Tuesday, 20 June 2017

Junior Assistants Jobs in AAI,Scientist jobs in ICMR. ఏఏఐలో జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు, ఐసీఎంఆర్‌లో సైంటిస్టు ఉద్యోగాలు.

ఏఏఐలో జూనియర్ అసిస్టెంట్లు ఉద్యోగాలు,

ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఫైర్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న జూనియర్ అసిస్టెంట్స్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
aai-Airports 
వివరాలు: 
ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా భారత ప్రభుత్వంలోని పౌర విమానయాన శాఖ ఆధ్వర్యలో నడిచే సంస్థ. ఈ ఖాళీలు ఈస్టర్న్ రీజియన్‌లో ఉన్నాయి.
పోస్టు పేరు: జూనియర్ అసిస్టెంట్స్ 
విభాగం: ఫైర్ సర్వీస్
మొత్తం పోస్టుల సంఖ్య: 105 (జనరల్-56, ఓబీసీ-19, ఎస్సీ-13, ఎస్టీ-17)
-ఈస్టర్న్ రీజియన్ పరిధిలోని వెస్ట్ బెంగాల్, బీహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖంఢ్, సిక్కిం, అండమాన్ నికోబార్ దీవుల్లో పనిచేయాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి పదోతరగతితోపాటు మూడేండ్ల డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (మెకానికల్, ఆటోమొబైల్/ఫైర్)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా ఇంటర్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ లేదా లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ కలిగి ఉండాలి. ఎన్‌సీసీ బీ సర్టిఫికెట్, ఇంటర్ స్థాయిలో కంప్యూటర్ సర్టిఫికెట్, ఇండస్ట్రియల్ ఫైర్ సర్వీసెస్, ఏఏఐ ఫైర్ ట్రెయినింగ్ నుంచి బేసిక్ ఫైర్ ఫైటింగ్ ట్రెయినింగ్, నేషనల్ ఫైర్ సర్వీస్ కాలేజ్ నాగ్‌పూర్ నుంచి సబ్ ఫైర్ ఆఫీసర్ కోర్స్ సర్టిఫికెట్ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
వయస్సు : 2017 జూన్ 30 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, ఏఏఐలో పనిచేస్తున్న అభ్యర్థులకు పదేండ్ల వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

పే స్కేల్: రూ. 12,500-28,500/- అదనంగా బేసిక్ పే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీపీఎఫ్, గ్రాట్యుటీ, సోషల్ సెక్యూరిటీ స్కీమ్, పెన్షన్, మెడికల్ బెనిఫిట్స్‌లు ఉంటాయి.
ఫిజికల్ ఫిట్‌నెస్: ఎత్తు-167 సెం.మీ (మాహిళలు-157 సెం.మీ), ఛాతీ-81 సెం.మీ. గాలిని పీల్చినపుడు 5 సెం.మీ వ్యాకోచం చెందాలి. కనీసం 55 కేజీలకు (మహిళలు-45 కేజీలు) 
తగ్గకుండా ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ. 400/-. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, డ్రైవింగ్ టెస్ట్, పీఈటీ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
దరఖాస్తులకు చివరితేదీ : జూలై 19
ఫీజు చలానా చెల్లించడానికి చివరితేదీ : జూలై 21

వెబ్‌సైట్: www.aai.aero



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఎంఆర్‌లో సైంటిస్టు ఉద్యోగాలు.




న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐసీఎంఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Scientist
వివరాలు:
ఐసీఎంఆర్ దేశవ్యాప్తంగా మొత్తం 32 రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లను నిర్వహిస్తుంది.
పోస్టు పేరు: సైంటిస్ట్-బీ
పోస్టుల సంఖ్య: 7
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (బయోకెమిస్ట్రీ, కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఫుడ్ అండ్ న్యూట్రిషన్), సంబంధిత పీజీతోపాటు పీహెచ్‌డీ ఉండాలి.
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 48,000+ హెచ్‌ఆర్‌ఏను ఇస్తారు.
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, ఇంటర్వ్యూ రోజున పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి. అదే రోజున రాతపరీక్షను నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూ తేదీ: న్యూట్రిషన్ సైంటిస్ట్‌లకు ఇంటర్వ్యూ జూలై 10న, ఇతర సైంటిస్ట్ పోస్టులకు జూలై 1.
వెబ్‌సైట్: www.icmr.nic.in

0 comments:

Post a Comment