Monday, 26 June 2017

Indian Coast Guard Recruitment Assistant Commandant posts ,AIIMS Rishikesh Recruitment Faculty Posts,Project Scientists at CMLRE,WII Recruitment junior project Fellow ,Junior Assistants at IIT. కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు, రిషికేష్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీలు, సీఎంఎల్‌ఆర్‌ఈలో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు, డబ్ల్యూఐఐలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో, ఐఐటీలో జూనియర్ అసిస్టెంట్లు.

కోస్ట్‌గార్డ్‌లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులు,
డిగ్రీ, ఇంజినీరింగ్ చదివిన అభ్యర్థులకు అవకాశం
-గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు
-చాలెంజింగ్ కెరీర్, మంచి జీతభత్యాలు

INDIAN-COASR-GUARD
ఇండియన్ కోస్ట్‌గార్డ్ అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:

భారత రక్షణశాఖ పరిధిలో కోస్ట్‌గార్డ్ పనిచేస్తుంది.
పోస్టులు: అసిస్టెంట్ కమాండెంట్.
-ఇవి గ్రూప్ ఏ కేటగిరీలో గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు.
-పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

బ్రాంచీల వారీగా అర్హతలు:

జనరల్ డ్యూటీ/జనరల్ డ్యూటీ (పైలట్): గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 60 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ (సాధారణ డిగ్రీ లేదా బీఈ/బీటెక్), ఇంటర్ స్థాయిలో లేదా 10+2+3 స్కీంలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులుగా కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: జనరల్ డ్యూటీ అభ్యర్థులు 1993, జూలై 1 నుంచి 1997, జూన్ 30 మధ్యలో జన్మించి ఉండాలి. జనరల్ డ్యూటీ పైలట్ అభ్యర్థులు 1993, జూలై 1 - 1999, జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.
పైలట్స్ (సీపీఎల్): గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు డీజీసీఏ వ్యాలిడ్ కమర్షియల్ పైలట్ లైసెన్స్ (సీపీఎల్) కలిగి ఉండాలి.
-ఈ పోస్టులకు పురుష, మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 1993, జూలై 1 నుంచి 1999, జూన్ 30 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక:

-దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థుల అకడమిక్ ప్రతిభ ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.

స్టేజ్ - 1:

ప్రిలిమినరీ సెలక్షన్ ఎగ్జామినేషన్:
-మెంటల్ ఎబిలిటీ టెస్ట్/కాగ్నిటివ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, పిక్చర్ ప్రిస్క్రిప్షన్, డిస్కషన్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-ప్రశ్నపత్రం ఇంగ్లిష్ ,హిందీ భాషల్లోనే ఉంటుంది.
-జూలై నెల మధ్యలో ప్రిలిమినరీ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు.

స్టేజ్ - 2:

-ప్రిలిమినరీ ఎగ్జామ్‌లో అర్హత సాధించినవారిని స్టేజ్- 2 (ఫైనల్ సెలక్షన్)కు ఎంపిక చేస్తారు.
-దీనిలో సైకాలజీ టెస్ట్, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూలు ఉంటాయి.
-ఈ దశలో అర్హత సాధించినవారికి వైద్యపరీక్షలు నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
నోట్: జనరల్ డ్యూటీ పైలట్ పోస్టులకు సీపీఎస్‌ఎస్ టెస్ట్‌ను డెహ్రాడూన్/మైసూర్‌లలో నిర్వహిస్తారు.

శారీరక ప్రమాణాలు:

జనరల్ డ్యూటీ: 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
అసిస్టెంట్ కమాండెంట్ పైలట్/సీపీఎల్: కనీసం ఎత్తు 162.5 సెం.మీ., కాళ్ల పొడవు కనీసం 99 సెం.మీ. ఉండాలి.

