Tuesday, 20 June 2017

Indian Navy Recruitment Notification,Clerk Trainee jobs in Cosmos Bank,Sports Quota jobs in incometax Department,Clerk posts in NIRD,Jobs in BHEL. పదోతరగతితో నేవీ ఉద్యోగాలు, కాస్మోస్ బ్యాంక్‌లో క్లర్క్ ట్రెయినీ ఉద్యోగాలు, ఇన్‌కమ్‌ట్యాక్స్‌లో స్పోర్ట్స్‌కోటా ఉద్యోగాలు, ఎన్‌ఐఆర్‌డీలో క్లర్క్ పోస్టులు, బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు.

పదోతరగతితో నేవీ ఉద్యోగాలు,

ఇండియన్ నేవీ పదోతరగతి చదివిన అభ్యర్థుల కోసం స్టీవార్డ్, చెఫ్స్, హైజనిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
INDIAN-NAVY
వివరాలు:
ఇండియన్ నేవీలో స్టీవార్డ్, చెఫ్స్, హైజనిస్ట్ ఫర్ ఎంఆర్ మార్చి - ఏప్రిల్ 2018 బ్యాచ్‌లో ప్రవేశాల కోసం ఈ నోటిఫికేషన్‌ను నేవీ విడుదల చేసింది.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. అవివాహిత పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయస్సు: 1997, ఏప్రిల్ 1 నుంచి 2001, మార్చి 31 మధ్య జన్మించినవారు అర్హులు.
ఎంపిక విధానం:
-రాతపరీక్ష, పీఎఫ్‌టీ, ఫిట్‌నెస్, మెడికల్ ఎగ్జామ్స్ ద్వారా
రాతపరీక్ష:

-పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో (ఇంగ్లిష్/హిందీ) ఉంటుంది.
-స్టీవార్డ్, చెఫ్స్ పోస్టులకు నిర్వహించే పరీక్షలో రెండు సెక్షన్లు ఉంటాయి.
-సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఉంటాయి.
-పరీక్ష కాలవ్యవధి 45 నిమిషాలు
-అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.

ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):

-ఈ పరీక్షలో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
-ఈ టెస్ట్‌లో భాగంగా 1.6 కి.మీ. దూరాన్ని 7 నిమిషాల వ్యవధిలో పరుగెత్తాలి. 20 ఉతక్‌బైటక్‌లను, 10 ఫుష్‌అప్స్‌లను చేయాలి.
శారీరక ప్రమాణాలు: కనీస ఎత్తు 157 సెం.మీ., గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి. శరీరంపై శాశ్వత పచ్చబొట్లు ఉన్నవారు అర్హులు కారు.
శిక్షణ: కోర్సు ఏప్రిల్ 2018 నుంచి ప్రారంభమవుతుంది. 15 వారాలు ప్రాథమిక శిక్షణను ఐఎన్‌ఎస్ చిల్కా వద్ద ఇస్తారు. వీటితోపాటు వృత్తిపరమైన శిక్షణను నేవల్ ట్రెయినింగ్ సెంటర్లలో ఇస్తారు.
పేస్కేల్: శిక్షణ కాలంలో నెలకు రూ. 14,600/- ఇస్తారు. శిక్షణ పూర్తయిన తర్వాత డిఫెన్స్ పే మ్యాట్రిక్స్ లెవల్ 3 కింద రూ. 21,700 - 43,100 + ఎంఎస్‌పీ@ రూ. 5,200 + డీఏ ఇస్తారు.
పదోన్నతులు: మాస్టర్ చెఫ్ పెట్టి ఆఫీసర్ -1 (మేజర్ సుబేదార్ స్థాయి, లెవల్ 8) వరకు పదోన్నతి పొందవచ్చు. శిక్షణ కాలంలో ఉచిత యూనిఫాం, ఆహారం, వసతి, పుస్తకాలు ఇతర మెటీరియల్‌ను అందిస్తారు.

