Monday, 26 June 2017

ICT Recruitment Professors ,Free training and job creation for unemployed. ఐసీటీలో ప్రొఫెసర్లు, నిరుద్యోగులకు ఉచిత శిక్షణ-ఉద్యోగ కల్పన.

ఐసీటీలో ప్రొఫెసర్లు,

ముంబైలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐసీటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ICT-logo
వివరాలు:
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో భాగంగా పనిచేస్తున్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీని 1933 అక్టోబర్1న ఏర్పాటుచేశారు.
-మొత్తం పోస్టుల సంఖ్య: 38
-పోస్టు పేరు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి పీహెచ్‌డీ, సంబంధిత పీజీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత. టీచింగ్/రిసెర్చ్ రంగంలో అనుభవం ఉండాలి.
-వయోపరిమితి: ప్రొఫెసర్- 54, అసోసియేట్ ప్రొఫెసర్- 45, అసిస్టెంట్ ప్రొఫెసర్- 35 ఏండ్లకు మించరాదు.
-ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరి తేదీ : జూలై 15
-వెబ్‌సైట్: www.ictmumbai.edu.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ-ఉద్యోగ కల్పన.
భూదాన్ పోచంపల్లిలోని స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ తెలంగాణలోని గ్రామీణ నిరుద్యోగ యువతకు మూడు/నాలుగు నెలలపాటు సాంకేతిక విద్యలో ఉచిత శిక్షణ, ఉద్యోగ కల్పన కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
swamy
వివరాలు:
దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన, భారత ప్రభుత్వం ద్వారా ఈ ఉపాధి ఆధారిత సాంకేతిక శిక్షణ కార్యక్రమాలను స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తుంది.

మూడు నెలల సాంకేతిక విద్యలు:
-ఆటోమొబైల్ - 2, 3 వీలర్ సర్వీసింగ్, ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్, మెయింటెనెన్స్ (సెల్‌ఫోన్‌తోపాటు)
-సూయింగ్ మెషీన్ ఆపరేటర్
-విదార్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-డీటీపీ & ప్రింట్ పబ్లిషింగ్ అసిస్టెంట్, ట్యాలీ (కంప్యూటరైజ్డ్ అకౌంటింగ్), కంప్యూటర్ హార్డ్‌వేర్ అసిస్టెంట్, సోలార్ సిస్టం ఇన్‌స్టాలేషన్ అండ్ సర్వీస్,
-విదార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత.

నాలుగు నెలల సాంకేతిక విద్య:
-ఎలక్ట్రీషియన్ (డొమెస్టిక్)
-విద్యార్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదోతరగతి ఉత్తీర్ణత
-అర్హతలు: గ్రామీణ అభ్యర్థులై ఉండాలి. చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కారు. శిక్షణ అనంతరం ఉద్యోగం చేయడానికి సిద్ధంగా ఉండాలి.
-వయస్సు: 18-35 ఏండ్ల మధ్య ఉండాలి.
-ప్రారంభ వేతనం: నెలకు రూ. 6000 నుంచి రూ. 8000/- వరకు, 6 నెలలు/12 నెలల తర్వాత వేతనం పెంపు ఉంటుంది. ఈపీఎఫ్, మెడికల్ సదుపాయం ఉంటుంది.
గమనిక: శిక్షణ కార్యక్రమం పూర్తిగా ఉచితం. ఉచిత హాస్టల్, భోజన వసతి ఉంటుంది. శిక్షణ అనంతరం ఉద్యోగం కల్పిస్తారు.
-దరఖాస్తు: ఆసక్తిగల అభ్యర్థులు తమ ఒరిజనల్ సర్టిఫికెట్, పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఆధార్‌కార్డు, పాత రేషన్‌కార్డుతోపాటు రూ. 250/- రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాలి.
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం 2017 జూలై 3, 4, 5న ఒరిజనల్ సర్టిఫికెట్లతో సంస్థలో హాజరుకావాలి.
-వివరాలకు ఫోన్ నంబర్: 9948466111, 9133908111,9133908222 లేదా జిల్లా డీఆర్‌డీఏ ఆఫీస్‌లోగల జిల్లా మేనేజర్‌ను సంప్రదించాలి.

చిరునామా: స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్‌స్టిట్యూట్, జలాల్‌పూర్ గ్రామం, భూదాన్ పోచంపల్లి మండలం,యాద్రాది భువనగిరి జిల్లా-508284
-వెబ్‌సైట్: www.srtri.com

0 comments:

Post a Comment