Monday, 5 June 2017

Air Force Common Admission Test,CSIR-URDIP Project Assistants Jobs,Institute of Forest Productivity Jobs,Jobs in Niper. ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్, సీఎస్‌ఐఆర్-యూఆర్‌డీఐపీ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ ఉద్యోగాలు, నైపర్‌లో ఉద్యోగాలు.

ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్,

-డిగ్రీ/ ఇంజినీరింగ్‌తో ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు
-ఆకర్షణీయమైన జీతభత్యాలు, భరోసా కలిగిన జీవితం
-ఫ్లయింగ్, టెక్నికల్, గ్రౌండ్ డ్యూటీల్లో ఖాళీలు
-పురుషులు, మహిళలు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ టెక్నికల్, నాన్ టెక్నికల్ బ్రాంచీల్లో ఖాళీగా ఉన్న కమిషన్డ్ ఆఫీసర్స్
(ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల ఎంపిక కోసం నిర్వహించే ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటీ) -02/2017 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Air-Force
వివరాలు:
ఏఎఫ్‌సీఏటీ కోర్సులు 2018 జూలైలో ప్రారంభమవుతాయి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక, మంచి జీతభత్యాలు, అలవెన్స్‌లు. నిత్యనూతన కెరీర్. ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో వాటి వివరాలు సంక్షిప్తంగా..
-ఫ్లయింగ్ బ్రాంచీ (షార్ట్ సర్వీస్ కమిషన్ కింద), పర్మినెంట్ కమిషన్/షార్ట్ సర్వీస్ కమిషన్‌లో గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్/నాన్ టెక్నికల్) బ్రాంచీలు ఉన్నాయి.

ఫ్లయింగ్ బ్రాంచీ..
-అర్హతలు: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత లేదా కనీసం 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్ లేదా ఏఐఎంఈ సెక్షన్ ఏ, బీ ఉత్తీర్ణత. ఇంటర్ స్థాయిలో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టుల్లో కూడా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: 2018, జూలై 1 నాటికి 20 -24 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1994, జూలై 2 నుంచి 1998, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-శారీరక ప్రమాణాలు: కనీసం 162.5 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.
గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్)..
-ఏరోనాటికల్ ఇంజినీర్ (ఎలక్ట్రానిక్స్) - గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఇంటర్‌లో ఫిజిక్స్, మ్యాథ్స్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణతతోపాటు ఇంజినీరింగ్/టెక్నాలజీలో కింది ఏదైనా బ్రాంచీలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ఇంజినీరింగ్ బ్రాంచీలు: కమ్యూనికేషన్, కంప్యూటర్, ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్, ఈఈఈ, ఎలక్ట్రానిక్స్, ఈసీఈ, ఈసీఐ, ఈఐసీ, ఐసీఈ, ఐటీ.
-ఏరోనాటికల్ ఇంజినీరింగ్ (మెకానికల్): ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌ల్లో కనీసం 60 శాతం మార్కులతో, కింది ఏదైనా బ్రాంచీల్లో 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణత.
-బ్రాంచీలు: ఏరోస్పేస్, ఏరోనాటికల్, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్, మెకానికల్, మెకానికల్ అండ్ ఆటోమేషన్, మెకానికల్ (ప్రొడక్షన్/రిపేర్ అండ్ మెయింటెనెన్స్), మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్.

గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్)..
-అడ్మినిస్ట్రేషన్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
-లాజిస్టిక్స్: కనీసం 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ లేదా ఏఎంఐఈ ఉత్తీర్ణత.
-అకౌంట్స్: కనీసం 60 శాతం మార్కులతో బీకాం డిగ్రీ ఉత్తీర్ణత.
-ఎడ్యుకేషన్: ఎంబీఏ లేదా ఎంసీఏ, ఎంఏ/ఎమ్మెస్సీలో ఇంగ్లిష్, ఫిజిక్స్, మ్యాథ్స్, కెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇంటర్నేషనల్ స్టడీస్, డిఫెన్స్ స్టడీస్, సైకాలజీ, కంప్యూటర్ సైన్స్, ఐటీ, మేనేజ్‌మెంట్, ఎంసీజే, జర్నలిజం, పబ్లిక్ రిలేషన్స్‌లో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
-పై నాలుగు పోస్టులకు 2018, జూలై 1 నాటికి 20 - 26 ఏండ్ల మధ్య ఉండాలి. అంటే 1992, జూలై 2 నుంచి 1998, జూలై 1 మధ్య జన్మించి ఉండాలి.
-ఎత్తు: 157.5 సెం.మీ., మహిళా అభ్యర్థులు అయితే 152 సెం.మీ. ఎత్తు ఉండాలి. అదేవిధంగా ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి.