జీతభత్యాలు:

-ప్రారంభంలో నెలకు సుమారుగా రూ. 56, 100/- వరకు జీతం వస్తుంది.
-అసిస్టెంట్ కమాండెంట్ నుంచి డీజీఐసీజీ స్థాయి వరకు పదోన్నతి పొందే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, విద్యార్హతల వివరాలను ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి
చివరితేదీ: జూలై 2
వెబ్‌సైట్: www.joinindiancoastguard.gov.in



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
రిషికేష్ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీలు,

మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఇండియా పరిధిలో పనిచేస్తున్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిషికేష్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
aiims-rishikes
వివరాలు:
ఎయిమ్స్ రిషికేష్ దేశంలోని ఏడు ఎయిమ్స్‌లలో అత్యున్నత ఇన్‌స్టిట్యూట్. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన కింద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పరిధిలో పనిచేస్తుంది. దీన్ని 2012 సెప్టెంబర్ 20న స్థాపించారు.
పోస్టు పేరు: ప్రొఫెసర్
-మొత్తం పోస్టులు- 196 పోస్టులు
-ప్రొఫెసర్-35, అడిషినల్ ప్రొఫెసర్-29, అసోసియేట్ ప్రొఫెసర్-48, అసిస్టెంట్ ప్రొఫెసర్-51, ట్యూటర్ /క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్-33
విభాగాలు: అనెస్థీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, డెర్మటాలజీ, ఈఎన్‌టీ, ఎండోక్రినాలజీ అండ్ మెటబాలిజం, ఫోర్సెనిక్ మెడిసిన్ అండ్ టాక్సికాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ, జనరల్ మెడిసిన్, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ ఆంకాలజీ/హెమటాలజీ, మైక్రోబయాలజీ, నియోనాటాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, న్యూక్లియర్ మెడిసిన్, ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, ఆప్తాల్మాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్ సర్జరీ, పీడియాట్రిక్, పాథాలజీ అండ్ ల్యాబ్ మెడిసిన్, ఫార్మకాలజీ, ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్, సైకియాట్రీ, ఫిజియాలజీ, పల్మనరీ మెడిసన్, రేడియో డయాగ్నసిస్, సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ, సర్జికల్ ఆంకాలజీ, ట్రాన్స్‌ఫ్యూజన్ మెడిసిన్ అండ్ బ్లడ్‌బ్యాంక్, ట్రామా సర్జరీ, ఎమర్జెన్సీ మెడిసిన్, యూరాలజీ, నర్సింగ్.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎంబీబీఎస్‌తోపాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ (ఎండీ/ఎంఎస్, ఎంసీహెచ్) ఉత్తీర్ణత. సంబంధిత విభాగం నుంచి పీజీతో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం కలిగి ఉండాలి. నాన్ మెడికల్ అభ్యర్థులు ఎమ్మెస్సీ (అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ)తోపాటు పీహెచ్‌డీ. సంబంధిత టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి. ట్యూటర్ /క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్/ పీజీ (నర్సింగ్) ఉండాలి.
ప్రొబేషనరీ పీరియడ్: రెండేండ్లు

పే అండ్ అలవెన్సులు:

ప్రొఫెసర్: రూ.37,400-67,000+అకడమిక్ గ్రేడ్ పే రూ. 10,500/-
అడిషనల్ ప్రొఫెసర్: రూ.37,400-67,000+అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,500/-
అసోసియేట్ ప్రొఫెసర్: రూ.37,400-67,000+అకడమిక్ గ్రేడ్ పే రూ. 9,000/-
అసిస్టెంట్ ప్రొఫెసర్: రూ.15,600-39,100+అకడమిక్ గ్రేడ్ పే రూ. 8,000/-
ట్యూటర్ /క్లినికల్ ఇన్‌స్ట్రక్టర్: రూ. 15,600-39100+ గ్రేడ్ పే రూ. 5400/-
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ. 3000/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు రూ. 1000/-)
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
వెబ్‌సైట్: www.aiimsrishikesh.edu.in




