Tuesday, 20 June 2017

BPCL Recruitment Trainee jobs,National Police Academy Recuitment Notification,Aircraft Maintenance Engineers Jobs,Assistant professors jobs. బీపీసీఎల్‌లో ట్రెయినీలు ఉద్యోగాలు, నేషనల్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు ఉద్యోగాలు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉద్యోగాలు.

బీపీసీఎల్‌లో ట్రెయినీలు ఉద్యోగాలు,

భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఖాళీగా ఉన్న కెమిస్ట్ ట్రెయినీ, జనరల్ వర్క్‌మెన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Bharat-Petroleum 
వివరాలు: 
భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ దేశంలోని ప్రముఖ ఫార్చ్యూన్ 500 కంపెనీ, ఇది లీడింగ్ పబ్లిక్ సెక్టార్ నవరత్న కంపెనీ.
-మొత్తం పోస్టుల సంఖ్య- 37
-కెమిస్ట్ ట్రెయినీ- 3 పోస్టులు
అర్హత: ఎంఎస్సీ (కెమిస్ట్రీ)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అనలిటికల్ కెమిస్ట్రీ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
-జనరల్ వర్క్‌మెన్ ట్రెయినీ (కెమికల్)-17 పోస్టులు
అర్హత: కెమికల్ ఇంజినీరింగ్ డిప్లొమా ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి
-జనరల్ వర్క్‌మెన్ ట్రెయినీ(మెకానికల్)- 17 పోస్టులు
అర్హత: మెకానికల్ ఇంజినీరింగ్ డిప్లొమాలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో ఏడాది అనుభవం ఉండాలి.
వయస్సు: 2017 జూన్ 1 నాటికి 18 నుంచి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్: కెమిస్ట్ ట్రెయినీకి రూ. 13,500-31,000 + ఇతర అలవెన్స్‌లుంటాయి. జనరల్ వర్క్‌మెన్ ట్రెయినీ పోస్టుకు రూ. 11,500-20,000 + ఇతర అలవెన్స్‌లుంటాయి.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 3

వెబ్‌సైట్: https://bharatpetroleum.com




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ పోలీస్ అకాడమీలో ఉద్యోగాలు,

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ ఖాళీగా ఉన్న డ్రైవర్ పోస్టుల (రోజువారీ వేతనంపై) భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
sardar-valliabhai 
వివరాలు: 
ఇది దేశీయ వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది.
పోస్టు పేరు: డ్రైవర్ 
అర్హత: పదోతరగతి, హెచ్‌ఎంవీ, ఎల్‌ఎంవీ డ్రైవింగ్ లైసెన్స్, అనుభవం ఉండాలి. తెలుగు, హిందీ ధారాళంగా మాట్లాడాలి.
వయస్సు: 26 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్: రూ. 523/- (రోజువారీ వేతనం)
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిగా నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్.
ఇంటర్వ్యూతేదీ: జూన్ 21

వెబ్‌సైట్: www.svpnpa.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు ఉద్యోగాలు,

ఎయిర్ ఇండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ (ఏఐఈఎస్‌ఎల్) సదరన్ రీజియన్ విభాగంలో ఖాళీగా ఉన్న మెయింటెనెన్స్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Air-India 
వివరాలు:
ఏఐఈఎస్‌ఎల్ అనేది ఎయిర్ ఇండియా లిమిటెడ్ శాఖ ఆధ్వర్యంలో నడిచే సంస్థ. ఈ పోస్టులను ఐదేండ్లవరకు భర్తీచేస్తారు. అభ్యర్థి ప్రవర్తనను బట్టి మరో ఐదేండ్ల వరకు పొడిగిస్తారు.
పోస్టు పేరు: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లు (ఏఎంఈ)
-మొత్తం ఖాళీల సంఖ్య- 27 పోస్టులు 
-బీ1 ఏఎంఈ (ఏ అండ్ సీ ట్రేడ్)- 23
-బీ2 ఏఎంఈ (ఏవియానిక్స్ ట్రేడ్)- 3
-టెక్నికల్ ఆఫీసర్ (సపోర్ట్ సర్వీసెస్)- 1
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ లేదా డీజీసీఏ లైసెన్స్‌తో పాటు సంబంధిత ఎంబ్రాయర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఏటీఆర్ ఎయిర్‌క్రాఫ్ట్, ఏ320 ఫ్యామిలీ ఎయిర్‌క్రాఫ్ట్ లైసెన్స్ ఉండాలి. మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా, పీజీ లేదా బీఈ/బీటెక్ (మెకానికల్, ఏరోనాటికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత. 
వయస్సు: 45 ఏండ్లకు మించరాదు
పే స్కేల్: నెలకు సుమారు రూ. 95,000 నుంచి రూ. 1,28,000/- వరకు కన్సాలిడేటెడ్ పే చెల్లిస్తారు, ఆఫీసర్‌కు 50,000/- కన్సాలిడేటెడ్ జీతం ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 1000/- ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు. 
ఎంపిక విధానం: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: అర్హత కలిగిన అభ్యర్థులందరూ నిర్ణీత నమూనాలో దరఖాస్తును నింపి, డిమాండ్ డ్రాఫ్ట్, సంబంధిత సర్టిఫికెట్లతో డైరెక్ట్‌గా పర్సనల్ అధికారి వద్ద హాజరుకావాలి.
ఇంటర్వ్యూ తేదీ: జూన్ 23

వెబ్‌సైట్:www.airindia.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
అసిస్టెంట్ ప్రొఫెసర్లు  ఉద్యోగాలు.




ఢిల్లీలోని డా. భీంరావ్ అంబేద్కర్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
bhim-rao
వివరాలు:
ఇది యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ పరిధిలో పనిచేస్తున్నది.
పోస్టు: అసిస్టెంట్ ప్రొఫెసర్
పేస్కేల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే రూ. 6,000/-
-మొత్తం ఖాళీల సంఖ్య- 37
-విభాగాల వారీగా ఖాళీలు.. కామర్స్- 7, ఎకనామిక్స్- 3, ఇంగ్లిష్- 4, జాగ్రఫీ- 4, హిందీ అండ్ హెచ్‌జేఎంసీ- 1, హిస్టరీ- 3, మేనేజ్‌మెంట్ స్టడీస్- 2, పొలిటికల్ సైన్స్- 1, సైకాలజీ- 4, సంస్కృతం- 1, సోషల్ వర్క్- 3, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్- 3, ఉర్దూ- 1 పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 24
వెబ్‌సైట్: www.drbrambedkarcollege.ac.in

0 comments:

Post a Comment