Wednesday, 7 June 2017

CIPAF medical posts,Clerk jobs in the Federal Bank,Cadet pilot jobs in Pawan Hans,Catholic Syrian Bank Jobs,IISER Lab Assistants Jobs సీఏపీఏఎఫ్ మెడికల్ పోస్టులు, ఫెడరల్ బ్యాంక్‌లో క్లర్క్‌ ఉద్యోగాలు, పవన్ హాన్స్‌లో క్యాడెట్ పైలట్ ఉద్యోగాలు, క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు, ఐఐఎస్‌ఈఆర్ ల్యాబ్ అసిస్టెంట్లు.

సీఏపీఏఎఫ్ మెడికల్ పోస్టులు,

స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్), డెంటల్ సర్జన్ పోస్టులు
-బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్‌లో ఖాళీలు
-ఎంబీబీఎస్, మెడికల్ పీజీ చేసిన అభ్యర్థులకు అవకాశం
-దేశసేవ, ఆకర్షణీయమైన జీతభత్యాలు
-కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక


కేంద్ర సాయుధ పోలీస్ దళాల (సీఏపీఏఎఫ్)లో మెడికల్ విభాగంలో డిప్యూటీ, అసిస్టెంట్ కమాండెంట్ స్థాయి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:

బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్ బలగాలన్నింటిని కలిపి సీఏపీఏఎఎఫ్‌గా 
పిలుస్తారు. ఇవన్నీ కేంద్ర హోంమత్రిత్వశాఖ పరిధిలో ఉంటాయి.
-స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ (డిప్యూటీ కమాండెంట్) - 232 ఖాళీలు.
BSF
విభాగాల వారీగా ఖాళీలు..
-బీఎస్‌ఎఫ్ - 61, సీఆర్‌పీఎఫ్ - 138, ఎస్‌ఎస్‌బీ - 19, ఐటీబీపీ - 2, అస్సాం రైఫిల్స్ - 6.
-పేస్కేల్: నెలకు రూ. 67,700 - 2,08,700 + ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
-వయస్సు: దరఖాస్తు దాఖలు చేసే చివరితేదీ నాటికి 40 ఏండ్లు మించరాదు.
-స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్స్
(డిప్యూటీ కమాండెంట్) - 232 ఖాళీలు
-స్పెషాలిటీ ఫీల్డ్ వారీగా...
-మెడిసిన్ - 38, సర్జరీ - 36, గైనిక్ అండ్ ఓబీఎస్ - 28, అనస్థెటిక్ - 29, రేడియాలజిస్ట్ - 39, పాథాలజిస్ట్ - 30, ఆప్తాల్మాలజిస్ట్ - 21, సైకియాట్రీ - 4, పిడియాట్రిక్స్ - 4, ఆర్థోపెడిక్స్ - 4 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: నెలకు రూ. 67,700 - 2,08,700 + ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
-వయస్సు: 40 ఏండ్లు మించరాదు.
-మెడికల్ ఆఫీసర్స్ (అసిస్టెంట్ కమాండెంట్స్) - 428 ఖాళీలు
-బీఎస్‌ఎఫ్ - 106, సీఆర్‌పీఎఫ్ - 117, ఎస్‌ఎస్‌బీ - 61, ఐటీబీపీ - 104, అస్సాం రైఫిల్స్ - 40 ఖాళీలు ఉన్నాయి.
-పేస్కేల్: నెలకు రూ. 56,100 - 1,77, 500 + ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
-వయస్సు: 30 ఏండ్లు మించరాదు.
-డెంటల్ సర్జన్ (అసిస్టెంట్ కమాండెంట్) - 1 ఖాళీ. ఈ పోస్టు అస్సాం రైఫిల్స్‌లో ఉంది.
-పేస్కేల్: నెలకు రూ. 56,100 - 1,77, 500 + ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు.

-అర్హతలు: స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్ పోస్టు - అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి మొదటి, రెండో షెడ్యూల్ ప్రకారం లేదా మూడో షెడ్యూల్‌లోని పార్ట్ -2 ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి. తప్పనిసరిగా ఇంటర్న్‌షిప్ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో పీజీ/డిప్లొమా ఉండాలి.
-మెడికల్ ఆఫీసర్- అలోపతిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్‌లో గుర్తింపు పొందిన సంస్థ నుంచి మొదటి, రెండో షెడ్యూల్ ప్రకారం లేదా మూడో షెడ్యూల్‌లోని పార్ట్ -2 ప్రకారం అర్హతలు కలిగి ఉండాలి. ఇంటర్న్‌షిప్ పూర్తిచేసి ఉండాలి.

