Monday, 5 June 2017

Indian railwayRecruitment For 588 apprentices posts,Rangareddy Medical Health Recruitment 225 posts,Task Management Trainees Jobs,Engineers Jobs in Wapco,Junior Artisans Jobs In ECIL రైల్వేలో 588 అప్రెంటిసెస్ పోస్టులు, రంగారెడ్డి మెడికల్ హెల్త్‌లో 225 పోస్టులు, టాస్క్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, వ్యాప్కోస్‌లో ఇంజినీర్లు, ఈసీఐఎల్‌లో జూనియర్ ఆర్టీషియన్లు.

రైల్వేలో 588 అప్రెంటిసెస్ పోస్టులు,
పదోతరగతి, ఐటీఐ అభ్యర్థులకు అవకాశం
-అకడమిక్ మార్కులతో ఎంపిక
-దరఖాస్తులకు చివరితేదీ జూన్ 17

East-Coast-Railway
ఈస్ట్‌కోస్ట్ రైల్వేలో అప్రెంటిసెస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
ఈస్ట్‌కోస్ట్ రైల్వే భువనేశ్వర్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఇది విశాఖపట్నం వరకు విస్తరించి ఉంది. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
-మొత్తం ఖాళీలు - 588.
-వీటిలో క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్, భువనేశ్వర్ - 97, ఖుర్దా రోడ్ డివిజన్ - 30, వాల్తేరు డివిజన్ - 461 పోస్టులు ఉన్నాయి.
-ట్రేడ్‌ల వారీగా ఖాళీల వివరాలు:
-క్యారేజ్ రిపేర్ వర్క్‌షాప్‌లో ఖాళీల సంఖ్య - 97. వీటిలో ఫిట్టర్ - 30, షీట్ మెటల్ వర్కర్ - 9, వెల్డర్ - 12, మెషినిస్ట్ - 6, మెకానిక్ (ఎంవీ) - 4, కార్పెంటర్ - 12, ఎలక్ట్రీషియన్ - 12, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ - 4, వైర్‌మ్యాన్ - 4, పెయింటర్ - 4 పోస్టులు ఉన్నాయి.
-ఖుర్దా రోడ్ డివిజన్‌లో - 30 పోస్టులు. వీటిలో ఫిట్టర్ - 14, వెల్డర్ (జీ అండ్ ఈ) - 4, టర్నర్ - 3, ఎలక్ట్రీషియన్ - 2, మెకానిస్ట్ - 2, డీజిల్ మెకానిక్ -1, ఎలక్ట్రానిక్స్ మెకానిక్ - 4 ఖాళీలు ఉన్నాయి.

-డీజిల్ లోకోషెడ్ - వాల్తేర్‌లో - 100 ఖాళీలు. వీటిలో మెషినిస్ట్ - 63, వెల్డర్ (జీ అండ్ ఈ) - 2, ఎలక్ట్రీషియన్ - 33 ఖాళీలు ఉన్నాయి.
-ఎలక్ట్రో లోకో షెడ్, వాల్తేర్, విశాఖపట్నంలో.. టర్నర్ - 1, వెల్డర్ (జీ అండ్ ఈ) - 1, ఎలక్ట్రీషియన్ - 78 ఖాళీలు ఉన్నాయి.
-సీ అండ్ డబ్ల్యూ (సైడింగ్), వైజాగ్‌లో మొత్తం 33 పోస్టులు. వీటిలో ఫిట్టర్ - 29, మెషినిస్ట్ -2, వెల్డర్ (జీ అండ్ ఈ) - 2 ఖాళీలు ఉన్నాయి.
-ఎలక్ట్రికల్ (జి) వాల్తేర్ డివిజన్‌లో ఖాళీల సంఖ్య - 82. వీటిలో ఎలక్ట్రీషియన్ - 60, రిఫ్రిజిరేషన్ అండ్ ఏసీ మెకానిక్ - 22 ఖాళీలు.
-ఎలక్ట్రికల్ (టీఆర్‌డీ), వాల్తేర్ డివిజన్‌లో ఖాళీల సంఖ్య - 17. ఇవన్నీ ఎలక్ట్రీషియన్ పోస్టులు.
-మెకానికల్ డిపార్ట్‌మెంట్, వాల్తేర్‌లో ఖాళీల సంఖ్య - 139. వీటిలో ఫిట్టర్ - 126, మెషినిస్ట్ - 4, వెల్డర్ (జీ అండ్ ఈ) - 6, కార్పెంటర్ - 3 ఖాళీలు ఉన్నాయి.
-ఇంజినీరింగ్ డిపార్ట్‌మెంట్, వాల్తేర్ డివిజన్‌లో ఖాళీల సంఖ్య - 9. వీటిలో వెల్డర్ (జీ అండ్ ఈ) - 3, కార్పెంటర్ - 6 ఖాళీలు ఉన్నాయి.
వయస్సు: 2017, జూన్ 17 నాటికి 15 - 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష (10+2 పరీక్ష విధానంలో)లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. దీంతోపాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉండాలి.
ఫీజు: రూ. 100

-ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
నోట్: అభ్యర్థులు ఏదైనా ఒక యూనిట్‌కు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
ఎంపిక: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల పదోతరగతి, ఐటీఐ మార్కుల ప్రాతిపదికన షార్ట్‌లిస్ట్ చేస్తారు. షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు రైల్వే నిబంధన ప్రకారం మెడికల్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి అప్రెంటిసెస్‌కు ఎంపికచేస్తారు.
-అప్రెంటిసెస్ యాక్ట్-1961 ప్రకారం శిక్షణ ఉంటుంది. శిక్షణా కాలం, స్టయిఫండ్ రైల్వేశాఖ నిబంధనల ప్రకారం ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 17
వెబ్‌సైట్: https://apprentice.rrcbbs.org.in or www.rrcbbs.org.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రంగారెడ్డి మెడికల్ హెల్త్‌లో 225 పోస్టులు,

రంగారెడ్డి జిల్లాలోని నేషనల్ అర్బన్ హెల్త్ మిషన్ స్కీమ్ కింద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెడికల్ ఆఫీసర్, స్టాఫ్ నర్స్, ల్యాబ్ టెక్నీషియన్, ఏఎన్‌ఎం, ఫార్మసిస్ట్, అకౌంటెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Rangareddy-Medical
వివరాలు:
ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు. రంగారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పని చేయాల్సి ఉంటుంది
మొత్తం పోస్టుల సంఖ్య: 225
-మెడికల్ ఆఫీసర్- 30 పోస్టులు (ఫుల్‌టైమ్-15, పార్ట్‌టైమ్-15)
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్ డిగ్రీలో ఉత్తీర్ణత. బోర్డు ఆఫ్ ఇండియన్ మెడిసిన్/టీఎస్ మెడికల్ కౌన్సిల్‌లో సభ్యత్వం కలిగి ఉండాలి. పార్ట్‌టైమ్ జాబ్ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8.30 గంటలవరకు పనిచేయాల్సి ఉంటుంది.
పే స్కేల్ : రూ. 35,000 (పార్ట్ టైమ్- రూ. 25000)
-స్టాఫ్ నర్స్- 30 పోస్టులు
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి జీఎన్‌ఎమ్/బీఎస్సీ (నర్సింగ్)లో ఉత్తీర్ణత. బోర్డు ఆఫ్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్టర్ చేసుకోవాలి.
పే స్కేల్ : రూ. 15,000/-