---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎంఎల్‌ఆర్‌ఈలో ప్రాజెక్ట్ సైంటిస్ట్‌లు,
సెంట్రల్ ఫర్ మెరైన్ లివింగ్ రిసోర్సెస్ అండ్ ఎకాలజీ (సీఎంఎల్‌ఆర్‌ఈ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రాజెక్ట్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
CMLRE
వివరాలు:
సీఎంఎల్‌ఆర్‌ఈ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 45
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ ( (గ్రేడ్ సీ)-5 పోస్టులు
-ప్రాజెక్ట్ సైంటిస్ట్ (గ్రేడ్ బీ)-30 పోస్టులు
-జూనియర్ రిసెర్చ్ ఫెలో-10 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ (నేచురల్ సైన్సెస్, ఎర్త్ సైన్సెస్, ఓషనోగ్రఫీ, మెరైన్ సైన్సెస్, ఫిషరీస్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ) ఎంటెక్/బీటెక్ (ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, బయోటెక్నాలజీ, బయోసైన్సెస్) లేదా కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్/ఎంసీఏ, బీఈ/బీటెక్ లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. పీహెచ్‌డీ ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
పే స్కేల్: ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ సీ రూ. 49,000/-, ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ బీ రూ. 47,000/-, జేఆర్‌ఆఫ్ రూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
వయస్సు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ సీ పోస్టులకు 40 ఏండ్లు, ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ బీ పోస్టులకు 35 ఏండ్లు, జేఆర్‌ఎఫ్ పోస్టులకు 30 ఏండ్లకు మించరాదు.
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
చివరితేదీ: న్యూస్‌పేపర్‌లో విడుదలైన తేదీ నుంచి 30 రోజుల్లోగా పంపాలి.
వెబ్‌సైట్:www.cmlre.gov.in



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డబ్ల్యూఐఐలో జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో,
వైల్డ్‌లైఫ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఐఐ) జేఆర్‌ఎఫ్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి (కాంట్రాక్ట్ పద్ధతి) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్థులను ఆహ్వానిస్తున్నది.
WILD-LIFE-INSTITUTE
వివరాలు:
మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్, ఫారెస్ట్& ైక్లెమేట్ చేంజ్ పరిధిలో పనిచేస్తుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 12
-జూనియర్ రిసెర్చ్ ఫెలో- 4
-సీనియర్ రిసెర్చ్ ఫెలో- 1
-జూనియర్ ప్రాజెక్ట్ ఫెలో- 6
-జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్- 1
అర్హత: మాస్టర్ డిగ్రీ (వైల్డ్ బయాలజీ, జువాలజీ, ఫారెస్ట్రీ, ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్, ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. రిసెర్చ్‌లోఅనుభవం ఉండాలి.
వయస్సు: జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్లు, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు 32 ఏండ్లు, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకు 30 ఏండ్ల్లకు మించరాదు.
పే స్కేల్: జేఆర్‌ఎఫ్‌కు రూ. 25,000+హెచ్‌ఆర్‌ఏ, ఎస్‌ఆర్‌ఎఫ్‌కు రూ. 28,000+ హెచ్‌ఆర్‌ఏ, జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోరూ. 25,000+ హెచ్‌ఆర్‌ఏ ఇస్తారు.
ఎంపిక: క్వాలిఫయింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
చివరితేది: జూలై 7
వెబ్‌సైట్: www.wii.gov.in



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీలో జూనియర్ అసిస్టెంట్లు.




గాంధీనగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IITGandhinagar
వివరాలు:
గుజరాత్‌లోని సబర్మతి నది ఒడ్డున 2008లో గాంధీనగర్ ఐఐటీని స్థాపించారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 39
-జూనియర్ అకౌంటెంట్- 10
-జూనియర్ అసిస్టెంట్- 14, డ్రైవర్- 2
-జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్- 9
-జూనియర్ ల్యాబొరేటరీ అటెండెంట్- 4
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఇంటర్/ఎస్‌ఎస్‌సీ, డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
చివరి తేదీ: జూలై 5
వెబ్ సైట్: http://www.iitgn.ac.in

0 comments:

Post a Comment