-ఎంపిక: పై మూడు పోస్టులకు దరఖాస్తు చేసుకొన్నవారిలో అర్హత ఉన్నవారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. వీరికి 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. దీనిలో జనరల్ నాలెడ్జ్, అకడమిక్ స్టడీలో ఎబిలిటీని, పర్సనాలిటీ టెస్ట్‌లను నిర్వహిస్తారు. వీటన్నింటిలో అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి.
శారీరక ప్రమాణాలు:
-పురుషులు - 157.5 సెం.మీ., ఛాతీ - 77 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 82 సెం.మీ. ఉండాలి.
-మహిళలు - 142 సెం.మీ. ఎత్తు ఉండాలి.
నోట్:
పురుషులు, మహిళలు ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
-సర్వీస్ నిబంధనలు: దేశంలో లేదా విదేశాల్లో ఎక్కడైనా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. ఫోర్స్‌లో కనీసం 10 ఏండ్లు సర్వీస్ చేయాలి లేదా నిబంధనల ప్రకారం పెనాల్టీ చెల్లించి రాజీనామా చేయాలి.
-ప్రొబేషనరీ పీరియడ్ రెండేండ్లు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 400/-
-ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
పూర్తి చేసిన దరఖాస్తును కింది చిరునామాకు పంపాలి.THE DEPUTY INSPECTOR GENERAL (RECTT.) MEDICAL OFFICER SELECTION BOARD (CAPFs) 2016 HQ DG CRPF, BLOCK NO. 01, CGO COMPLEX, LODHI ROAD, NEW DELHI
-వెబ్‌సైట్: www.crpf.nic.in.


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఫెడరల్ బ్యాంక్‌లో క్లర్క్‌ ఉద్యోగాలు,
ఫెడరల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోఖాళీగా ఉన్న ఆఫీసర్, క్లరికల్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
FEDERAL-BANK 

వివరాలు:
ఫెడరల్ బ్యాంక్ దేశంలోని ప్రైవేట్ సెక్టార్‌లోని ఒక లీడింగ్ బ్యాంక్.
-పోస్టు: క్లర్క్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 50 శాతం మార్కులతో (సైన్స్ గ్రూప్‌లో 55 శాతం) బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. మే/జూన్ 2017 నాటికి సంబంధిత డిగ్రీ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ స్థాయిలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-పోస్టు: ఆఫీసర్
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీలో ఉత్తీర్ణత లేదా అగ్రికల్చర్/ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్. ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ స్థాయిలో కూడా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
-వయస్సు: 2017 జూన్ 1 నాటికి గరిష్ఠంగా 24 ఏండ్లకు (ఆఫీసర్‌కు 26 ఏండ్లు) మించరాదు. 
-పే స్కేల్ : క్లర్క్‌కు రూ. 11,765-31,540 /-, ఆఫీసర్‌కు రూ. 23,700-42,020/- ప్రదేశాన్ని బట్టి డీఏ, హెచ్‌ఆర్‌ఏ, సీసీఏతోపాటు బ్యాంక్ నిబంధనల ప్రకారం ఏడాదికి సుమారుగా రూ. 3.61 లక్షలు (ఆఫీసర్‌కు రూ. 8.04 లక్షలు) జీతం చెల్లిస్తారు. మెడికల్ బిల్లు, హెల్త్ స్కీం, రిటైర్‌మెంట్ బెనిఫిట్స్ ఉంటాయి.
-అప్లికేషన్ ఫీజు: ఆఫీసర్ పోస్టులకు రూ.700/- జనరల్, ఓబీసీ అభ్యర్థులు (రూ. 350/- ఎస్సీ, ఎస్టీ,పీహెచ్‌సీ అభ్యర్థులు)
-క్లర్క్ పోస్టులకు రూ. 500/- జనరల్, ఓబీసీ అభ్యర్థులు (రూ. 250/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు)
- ఎంపిక: ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా.
- పరీక్ష సిలబస్: క్లర్క్ పోస్టుకు వెర్బల్ ఎబిలిటీ/ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్ ఆప్టిట్యూడ్/రీజనింగ్, క్వాంటిటేటివ్/న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్, సోషియో ఎకనామిక్ అండ్ బ్యాంకింగ్ అవేర్‌నెస్, కంప్యూటర్ అవేర్‌నెస్, డిజిటల్ బ్యాం కింగ్ అంశాలపై 90 మార్కులకుగాను, 90 ప్రశ్నలను ఇస్తారు. ఆఫీసర్ పోస్టుకు ఈ అంశాలతోపాటు మార్కెటింగ్ /సేల్స్ ఆప్టిట్యూడ్‌ను కలిపి మొత్తం 150 మార్కులకుగాను 150 ప్రశ్నలు ఇస్తారు.
- ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు.
- ఈ పరీక్ష తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. దీన్ని 15 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది.
-పరీక్ష కేంద్రాలు: బెంగళూరు, చెన్నై 
(దగ్గరలో ఉన్న సెంటర్లు)
- దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, విద్యార్హతలు, తదితర వివరాలను ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. 
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 16
-ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ టెస్ట్: జూన్ 24

