Tuesday, 20 June 2017

Diploma courses in Agriculture Univesity,Online admission in ITIs, Nit PhD Admission Notification,BSC / BTech admissions in Agriculture. అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు, ఐటీఐల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు, నిట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు, అగ్రికల్చర్‌లో బీఎస్సీ/బీటెక్ ప్రవేశాలు.

అగ్రికల్చర్ వర్సిటీలో డిప్లొమా కోర్సులు,

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీ కోర్సులో డిప్లొమా పూర్తి చేసిన అభ్యర్థులకు నాలుగేండ్ల బీఎస్సీ
(ఆనర్స్) డిగ్రీ, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్) కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే అగ్రిసెట్-2017 నోటిఫికేషన్ విడుదలైంది.
ScreenShot
వివరాలు:
నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్)కు అగ్రిసెట్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)కు అగ్రి ఇంజినీరింగ్ సెట్ ప్రవేశ పరీక్ష ద్వారా అడ్మిషన్ కల్పిస్తారు.
కోర్సు పేరు: నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్)
మొత్తం సీట్ల సంఖ్య: 47, వీటిలో అగ్రికల్చర్ డిప్లొమా విద్యార్థులకు 42, సీడ్ టెక్నాలజీ డిప్లొమా అభ్యర్థులకు 5 సీట్లు కేటాయించారు.
విద్యార్హత: పీజేటీఎస్‌ఏయూ/ఏఎన్‌జీఆర్‌యూల నుంచి అగ్రికల్చర్/సీడ్ టెక్నాలజీలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 2017-18 విద్యా సంవత్సరంలో కోర్సు పూర్తయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 2017 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 26 ఏండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 28 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది.
కోర్స్ పేరు: బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్)
మొత్తం సీట్ల సంఖ్య: 8
విద్యార్హత: పీజేటీఎస్‌ఏయూ/ఏఎన్‌జీఆర్‌యూల నుంచి అగ్రికల్చర్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. 2017-18 విద్యా సంవత్సరంలో కోర్సు పూరయ్యేవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.

వయస్సు: 2017 డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 23 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 26 ఏండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 28 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ. 600/-; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 300/- చెల్లించాలి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా. రెండు గంటల వ్యవధిలో నిర్వహించే ఈ పరీక్షలో 100 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి.
-అగిస్రెట్‌ను జూలై 23న, అగ్రి ఇంజినీరింగ్ సెట్‌ను జూలై 22న నిర్వహిస్తారు.
-లోకల్ అభ్యర్థులకు 85 శాతం, నాన్‌లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత అధికారికి పంపాలి.
చిరునామా: CONVENOR, AGRICET/AGRIENGGCET-2017, Department of Entomology, College of Agriculture, Rajendranagar, Hyderabad- 500030
దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 3
పరీక్షతేదీ: జూలై 22, 23
వెబ్‌సైట్: http://www.pjtsau.ac.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐటీఐల్లో ఆన్‌లైన్ అడ్మిషన్లు,
రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు, గురుకుల పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఆర్‌ఐటీఐ)లు, జిల్లా స్థాయి శిక్షణా కేంద్రాలు(డీఎల్‌టీసీలు) 2017-19 విద్యా సంవత్సరానికిగాను ప్రభుత్వ, ప్రైవేట్, మైనారిటీ ఐటీఐల్లో వివిధ ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లలో ప్రవేశాలకు తెలంగాణ ఉపాధి శిక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదలచేసింది..
Students
వివరాలు:
పారిశ్రామిక శిక్షణ సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నాయి. ప్రత్యేకించి నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందిస్తాయి. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎన్‌సీవీటీ)కి అనుబంధంగా 54 ప్రభుత్వ ఐటీఐలు, 222 ప్రైవేట్ ఐటీఐలు రాష్ట్రంలో ఉన్నాయి. స్టేట్ కౌన్సిల్ ఫర్ ఒకేషనల్ ట్రైనింగ్ (ఎస్‌సీవీటీ) అనుబంధంగా రాష్ట్రంలో 10 ఐటీఐలు ఉన్నాయి.
కోర్సు పేరు: ఐటీఐ
కోర్సు వ్యవధి: రెండేండ్లు (నాలుగు సెమిస్టర్లు)/ఏడాది (రెండు సెమిస్టర్లు), ఆరు నెలలు(ఒక సెమిస్టర్)
విభాగాలు: ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్
అర్హత: గుర్తింపు పొందిన బోర్డు/స్టేట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్/సీబీఎస్‌సీ, ఐసీఎసీఈ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్‌ఐఓఎస్), తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ (టీఓఎస్‌ఎస్) నుంచి ఎస్‌ఎస్‌సీ పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
-ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు కూడా కొన్ని ట్రేడులలో ప్రవేశానికి అర్హులు.
వయస్సు: 2017 ఆగస్టు 1 నాటికి 14 ఏండ్లు నిండి ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ ఫీజు: రూ. 10/-
కోర్సు ఫీజు: ట్యూషన్‌ఫీజు + కామన్ మనీ డిపాజిట్‌లు కలిపి ప్రభుత్వ ఐటీఐలో రూ. 60/- ప్రైవేట్ ఐటీఐలో రూ. 7800/-
ఎంపిక: ఎస్‌ఎస్‌సీ మార్కుల ఆధారంగా. సీట్ల కేటయింపు నియమ నిబంధనల మేరకు మెరిట్ కం రిజర్వేషన్ ఆధారంగా జరుగుతుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆధార్‌కార్డ్, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ, స్కాన్ చేసిన తాజా పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఎస్‌ఎస్‌సీ మెమో/తత్సమాన పత్రం, కుల ధ్రువీకరణ తదితర పత్రాలను కలిగి ఉండాలి. ఆ తర్వాత న్యూ అప్లికెంట్/ రిజిస్ట్రేషన్ ఐడీతో లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్ సహాయంతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరి తేదీ: జూన్ 28
వెబ్‌సైట్: http://iti.telangana.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

నిట్‌లో పీహెచ్‌డీ ప్రవేశాలు,
దుర్గాపూర్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
దుర్గాపూర్ నిట్ పశ్చిమబెంగాల్‌లో ఉంది. 
కోర్సులు: పీహెచ్‌డీ, ఎంటెక్ (స్పాన్సర్డ్) ప్రోగ్రామ్స్
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 25
వెబ్‌సైట్: www.nitdgp.ac.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

అగ్రికల్చర్‌లో బీఎస్సీ/బీటెక్ ప్రవేశాలు.




రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2017-18 విద్యా సంవత్సరానికి రెండేండ్ల డిప్లొమా, మూడేండ్ల ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల ప్రవేశానికి అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
agriculture 
వివరాలు:
గ్రామీణ ప్రాంతాల్లో నివసించే యువకులకు స్వయం ఉపాధి కల్పించే ఉద్దేశంతో, పై చదువులు చదువుకోలేని యువతకు వ్యవసాయ, విత్తన సాంకేతిక, ఇంజినీరింగ్ పరిజ్ఞానంతో శిక్షణ ఇవ్వడానికి వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలను ఏర్పాటు చేశారు.
మొత్తం సీట్ల సంఖ్య: 960 (వ్యవసాయం- 750, విత్తన సాంకేతిక పరిజ్ఞానం-90, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్-120)
-రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్ సీట్ల వివరాలు
-నల్లగొండ (కంపాసాగర్), ఖమ్మం (మధిర), నాగర్‌కర్నూల్ (పాలెం), జగిత్యాల (పొలాస), (బసంతపూర్**), వరంగల్ మెదక్ (సంగుపేట/జోగిపేట***), సిద్దిపేట (తోర్నాల), రాజన్న సిరిసిల్ల (సిరిసిల్ల), కరీంనగర్ (జమ్మికుంట**), కామారెడ్డి (మాల్‌తుమ్మెడ**). వీటితోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఏడు ప్రైవేట్ పాలిటెక్నిక్ కాలేజీలలో ఈ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.
-ప్రతి ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో 30, ప్రైవేట్ పాలిటెక్నిక్‌లలో 60 సీట్లు ఉన్నాయి.
-ఈ కాలేజీల్లో బోధన తెలుగు మీడియంలో మాత్రమే ఉంటుంది.
గమనిక: రెండు స్టార్ (**)లు ఉన్నవి కేవలం బాలురకు, మూడు స్టార్ (***)లు ఉన్నవి కేవలం బాలికలకు సీట్లు కేటాయించారు. 

విత్తన సాంకేతిక పరిజ్ఞాన పాలిటెక్నిక్ సీట్లు-వివరాలు
-సీడ్ టెక్నాలజీ పాలిటెక్నిక్ (తెలుగు మీడియం మాత్రమే)
-నిజామాబాద్ (రుద్రూర్)- 30 సీట్లు
-అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ పాలిటెక్నిక్ (ఇంగ్లిష్ మీడియం మాత్రమే)
-హైదరాబాద్ (రాజేంద్రనగర్)- 30 సీట్లు
అర్హత: పదోతరగతి/తత్సమాన పరీక్షలో కనీసం 5.0 గ్రేడ్ పాయింట్ (హిందీతోకలిపి)తో ఉత్తీర్ణులైనవారు మాత్రమే అర్హులు. వీరితోపాటు పదోతరగతి కంపార్ట్‌మెంట్/ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

-ఇంటర్ పాసైనవారు, దానికంటే పై చదువులు చదివినవారు అర్హులుకారు. 
-పదోతరగతిలోపు నాలుగేండ్లపాటు ఏదైన గ్రామీణ ప్రాంతాల్లో (నాన్ మున్సిపల్ పరిధిలో) చదివిన విద్యార్థులు మాత్రమే వీటికి దరఖాస్తు చేసుకోవాలి.
వయస్సు: డిసెంబర్ 31 నాటికి 15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.
-అప్లికేషన్ బీసీ అభ్యర్థులు రూ. 725/-; ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 425/- చెల్లించాలి.
ఎంపిక: పదోతరగతిలో వచ్చిన గ్రేడ్‌పాయింట్ యావరేజీ ప్రకారం ప్రామాణికంగా తీసుకొని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. కోర్సు ఎంపికలో రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.

-లోకల్ అభ్యర్థులకు 85 శాతం, నాన్‌లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు.
కోర్సు కాలపరిమితి: వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సు రెండేండ్లు ఉంటుంది. ప్రతి ఏడాదిలో రెండు సెమిస్టర్లు ఉంటాయి. మూడేండ్ల లోపు కోర్సు పూర్తిచేయాలి. 
-అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ కోర్సు ఉంటుంది. ప్రతి ఏడాది రెండు సెమిస్టర్లు ఉంటాయి. నాలుగేండ్లలోపు కోర్సు పూర్తిచేయాలి.
-వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సు తెలుగు మీడియంలో, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ ఇంగ్లిష్ మీడియంలో బోధిస్తారు.
-ఈ కోర్సులలో ప్రవేశం పొందిన వారికి హాస్టల్ వసతి ఉంటుంది.
కోర్సు ఫీజు: రూ. 2,250/-(ప్రతి సెమిస్టర్), ప్రైవేట్ పాలిటెక్నిక్‌లో రూ. 16000/- చెల్లించాలి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వాడుకలో ఉన్న మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి. 
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 21 
వెబ్‌సైట్: http://www.pjtsau.ac.in

0 comments:

Post a Comment