Tuesday, 20 June 2017

BSc (Honors) Admissions in Community Science, IIM Recruitment Faculty posts. బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్‌లో ప్రవేశాలు, ఐఐఎంలో ఫ్యాకల్టీ పోస్టులు.

బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్‌లో ప్రవేశాలు,
రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైఫాబాద్ హోమ్‌సైన్స్ కాలేజీలో 2017-18 విద్యా సంవత్సరానికి నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్ కోర్సులోప్రవేశానికి అర్హులైన విద్యార్థినుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
bsc-home-sciene
వివరాలు:
కాలేజ్ ఆఫ్ హోమ్‌సైన్స్ సైఫాబాద్, హైదరాబాద్‌లో క్లాసులు జరుగుతాయి.
కోర్సు పేరు: బీఎస్సీ (ఆనర్స్) కమ్యూనిటీ సైన్స్
కోర్సు వ్యవధి: నాలుగేండ్లు. గతంలో ఈ కోర్సును బీఎస్సీ (ఆనర్స్) హోంసైన్స్ అని పిలిచేవారు.
మొత్తం సీట్ల సంఖ్య: 47
అర్హత: బైపీసీ, ఎంపీసీ, ఎంబైపీసీ సబ్జెక్ట్‌లతో రెండేండ్ల వ్యవధిగల ఇంటర్‌లో ఉత్తీర్ణత. మూడేండ్ల డిప్లొమా కోర్సు (హోమ్‌సైన్స్)లో సర్టిఫికెట్ ఉన్నవారికి సూపర్‌న్యూమరీ కోటాలో 10 శాతం సీట్లను కేటాయిస్తారు.
వయస్సు: డిసెంబర్ 31 నాటికి 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 27 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ. 1325/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 725/- చెల్లించాలి.
ఎంపిక: ఇంటర్/డిప్లొమాలోని ఆప్షనల్ సబ్జెక్ట్‌లో వచ్చిన మార్కులను ప్రామాణికంగా తీసుకొని మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు. నాలుగేండ్ల బీఎస్సీ (ఆనర్స్) కోర్సు ఎంపికలో రిజర్వేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
-మొత్తం సీట్లలో 40 శాతం గ్రామీణ ప్రాంతాల్లో చదివిన అభ్యర్థులకు కేటాయించారు. నాన్ మున్సిపల్ పరిధిలోని 1 నుంచి 12వ తరగతి వరకు ఏదైనా గుర్తింపు పొందిన పాఠశాలలో నాలుగేండ్లపాటు చదివి ఉండాలి.
-లోకల్ అభ్యర్థులకు 85 శాతం, నాన్‌లోకల్ అభ్యర్థులకు 15 శాతం సీట్లు కేటాయిస్తారు.
కోర్సు ఫీజు: రూ. 13,470/-
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేయాలి.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 21 (సాయంత్రం 4 గంటల వరకు)
వెబ్‌సైట్: http://www.pjtsau.ac.in





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐఎంలో ఫ్యాకల్టీ పోస్టులు.

విశాఖపట్నంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఐఐఎం)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
iim-vizag
వివరాలు:
విశాఖపట్నంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఐఐఎంను ప్రారంభించింది.
-మొత్తం ఖాళీల సంఖ్య- 11
-ఇందులో ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ప్రథమశ్రేణిలో పీహెచ్‌డీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు మంచి అకడమిక్ రికార్డు కలిగి ఉండాలి. ప్రొఫెసర్ పోస్టుకు 10 ఏండ్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుకు 6 ఏండ్ల అనుభవం ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు కనీసం 3 ఏండ్ల టీచింగ్ అనుభవం ఉండాలి.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: జూన్ 23
వెబ్‌సైట్: www.iimv.ac.in/careers



0 comments:

Post a Comment