపై ప్రశ్నలు ఇస్తారు. ప్రశ్నపత్రం తెలుగు/ఇంగ్లిష్‌లో ఉంటుంది. ఫీల్డ్ అసిస్టెంట్‌కు కేవలం జనరల్ ఆప్టిట్యూడ్‌పైన మాత్రమే ప్రశ్నలను అడుగుతారు.
-రాతపరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మెరిట్ ప్రాతిపదికన సర్టిఫికెట్ వెరిఫికేషన్‌కు పిలుస్తారు. కేవలం రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎంపిక జాబితాను ప్రకటిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. హాల్‌టికెట్ సంబంధించిన వివరాలను ఈ-మెయిల్ ఐడీ ద్వారా తెలియజేస్తారు.

ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 21
డౌన్‌లోడ్ కాల్‌లెటర్స్: జూలై 3 నుంచి 9 వరకు..
రాతపరీక్షతేదీ: జూలై 9 జూనియర్ ట్రెయినీ (10.00 AM to 12.00 Noon), ఫీల్డ్ అసిస్టెంట్ ట్రెయినీ (3.00 PM to 5.00 PM) 
రాతపరీక్ష ప్రిలిమినరీ కీ విడుదల: జూలై 10 (సాయంత్రం 5 గంటలకు)
రాతపరీక్ష ఫైనల్ కీ విడుదల: జూలై 12
రాతపరీక్ష ఫలితాలు విడుదల: జూలై 22
వెబ్‌సైట్: www.vizagsteel.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉద్యోగాలు,


వారణాసిలోని బెనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) స్కూల్ టీచింగ్, నాన్‌టీచింగ్, ఎండోమెంట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్టాఫ్ నర్స్, జూనియర్ క్లర్క్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BHU-building 
వివరాలు: 
బెనారస్ హిందూ యూనివర్సిటీని మదన్ మెహన్ మాలవ్య 1916లో స్థాపించారు. బీహెచ్‌యూ సెంట్రల్ హిందూ కాలేజీగా పిలిచేవారు.
గ్రూప్ ఏ పోస్టుల వివరాలు: 
-డిప్యూటీ రిజిస్ట్రార్-6, అసిస్టెంట్ రిజిస్ట్రార్-4, 
-మెడికల్ సూపరింటెండెంట్-1, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్-2, మెడికల్ ఆఫీసర్-2, రిసెర్చ్ ఆఫీసర్-1
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ, ఎంబీబీఎస్, పీజీ ఉండాలి. నెట్, స్లెట్/సెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
గ్రూప్ బీ పోస్టుల వివరాలు
-స్టాఫ్ నర్స్-460 పోస్టులు (జనరల్-231, ఓబీసీ-125, ఎస్సీ-69, ఎస్టీ-35)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డు నుంచి పదోతరగతితో పాటు నర్సింగ్‌లో బీఎస్సీ (ఆనర్స్)లో ఉత్తీర్ణత/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సెంట్రల్/ స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో సభ్యత్వాన్ని కలిగి ఉండాలి.
-జూనియర్ క్లర్క్ -100 పోస్టులు (జనరల్-53, ఓబీసీ-25, ఎస్సీ-14, ఎస్టీ-8)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ అప్లికేషన్‌లో పరిజ్ఞానం ఉండాలి.
-ఆక్యుపేషనల్ థెరపిస్ట్-1
-పూజారి -1
-లైబ్రేరీ అటెండెంట్-24 పోస్టులు (జనరల్-15, ఓబీసీ-4, ఎస్సీ-4, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతితో లైబ్రేరీ సైన్స్‌లో డిప్లొమా ఉండాలి.

స్కూల్ టీచింగ్ పోస్టులు
-అసిస్టెంట్ టీచర్ (పీజీటీ)-1
-అసిస్టెంట్ టీచర్ (టీజీటీ)-3
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీతోపాటు బీఈడీ ఉండాలి.
వయస్సు: 18 ఏండ్ల నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. పూర్తివివరాలతోపాటు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
చిరునామా: Registrar Recruitment & Assessment Cell,Holkar Houser, BHU, Varanasi -221005 
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 19
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేదీ: జూన్ 24
వెబ్‌సైట్: http://www.bhu.ac.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిమ్స్‌లో సీనియర్ రెసిడెంట్లు,
రాజస్థాన్ (జోధ్‌పూర్)లోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
aiims-jodhpur 
వివరాలు:
జోధ్‌పూర్ ఎయిమ్స్ అనేది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తుంది. దీన్ని ప్రాంతీయ అసమానతలను సరిదిద్దే లక్ష్యంతో ప్రధాన్‌మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకంలో భాగంగా స్థాపించారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 111 పోస్టులు (జనరల్-74, ఓబీసీ-28, ఎస్సీ-8, ఎస్టీ-1)
విభాగాలు: అనస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, కమ్యూనిటీ మెడిసిన్ ఫ్యామిలీ మెడిసిన్, జనరల్ సర్జరీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్ మెడిసిన్, నియోనాటాలజీ, ఓ అండ్ జీ, ఆప్తాల్మాలజీ, పిడియాట్రిక్ సర్జరీ, పిడియాట్రిక్స్, ఫిజియాలజీ, పల్మనరీ మెడిసిన్, రేడియో డయాగ్నసిస్, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్ బ్యాంక్, కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, ఎండోక్రిమినాలజీ అండ్ మెటబాలిజం, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, సర్జికల్ ఆంకాలజీ, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, రేడియోథెరఫి, పాథాలజీ ల్యాబ్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, ఫార్మకాలజీ, డెంటిస్ట్రీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్, బీడీఎస్, ఎమ్మెస్సీతోపాటు ఎంఎస్, ఎండీ, డీఎన్‌బీ, ఎండీఎస్ లేదా పీజీ/పీహెచ్‌డీ / సంబంధిత సబ్జెక్ట్‌లో డిప్లొమా/డీఎన్‌బీలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జూలై 31 నాటికి 33 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: రూ.15,600-39,100 + గ్రేడ్ పే రూ. 6,600/- 
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ. 1,000/-, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ. 800/-
ఎంపిక: రాతపరీక్ష, అకడమిక్ రికార్డ్, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. పూర్తి వివరాలతోపాటు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్: www.aiimsjodhpur.edu.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌లో నేషనల్ రిసోర్స్ పర్సన్.


హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) ఖాళీగా ఉన్న నేషనల్ రిసోర్స్ పర్సన్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
nird-logo 
వివరాలు:
ఎన్‌ఐఆర్‌డీ అనేది గ్రామీణ అభివృద్ధి, పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేశారు.
పోస్టు పేరు: నేషనల్ రిసోర్స్ పర్సన్ 
విభాగాలు: ఫైనాన్షియల్ ఇన్‌క్లూజివ్, జెండర్, హెచ్‌ఆర్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ/పీజీలో ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా 
చివరి తేదీ: జూన్ 19
వెబ్‌సైట్: www.nird.org.in




0 comments:

Post a Comment