Wednesday, 10 May 2017

UCIL Recruitment 131 Apprentices ,Technicians Jobs in HPCL,Executive Trainees at NPCIL,Faculty posts in Jipmer యూసీఐఎల్‌లో 131 అప్రెంటిస్‌లు, హెచ్‌పీసీఎల్‌లో టెక్నీషియన్లు, ఎన్‌పీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు, జిప్‌మర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.

యూసీఐఎల్‌లో 131 అప్రెంటిస్‌లు,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) వివిధ విభాగాల్లో (ఐటీఐ ట్రేడ్) అప్రెంటిస్‌షిప్ చేయడానికి అర్హులైన
అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
UCIL
వివరాలు:
పోస్టు పేరు: అప్రెంటిస్‌షిప్ ట్రెయినింగ్
విభాగాల వారీగా ఖాళీలు:
-ఫిట్టర్-40 పోస్టులు , ఎలక్ట్రీషియన్-40 పోస్టులు
-వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)-15, ఆటో ఎలక్ట్రీషియన్-5 పోస్టులు..
-టర్నర్/మెషినిస్ట్-5, కార్పెంటర్-6, ప్లంబర్-6, పైప్ ఫిట్టర్-5 పోస్టులు
-ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ -5, మెకానికల్ (ఎంవీ)/ మెకానికల్ డీజిల్-4 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్/సంస్థ నుంచి ప్రథమ శ్రేణిలో పదోతరగతితోపాటు ఎన్‌సీవీటీ లేదా ఎస్‌సీవీటీ సంస్థ నుంచి సంబంధిత ఐటీఐ ట్రేడ్‌లో ఉత్తీర్ణత. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 మార్చి 31 నాటికి 25 ఏండ్లకు మించరాదు. సంస్థ నియమాలు, నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
స్టయిఫండ్ : ట్రెయినింగ్‌లో భాగంగా మొదటి, రెండో, మూడో ఏడాది వరుసగా రూ. 4004/-, 4576/-, 5148/- స్టయిఫండ్ చెల్లిస్తారు
ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపికచేసి రాతపరీక్ష/ఇంటర్వ్యూ నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
చిరునామా: Dy. General Manager (Inst./Pers. &IRs), Uranium Corporation of India Limited, PO : Jaduguda, Dist : East Singhbhum,
Jharkhand 832 102
చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 15 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి. పూర్తి వివరాలకు ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడవచ్చు.
వెబ్‌సైట్: http://www.ucil.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌పీసీఎల్‌లో టెక్నీషియన్లు,

వైజాగ్‌లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) బాయిలర్, ఆపరేషన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
HPCL
వివరాలు:
హెచ్‌పీసీఎల్ నవరత్న కంపెనీ. దీనిని 1974లో ఏర్పాటు చేశారు.
పోస్టు పేరు: టెక్నీషియన్ (బాయిలర్/ఆపరేషన్స్)
మొత్తం పోస్టుల సంఖ్య: 60 (జనరల్-23, ఓబీసీ-18, ఎస్సీ-7, ఎస్టీ-12)
అర్హత: ఆపరేషన్ విభాగంలోని పోస్టులకు డిప్లొ మా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, బాయిలర్ విభాగంలోని పోస్టులకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. దీంతోపాటు ఫస్ట్‌క్లాస్ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత కోర్సుల్లో జనరల్/ఓబీసీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, మిగతా అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2017 మే 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
పే స్కేల్ : రూ. 40,000/- ఎంపికైన అభ్యర్థులు 9 నెలలు ప్రొబేషనరీ పీరియడ్‌లో పనిచేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా హెచ్‌పీసీఎల్ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.600/- (జనరల్/ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
ఎంపిక: రాతపరీక్ష/కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
-ఈ పరీక్షలో జనరల్ ఆఫ్టిట్యూడ్ టెస్ట్, టెక్నికల్/ప్రొఫెషనల్ నాలెడ్జ్ అంశాలపై ప్రశ్నలు ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
చివరితేదీ: జూన్ 8
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌పీసీఐఎల్‌లో ఎగ్జిక్యూటివ్ ట్రెయినీలు,
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పని చేస్తున్న న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పోస్టుల భర్తీకి (గేట్ 2017 స్కోర్ ద్వారా) అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Nuclear-power-plant
వివరాలు: అణుశక్తి విడ్యుత్ ఉత్పత్తి, పంపిణీచేసే ప్రీమియర్ సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ అయిన ఎన్‌పీసీఐఎల్‌ను సెప్టెంబర్ 17, 1987లో స్థాపించారు. ఈ కంపెనీ నినాదం మొదట భద్రత & ఉత్పత్తి తదుపరి. అణు టెక్నాలజీకి సంబంధించిన సైట్ సెలక్షన్, డిజైన్, కన్‌స్ట్రక్షన్, కమిషనింగ్, ఆపరేషన్, మెయింటెనెన్స్, రిన్నోవేషన్, మోడ్రనైజేషన్ అండ్ అప్ గ్రెడేషన్, ప్లాంట్ లైఫ్ ఎక్స్‌టెన్షన్, న్యూక్లియర్ రియాక్టర్‌కు సంబంధించిన వేస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ డీ కమిషనింగ్‌లను పర్యవేక్షిస్తుంది.
పోస్టు పేరు: ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ
పనిచేసే ప్రదేశం: దేశ వ్యాప్తంగా ఉన్న ఎన్‌పీసీఐఎల్ యూనిట్లలో
విభాగాలు: మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ (మెకానికల్, కెమికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్)లో ఉత్తీర్ణత. గేట్-2017 స్కోర్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
పేస్కేల్ : రూ. 24,900 - 50,500/-
ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
ఎంపిక: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2017 స్కోర్ ఆధారంగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపికచేస్తారు.
-ప్రొబేషనరీ పీరియడ్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
చివరితేదీ: మే 31
వెబ్‌సైట్: www.npcilcareers.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
జిప్‌మర్‌లో ఫ్యాకల్టీ పోస్టులు.పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ నెహ్రూ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (జిప్‌మర్) ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
JIPMER
వివరాలు:
జిప్‌మర్ జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంస్థ. ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ పరిధిలో ఇది పనిచేస్తుంది.
-పోస్టులు - ఖాళీలు:
-ప్రొఫెసర్ - 10
-అసోసియేట్ ప్రొఫెసర్ - 7
-అసిస్టెంట్ ప్రొఫెసర్ - 10
-ట్యూటర్ - 12
నోట్: ఈ పోస్టులను కరైకల్ క్యాంపస్ కోసం తాత్కాలిక ప్రాతిపదికన (కాంట్రాక్టు) భర్తీ చేస్తున్నారు.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: జూన్ 5
వెబ్‌సైట్: www.jipmer.edu.in


0 comments:

Post a Comment