ఉద్యోగ బాధ్యతలు:

చెఫ్: మెనూ ప్రకారం ఆహార పదార్థాలను తయారుచేయాలి (వెజ్, నాన్ వెజ్). వీటితోపాటు రేషన్‌కు సంబంధించిన అకౌంటింగ్, అప్పజెప్పిన ఇతర బాధ్యతలు చూడాలి.
స్టీవార్డ్: ఆఫీసర్ మెస్‌లలో ఆహారాన్ని సర్వ్ చేయాలి. వెయిటర్స్, హౌస్‌కీపింగ్, అకౌంటింగ్ ఫండ్స్, ప్రిపరేషన్ ఆఫ్ మెనూ, వైన్, స్టోర్లలో పనిచేయాలి.
హైజినిస్ట్: వాష్‌రూంల్లో, ఇతర ప్రదేశాల్లో పరిసరాలను శుభ్రం చేయాలి. వీటితోపాటు సర్వీస్ అవసరాల దృష్ట్యా ఇతర పనులు చేయాలి.

భారత నావికాదళం.. దేశరక్షణలో కీలక విభాగాల్లో ఇది ఒకటి. పదోతరగతి పాసై, 157 సెం.మీ. ఎత్తు ఉన్నవారికి అవకాశం. రాతపరీక్ష, ఫిజికల్ టెస్ట్ ద్వారా ఎంపిక. నేవీలో సహాయకులు, చెఫ్, హైజనిస్ట్ పోస్టుల భర్తీకి ఇండియన్ నేవీ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో వాటి వివరాలు సంక్షిప్తంగా...

దరఖాస్తు: ఆన్‌లైన్
చివరితేదీ: జూలై 9
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కాస్మోస్ బ్యాంక్‌లో క్లర్క్  ట్రెయినీ ఉద్యోగాలు,
కాస్మోస్ బ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న క్లర్క్, ట్రెయినీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BANK-CLERK 
వివరాలు:
కాస్మోస్ కో ఆపరేటివ్ బ్యాంక్‌ను 1906లో ఏర్పాటుచేశారు. దేశంలో పురాతన అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ ఇది. 
పోస్టు పేరు: మేనేజర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమశ్రేణి డిగ్రీతోపాటు సీఏఐఐబీ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏలో ఉత్తీర్ణత. బ్యాంక్/ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఐదేండ్లు, మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్‌గా మూడేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 2017 ఏప్రిల్ 30 నాటికి 45 ఏండ్లకు మించరాదు.
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్/ట్రెయినీ ఆఫీసర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమశ్రేణి కామర్స్ డిగ్రీతోపాటు సీఏఐఐబీ, సీఏ, సీఎస్, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏలో ఉత్తీర్ణత. బ్యాంక్/ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్‌లో మూడేండ్లు, ఆఫీసర్/అసిస్టెంట్ మేనేజర్‌గా రెండేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 2017 ఏప్రిల్ 30 నాటికి 29 ఏండ్లకు మించరాదు.
పోస్టు పేరు: క్లర్క్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో కామర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 ఏప్రిల్ 30 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
పనిచేసే ప్రదేశాలు: హైదరాబాద్, సికింద్రాబాద్, బెంగళూరు, విజయవాడ, చెన్నై, కోయంబత్తూర్, హోసూర్. 
ఎంపిక: మేనేజర్, ట్రెయినీ ఆఫీసర్ పోస్టులకు ఇంటర్వ్యూ, క్లర్క్ పోస్టులకు రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
-రాతపరీక్ష ఐబీపీఎస్ విధానంలో ఉంటుంది. జూలై 2న నిర్వహించనున్నారు.
-హైదరాబాద్, చెన్నై, బెంగళూరులలో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
-ఇంటర్వ్యూ రోజున ఒరిజినల్ విద్యార్హత సర్టిఫికెట్లు, ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, రెజ్యూమే, పాస్‌పోర్ట్‌సైజ్ ఫొటోలతో పర్సనల్ అధికారివద్ద హాజరుకావాలి. 
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో/ ఈ-మెయిల్ (recruitment@cosmosbank.in) ద్వారా.
చివరితేదీ: జూన్ 23
ఆన్‌లైన్ పరీక్ష: జూలై 2

వెబ్‌సైట్: www.cosmosbank.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇన్‌కమ్‌ట్యాక్స్‌లో స్పోర్ట్స్‌కోటా ఉద్యోగాలు,


