Wednesday, 14 June 2017

HLL Recruitment 500 posts ,Joint Admission Counseling Delhi -2017. హెచ్‌ఎల్‌ఎల్‌లో 500 పోస్టులు, జాయింట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఢిల్లీ -2017.

హెచ్‌ఎల్‌ఎల్‌లో 500 పోస్టులు,

హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ల్యాబొరేటరీ పర్సనల్ (ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
hll-lifecare
వివరాలు:
హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ అనేది కుటుంబ ఆరోగ్య సంక్షేమ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న సంస్థ. ఇది ఒక మినీరత్న హోదా కలిగిన సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్. ఈ సంస్థ అధిక నాణ్యత కలిగిన ఆరోగ్య ఉత్పత్తులు, సేవలను అందిస్తుంది.
పోస్టు పేరు: ల్యాబొరేటరీ పర్సనల్
విభాగాలు: బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ టెక్నీషియన్
-మొత్తం పోస్టుల సంఖ్య - 500
అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బయెకెమిస్ట్ పోస్టులకు ఎమ్మెస్సీ (మెడికల్ బయోకెమిస్ట్రీ), మైక్రోబయాలజిస్ట్ పోస్టులకు, ఎమ్మెస్సీ (మెడికల్ మైక్రోబయాలజీ), సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు ఎమ్మెస్సీ/బీఎస్సీ (ఎంఎల్‌టీ, డీఎంఎల్‌టీ) ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు డీఎంఎల్‌టీ), బీఎస్సీ (ఎంఎల్‌టీ)లో ఉత్తీర్ణత. సంబంధిత మెడికల్ ల్యాబొరేటరీ విభాగంలో నాలుగు నుంచి ఐదు సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్‌కు ఐదు నుంచి ఎనిమిదేండ్ల వరకు పనిచేసిన అనుభవం ఉండాలి. పోస్టును బట్టి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్/పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఈ-మెయిల్ (hrhcsmumbai@lifecarehll.com) ద్వారా.
-ఈ పోస్టులే కాకుండా కన్సల్టెంట్ పాథాలజిస్ట్, బయోకెమిస్ట్, మైక్రోబయాలజిస్ట్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధిత విభాగంలో అనుభవం ఉన్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చెసుకోవచ్చు.
వెబ్‌సైట్: http://www.lifecarehll.com





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జాయింట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఢిల్లీ -2017.




బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ అడ్మిషన్ కౌన్సెలింగ్ ఢిల్లీ - 2017 నోటిఫికేషన్‌ను ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ విడుదల చేసింది.

వివరాలు:
ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీ, ఇందిరాగాంధీ ఢిల్లీ టెక్నికల్ యూనివర్సిటీ ఫర్ ఉమెన్, ఇంద్రప్రస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఢిల్లీ (ఐఐఐటీ - డీ), నేతాజీ సుభాష్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్‌ఎస్‌ఐటీ)ల్లో బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ఈ జాయింట్ కౌన్సెలింగ్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
-డీటీయూ, ఐజీటీయూడబ్ల్యూ, ఎన్‌ఎస్‌ఐటీల్లో ప్రవేశాలు జేఈఈ మెయిన్ - 2017 ర్యాంక్ ద్వారా కల్పిస్తారు.
-ఐజీడీటీయూడబ్ల్యూలో బీఆర్క్‌లో ప్రవేశాల కోసం జేఈఈ మెయిన్ ర్యాంక్ (పేపర్ - 2) ద్వారా
-ఐఐఐటీ-ఢిల్లీలో జేఈఈ మెయిన్ ర్యాంక్‌తోపాటు ఒలింపియాడ్స్ ప్రోగ్రామ్స్‌లో పాల్గొన్నవారు, ఎన్‌టీఎస్‌ఈ, స్పోర్ట్స్, కల్చర్, చెస్, ఇన్నోవేషన్ తదితర ప్రోగ్రామ్స్‌లో విజేతలుగా నిలిచినవారికి బోనస్ మార్కులు ద్వారా ప్రవేశాలు కల్పిస్తుంది.
-ఢిల్లీ జోన్ పరిధిలోని అభ్యర్థులకు 85 శాతం సీట్లు, దేశంలోని ఇతర ప్రాంత అభ్యర్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 26
వెబ్‌సైట్: http://jacdelhi.nic.in

0 comments:

Post a Comment