ఎంపిక విధానం
-ఏఎఫ్‌సీఏటీ/ఇంజినీరింగ్ నాలెడ్జ్ టెస్ట్ (ఈకేటీ)ను 2017, ఆగస్టు 27న నిర్వహిస్తారు. ఈ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఎయిర్‌ఫోర్స్ సెలక్షన్ బోర్డు (డెహ్రాడూన్, మైసూర్, గాంధీనగర్, వారణాసి)ల వద్ద, ఫ్లయింగ్ బ్రాంచీ వారికి డెహ్రాడూన్, వారణాసి, మైసూర్‌లో టెస్ట్‌ను నిర్వహిస్తారు.
-స్టేజ్ - 1: ఇంటెలిజెన్స్ టెస్ట్, ఇతర టెస్ట్‌లను నిర్వహిస్తారు. స్టేజ్ - 1 కేవలం క్వాలిఫయింగ్ టెస్ట్ మాత్రమే. దీనిలో అర్హత సాధించినవారిని తర్వాత దశకు ఎంపిక చేస్తారు.
-స్టేజ్ -2: దీనిలో సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్ట్, ఇంటర్వ్యూలను (ఐదురోజుల పాటు) నిర్వహిస్తారు.
-ఫ్లయింగ్ బ్రాంచీ అభ్యర్థులకు కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం (సీపీఎస్‌ఎస్)ను నిర్వహిస్తారు. ఇది జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే నిర్వహిస్తారు.
-స్టేజ్ -2లో అర్హత సాధించినవారికి ఏఎఫ్‌సీఎంఈ, న్యూఢిల్లీలో లేదా బెంగళూరులో వైద్యపరీక్షలను నిర్వహిస్తారు.
-ఫ్లయింగ్ బ్రాంచీ: కంప్యూటరైజ్డ్ పైలట్ సెలక్షన్ సిస్టం, పీఏబీటీలను నిర్వహిస్తారు.
-ఏఎఫ్‌సీటీ పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, బీదర్, చెన్నై, ఢిల్లీ, ముంబై తదితర పట్టణాల్లో ఉన్నాయి. (మనకు దగ్గర్లోని పట్టణాలను మాత్రమే పేర్కొన్నాం)శిక్షణ
-ఎయిర్‌ఫోర్స్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఏఎఫ్‌సీఏటీ కోర్సు 2018, జూలైలో ప్రారంభమవుతుంది.
-గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) - 74 వారాలు, నాన్ టెక్నికల్ డ్యూటీ - 52 వారాలు శిక్షణ ఉంటుంది.
-పేస్కేల్: రూ. 15,600 - 39,100 + గ్రేడ్ పే ఇస్తారు.
-ఫ్లయింగ్ ఆఫీసర్ - నెలకు రూ. 85,372/- (సుమారుగా)
-గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) - రూ. 74,872/-
-గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) - రూ. 71872/-
-వీటికితోడు ఇతర అలవెన్స్‌లు, ప్రత్యేక ఇన్సూరెన్స్ ఇతరత్రా ఉంటాయి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. పూర్తి వివరాలతోపాటు మొబైల్ నంబర్ , వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-చివరితేదీ: జూన్ 29
-వెబ్‌సైట్: www.careerairforce.nic.in.


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సీఎస్‌ఐఆర్-యూఆర్‌డీఐపీ ప్రాజెక్ట్ అసిస్టెంట్లు,
సీఎస్‌ఐఆర్‌కు చెందిన యూనిట్ ఫర్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్స్ (సీఎస్‌ఐఆర్-యూఆర్‌డీఐపీ)లో సైంటిఫిక్ ఇన్ఫర్మాటిక్స్‌లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు..