న్యూఢిల్లీలోని ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ట్యాక్స్ అసిస్టెంట్, ఎంటీఎస్ తదితర పోస్టుల భర్తీకి అర్హులైన ప్రతిభావంతులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IncomeTax
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 58.
క్రీడావిభాగాలు: అథ్లెటిక్స్, కబడ్డీ, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, బాస్కెట్‌బాల్, లాన్ టెన్నిస్, క్రికెట్, చెస్, స్విమ్మింగ్, బాడీ బిల్డింగ్, హాకీ.
పోస్టు పేరు: ట్యాక్స్ అసిస్టెంట్-19 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీలో ఉత్తీర్ణత. డాటా ఎంట్రీలో గంటకు 8000 కీ డిప్రెషన్స్ వేగాన్ని కలిగి ఉండాలి.
పోస్టు పేరు: స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ 2)-1
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. పదినిమిషాల డిక్టేషన్‌ను ఇంగ్లిష్/హిందీలో నిమిషానికి 80 పదాల వేగంతో చేయాల్సి ఉంటుంది. ట్రాన్స్‌స్క్రిప్షన్ నిమిషానికి ఇంగ్లిష్‌లో 50 పదాలు, హిందీలో 65 పదాలు టైప్ చేయాలి.
పే స్కేల్ : రూ. 5200-20200+ గ్రేడ్ పే రూ. 2400/-(పై రెండు పోస్టులకు)
పోస్టు పేరు: ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్-9 ఖాళీలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 9,300-34,800+ గ్రేడ్ పే రూ. 4600/-
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్-29 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 ఏప్రిల్ 10 నాటికి 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్ : రూ. 5200-20200+ గ్రేడ్ పే రూ. 1800/-
గమనిక: రాష్ట్ర/ నేషనల్, ఇంటర్నేషనల్, ఒలింపిక్స్, వరల్డ్ చాంపియన్‌షిప్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో ఏషియన్ గేమ్స్, ఎస్‌ఏఎఫ్, తదితర పోటీ స్థాయిలోని సంబంధిత క్రీడాంశాల్లో పాల్గొని ఉండాలి.
వయస్సు: 2017 జూన్ 10 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం: సంబంధిత క్రీడాంశంలో గ్రౌండ్ టెస్ట్ /నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తు ఫారాలను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి తర్వాత సంబంధిత డాక్యుమెంట్లను జతపరిచి రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్:www.incometaxindia.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఐఆర్‌డీలో క్లర్క్ పోస్టులు,
హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న యూడీసీ. ఎల్‌డీసీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది.
nirdpr-building
వివరాలు:
ఎన్‌ఐఆర్‌డీని గ్రామీణ అభివృద్ధి, పరిశోధన కోసం హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో ఏర్పాటు చేశారు.
-అప్పర్ డివిజన్ క్లర్క్-4 పోస్టులు (జనరల్-3, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీతోపాటు టైప్‌రైటింగ్‌లో నిమిషానికి 25 పదాల వేగాన్ని కలిగి ఉండాలి. ప్రభుత్వ, అటానమస్ బాడీ/అనుబంధ సంస్థల్లో ఐదేండ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 5,200 - 20,200+ గ్రేడ్ పే రూ. 2,400/-
లోయర్ డివిజన్ క్లర్క్-17 పోస్టులు (జనరల్-10, ఓబీసీ-4, ఎస్సీ-2, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. ఇంగ్లిష్‌లో 30 పదాలు, హిందీలో 25 పదాలు టైపింగ్ చేయగల సామర్థ్యం ఉండాలి. స్టెనోగ్రఫీలో నాలెడ్జ్ ఉండాలి. ప్రభుత్వ కార్యాలయాలు, అటానమస్ బాడీ/అనుబంధ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 27 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ. 5,200-20, 200+ గ్రేడ్ పే రూ. 1, 900/-
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: జూలై 15
వెబ్‌సైట్: www.nird.org.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీహెచ్‌ఈఎల్‌లో ఉద్యోగాలు.

హైదరాబాద్‌లోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్) లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు:
పోస్టు పేరు: పార్ట్‌టైమ్ మెడికల్ కన్సల్టెంట్
మొత్తం ఖాళీల సంఖ్య: 8
విభాగాలు: కార్డియాలజీ-2, గ్యాస్ట్రోఎంటరాలజీ-1, యూరాలజీ-1, ఆర్థోపెడిక్స్-1, రేడియాలజీ-1 
అర్హత: ఎంబీబీఎస్, డీఎం, డీఎన్‌బీ, ఎంసీహెచ్, ఎంఎస్ ఎండీ, డీఎన్‌బీ, పీజీ డిప్లొమా
ఎంపిక: ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో. 
చివరి తేదీ: జూలై 8

వెబ్‌సైట్: https://web.bhelhyd.co.in



0 comments:

Post a Comment