-వెబ్‌సైట్: www.federalbank.co.in,




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పవన్ హాన్స్‌లో క్యాడెట్ పైలట్ ఉద్యోగాలు,

నోయిడాలోని పవన్ హాన్స్ లిమిటెడ్ ఖాళీగా ఉన్న క్యాడెట్ పైలట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
pawanhans 
వివరాలు:

పవన్ హాన్స్ లిమిటెడ్ అనేది మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్‌లో పనిచేస్తున్న హెలికాప్టర్ సంస్థ. ఇది మినీరత్న (కేటగిరీ1) హోదా కలిగి ఉంది.
-క్యాడెట్ పైలట్: 10 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60 శాతం (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లతో ఇంటర్ ఉత్తీర్ణత. ఇంటర్ పరీక్షలురాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్నవారు కూడా దరఖాస్తు 
చేసుకోవచ్చు.
-వయస్సు : కనిష్ఠంగా17 ఏండ్లు, గరిష్ఠంగా 25 ఏండ్లకు మించరాదు 
-ఎంపిక: రాతపరీక్ష, సైకోమెట్రిక్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
-రాతపరీక్షకు 50 శాతం, సైకోమెట్రిక్ టెస్ట్‌కు 30 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ ఇచ్చి ఫైనల్ సెలక్షన్ చేస్తారు.
-క్యాడెట్ పైలట్ ప్రోగ్రాం 18-20 నెలలపాటు ఉంటుంది. ఈ కోర్సులో కమర్షియల్ హెలికాప్టర్ పైలట్ లైసెన్స్ (సీహెచ్‌పీఎల్) ట్రెయినింగ్ 
నిర్వహిస్తారు. 
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 15

-వెబ్‌సైట్: www. pawanhans.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
క్యాథలిక్ సిరియన్ బ్యాంక్‌లో ఉద్యోగాలు,

క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ (స్కేల్1, స్కేల్2) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
catholic-syrian-bank 
వివరాలు:

క్యాథలిక్ సిరియన్ బ్యాంక్ 1920లో ఏర్పాటైంది. ఇది బ్యాంకింగ్ పరిశ్రమ మార్గదర్శకత్వం ఇవ్వటంలో ఒకటిగా నిలిచినది.
-మొత్తం ఖాళీల సంఖ్య: 30 పోస్టులు 
-పోస్టు పేరు :స్పెషలిస్ట్ ఆఫీసర్ 
(చార్టెర్డ్ అకౌంటెంట్)
-అర్హత: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టెర్డ్ అంకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా/సంస్థ నుంచి సీఏలో ఉత్తీర్ణత.
-వయస్సు: 2017 మే 31 నాటికి40 ఏండ్లకు మించరాదు. 
-పే స్కేల్ : అసిస్టెంట్ మేనేజర్ స్కేల్1 హోదాలో రూ. 40,000 70,000/-, అసిస్టెంట్ మేనేజర్ స్కేల్2 హోదాలో రూ. 53, 000 - 76,000/- నెలజీతం ఇస్తారు. 
-పనిచేసే కేంద్రాలు: సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబైతోపాటు దేశవ్యాప్తంగా 26 సెంటర్లలో ఏదోఒకచోట పోస్టింగ్ ఇస్తారు.
-ఎంపిక విధానం: రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: జూన్ 7

-వెబ్‌సైట్: http://www.csb.co.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎస్‌ఈఆర్ ల్యాబ్ అసిస్టెంట్లు.



మొహాలిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్) ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఐఐఎస్‌ఈఆర్ కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో పనిచేస్తున్న స్వతంత్ర ప్రతిపత్తిగల ప్రతిష్ఠాత్మకమైన సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 31
-అసిస్టెంట్ రిజిస్ట్రార్-3,
మెడికల్ ఆఫీసర్-1, నర్స్-1,
-టెక్నికల్ అసిస్టెంట్-2, ల్యాబ్ టెక్నీషియన్-2, ఆఫీస్ సూపరింటెండెంట్-5,
-ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ స్కిల్)-7,
ల్యాబ్ అసిస్టెంట్-10
-అర్హత: డిగ్రీ, పీజీ, డిప్లొమా, ఇంటర్, ఎస్‌ఎస్‌సీ ఉత్తీర్ణత
-ఎంపిక: రాతపరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-చివరితేదీ: జూన్ 20
-వెబ్‌సైట్: www. iisermohali.ac.in



0 comments:

Post a Comment