సీఎస్‌ఐఆర్-యూఆర్‌డీఐపీ పుణెలో కొత్తగా చేపట్టనున్న వివిధ ప్రాజెక్టుల్లో పనిచేయడానికి ప్రాజెక్ట్ అసిస్టెంట్-I, II, III పోస్టులను భర్తీ చేస్తున్నది.
-మొత్తం పోస్టులు: 62
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (కెమికల్ సైన్సెస్): 24
-అర్హతలు: 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ కెమికల్ సైన్సెస్‌లో ఆర్గానిక్ లేదా పాలీమర్ కెమిస్ట్రీ లేదా ఇనార్గానిక్ కెమిస్ట్రీ లేదా మెటీరియల్ సైన్స్ లేదా సిరామిక్స్ అండ్ గ్లాసెస్ లేదా ఎంఫార్మా చేసి ఉండాలి.
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 19
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (లైఫ్ సైన్సెస్): 17
-అర్హతలు: 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీలో లైఫ్ సైన్సెస్ లేదా బయోకెమిస్ట్రీ లేదా బయోటెక్నాలజీ లేదా మైక్రోబయాలజీ లేదా జెనెటిక్స్ లేదా బయోఇన్ఫర్మాటిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 13
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్): 9
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (ఇంజినీరింగ్/ఫిజిక్స్): 4
-ప్రాజెక్ట్ అసిస్టెంట్ (కంప్యూటర్ లేదా ఐటీ): 6
-ప్రాజెక్ట్ అసిస్టెంట్: 2 (గ్రేడ్-1 లైబ్రెరీ సైన్స్)
-పే స్కేల్: గ్రేడ్-1 పోస్టులకు- రూ. 15,000, గ్రేడ్-2 పోస్టులకు రూ. 25,000, గ్రేడ్-3 పోస్టులకు రూ. 28,000 + హెచ్‌ఆర్‌ఏ 20 శాతం (అన్ని పోస్టులకు)
-వయస్సు: గ్రేడ్-1 పోస్టులకు- 28 ఏండ్లలోపు, గ్రేడ్-2 పోస్టులకు 30 ఏండ్లలోపు, గ్రేడ్-3 పోస్టులకు 35 ఏండ్లలోపు ఉండాలి.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో.
-ఇంటర్వ్యూ తేదీలు పోస్టులను బట్టి వేర్వేరుగా ఉన్నాయి.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 12
-వెబ్‌సైట్: http://urdip.res.in/career.htm



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ ఉద్యోగాలు,
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ ప్రొడక్టివిటీ వివిధ 
విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ 
రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి 
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
congress 
వివరాలు:
ఐఎఫ్‌పీ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రిసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య: 11
-జేఆర్‌ఎఫ్-2 పోస్టులు
-ఫీల్డ్ అసిస్టెంట్-5 పోస్టులు
-ప్రాజెక్ట్ అసిస్టెంట్-1 పోస్టు
-డాటా ఎంట్రీ ఆపరేటర్-1 పోస్టు
-టెక్నికల్ ఆఫీసర్-2 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ, బీఎస్సీ, ఇంటర్‌లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. 
-వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. 
-ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. 
-ఇంటర్వ్యూ తేదీ: జూన్ 13
-వెబ్‌సైట్: www.ifpranchi.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నైపర్‌లో ఉద్యోగాలు.

అహ్మదాబాద్‌లోని నైపర్ జేఆర్‌ఎఫ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. 
వివరాలు:

-పోస్టుపేరు: జేఆర్‌ఎఫ్
-పోస్టుల సంఖ్య-3 పోస్టులు
-అర్హత: మాస్టర్ డిగ్రీ/ఎం ఫార్మా లేదా ఎంఎస్ ఫార్మాతోపాటు నెట్, గేట్, జీప్యాట్ ఉండాలి. 
-ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా 
-దరఖాస్తు: ఆన్‌లైన్ 
-చివరి తేదీ: జూన్ 15
-వెబ్‌సైట్: ww.niperahm.ac.in


0 comments:

Post a Comment