-ఫార్మసిస్ట్-15 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్‌తో పాటు ఫార్మసీలో డిప్లొమా ఉత్తీర్ణత, పే స్కేల్ : రూ. 11,000
-గ్రేడ్ 2 ల్యాబ్ టెక్నీషియన్-15 పోస్టులు
అర్హత: ఇంటర్మీడియట్‌తో పాటు డీఎంఎల్టీ/బీఎస్సీ (ఎల్‌టీ)లో ఉత్తీర్ణత. పారామెడికల్ బోర్డ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి,
పే స్కేల్ : రూ. 10,000
-అకౌంటెంట్-15 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకాంలో ఉత్తీర్ణత. కంప్యూటర్ నాలెడ్జ్‌లో పరిజ్ఞానం ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి, పే స్కేల్ : రూ. 12,000
-ఆగ్జిలరీనర్స్ మిడ్‌వైఫరీ (ఏఎన్‌ఎమ్)-75 పోస్టులు
అర్హత: పదోతరగతితోపాటు 18 నెలల మల్టీ పర్పస్ హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. రెండేండ్ల ఇంటర్మీడియట్ ఒకేషనల్ ఎంపీహెచ్‌డబ్ల్యూలో ఉత్తీర్ణత.
పే స్కేల్ : రూ. 10,000
-సపోర్టింగ్ స్టాఫ్- 45 పోస్టులు (ఔట్‌సోర్సింగ్ ద్వారా)
అర్హత: పదోతరగతి/ఎస్‌ఎస్‌సీలో ఉత్తీర్ణత. పే స్కేల్: రూ.5,389
వయస్సు: 2017 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్ మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలను జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: District Medical & Health Office, Ranga Reddy District, Near Pillar No.294, Shivarampally, Rajendra Nagar(M), Ranga Reddy-500 052
చివరి తేదీ: జూన్ 15 (సాయంత్రం 5 గంటలకు)
వెబ్‌సైట్: www.rangareddy.telangana.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
టాస్క్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,
హైదరాబాద్‌లోని తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఐటీఈ అండ్ సీ తెలంగాణ ప్రభుత్వం ఆధ్యర్వంలో పనిచేస్తుంది.
-మొత్తం పోస్టుల సంఖ్య:
-టెక్నికల్ ట్రెయినర్-సీఎఫ్‌డీ
-డెలివరీ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ట్రెయినర్ కమ్ కో ఆర్డినేటర్
-టెక్నికల్ ట్రెయినర్
-ప్లేస్‌మెంట్ ఎగ్జిక్యూటివ్
ఎంపిక: టెలిఫోనిక్ ఇంటర్వ్యూ, ముఖాముఖి ఇంటర్వ్యూ, హెచ్‌ఆర్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఈ-మొయిల్ (careers@tstask.com) ద్వారా రెజ్యూమేను సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 7
వెబ్‌సైట్: www.task.telangana.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
వ్యాప్కోస్‌లో ఇంజినీర్లు,
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ (వ్యాప్కోస్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న వివిధ ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఇది నీటి వనరుల మంత్రిత్వ శాఖ ఆధ్యర్యంలో నడుస్తున్న ప్రభుత్వ రంగ కన్సల్టెన్సీ సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 17
విభాగాలవారీగా ఖాళీలు:
-టీం లీడర్-1, బ్రిడ్జ్‌స్ట్రక్చరల్ ఇంజినీర్-1, మెటీరియల్ అండ్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీర్-1, బిల్డింగ్ ఆర్కిటెక్ట్-1, ఎలక్ట్రికల్ ఇంజినీర్-1, మెకానికల్ ఇంజినీర్-2, బిల్డింగ్ అండ్ స్ట్రక్చరల్ డిజైన్ ఇంజినీర్-1, సర్వే ఇంజినీర్-1, కంప్యూటర్ కమ్ డాటా ఎంట్రీ ఆపరేటర్-1, మెసెంజర్-1, ఫిషరీ ఎక్స్‌పర్ట్-1, వాటర్‌సప్లయ్ ఎక్స్‌పర్ట్-1
అర్హతలు: బ్యాచిలర్ డిగ్రీ/బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత.
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పోస్టులనుబట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 13
వెబ్‌సైట్: www.wapcos.co.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో జూనియర్ ఆర్టీషియన్లు

.
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) ఖాళీగా ఉన్న జూనియర్ ఆర్టీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల (తాత్కాలిక ప్రాతిపదికన) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ecil
వివరాలు:
ఈసీఐఎల్ సంస్థ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 1967 ఏప్రిల్ 11న ఏర్పాటు చేశారు.
-మొత్త ఖాళీలు: 47
-సైంటిఫిక్ అసిస్టెంట్-12 ఖాళీలు
-గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 60 శాతం మార్కులతో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ప్రాసెస్ ఇన్‌స్ట్రుమెంటేషన్, మెకానికల్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత. రెండు నుంచి ఐదేండ్లు అనుభవం ఉండాలి.
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పే స్కేల్ రూ. 13,326/- (కన్సాలిడేటెడ్ పే)
జూనియర్ ఆర్టీషియన్: 35 ఖాళీలు
అర్హతలు: ఎలక్ట్రానిక్స్, రేడియో అండ్ టీవీ, పవర్ ఎలక్ట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ప్రాసెస్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఫిట్టర్, డీజిల్ మెకానిక్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో రెండు నుంచి ఐదేండ్లు అనుభవం ఉండాలి.

వయస్సు: 2017 మే 31 నాటికి 35 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్ : రూ. 11,764/-(కన్సాలిడేటెడ్ పే)
టెక్నికల్ ఆఫీసర్-2 పోస్టులు
అర్హత: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 2017 మే 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: 21,000/- (కన్సాలిడేటెడ్ పే)
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, దానికి సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి ఇంటర్వ్యూ తేదీన పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 25
-టెక్నికల్ ఆఫీసర్ పోస్టుకు జూన్ 10
వెబ్‌సైట్: www.ecil.co.in



0 comments:

Post a Comment