Tuesday, 2 May 2017

SI, ASI Recruitment 2221 posts,Jobs in the selection center,Bank of India Recruitment,Specialst Officers jobs in PNB,MBA Admissions in the NIT. ఎస్‌ఐ, ఏఎస్‌ఐ 2221 పోస్టులు, సెలక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేన్‌జ్‌మెంట్‌ ఖాళీలు, పీఎన్‌బీలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు, నిట్‌లో ఎంబీఏ ప్రవేశాలు.

ఎస్‌ఐ, ఏఎస్‌ఐ 2221 పోస్టులు,

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఎంపిక
-కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీస్ శాఖలో ఖాళీలు
-డిగ్రీ అర్హత, రాతపరీక్ష, పీఈటీ ద్వారా ఎంపిక
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు, చివరితేదీ మే 15

కేంద్ర బలగాలు, ఢిల్లీ పోలీస్ శాఖల్లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
దేశ రక్షణ, రాజధానిలో శాంతి భద్రతల పరిరక్షణ, దేశంలోని ప్రముఖ, ప్రతిష్ఠాత్మక సంస్థలు/కేంద్రాల వద్ద రక్షణ కోసం ఏర్పాటైన సంస్థలో ఈ ఖాళీలు ఉన్నాయి.
వయస్సు: ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పోస్టులకు 20 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, ఎక్స్‌సర్వీస్, కేంద్ర సర్వీసుల్లో పనిచేసినవారికి నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
విద్యార్హతలు: 2017, జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
ఢిల్లీ పోలీస్‌లో ఎస్‌ఐ (పురుష) పోస్టుకు వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ (ఎల్‌ఎంవీ) కలిగి ఉండాలి.
నోట్: లైసెన్స్ లేనివారు సీఏపీఎఫ్‌లో ఖాళీలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో,
చివరితేదీ: మే 15
వెబ్‌సైట్: http://ssc.nic.in
ఫీజు: రూ. 100/- (మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు)
పరీక్షకేంద్రాలు: సదరన్ రీజియన్‌లో హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, చెన్నై, పుదుచ్చేరి, తిరుచిరాపల్లి, విశాఖపట్నం, విజయవాడ.
Inspectors

పరీక్ష విధానం: పేపర్ - 1, 2 ఉంటాయి.
పేపర్ -1ని 2017, జూన్ 30 నుంచి జూలై 7 వరకు నిర్వహిస్తారు.
పేపర్ - 2 పరీక్ష 2017, అక్టోబర్ 8న నిర్వహిస్తారు.
పేపర్ - 1 పరీక్ష విధానం:
దీనిలో నాలుగు విభాగాలు ఉంటాయి.
పరీక్ష కాలవ్యవధి 2 గంటలు
పార్ట్ ఏ - జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - 50 ప్రశ్నలు (50 మార్కులు), పార్ట్ బీ - జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ - 50 ప్రశ్నలు (50 మార్కులు), పార్ట్ సీ క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 50 ప్రశ్నలు (50 మార్కులు), పార్ట్ డీ - ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ - 50 ప్రశ్నలు (50 మార్కులు).
పేపర్ - 2:
ఇది 200 మార్కులకు ఉంటుంది. 200 ప్రశ్నలు. 2 గంటల సమయం.
దీనిలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్ ఇస్తారు.
నోట్: రెండు పేపర్లలో ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రశ్నలు ఇంగ్లిష్/హిందీలో ఇస్తారు.
పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కులు కోతవిధిస్తారు.
శారీరక ప్రమాణాలు:
పురుష అభ్యర్థులకు: 170 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఛాతీ 80 సెం.మీ., గాలిపీల్చినప్పుడు 85 సెం.మీ. ఉండాలి.
షెడ్యూల్ ట్రైబ్స్ (అన్ని రకాల) వారు ఎత్తు 162.5 సెం.మీ., ఛాతీ 77 సెం.మీ., గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
మహిళా అభ్యర్థులు - 157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎస్టీ మహిళలు 154 సె.మీ. ఎత్తు ఉంటే సరిపోతుంది.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ (పీఈటీ) అన్ని పోస్టులకు:
పురుష అభ్యర్థులు:
16 సెకండ్లలో 100 మీటర్ల దూరాన్ని పరుగెత్తాలి.
1.6 కి.మీ. దూరాన్ని 6.5 నిమిషాల్లో పరుగెత్తాలి.
లాంగ్‌జంప్ - 1.2 మీటర్లు (మూడు అవకాశాలు)
షాట్‌పుట్ (16 ఎల్‌బీఎస్) - 4.5 మీటర్లు (మూడు అవకాశాలు)
మహిళా అభ్యర్థులు:
18 సెకండ్లలో 100 మీటర్ల దూరం పరుగెత్తాలి
800 మీటర్ల దూరం 4 నిమిషాల్లో
లాంగ్‌జంప్ 2.7 మీటర్లు
హైజంప్ 0.9 మీటర్లు (మూడు అవకాశాలు)
ఎంపిక: పేపర్ - 1, 2ల్లో వచ్చిన మార్కులతో షార్ట్‌లిస్ట్ చేసి అభ్యర్థులను ఎంపికచేస్తారు.
పేస్కేల్: ఎస్‌ఐ (సీఏపీఎఫ్‌ల్లో) - ఇది గ్రూప్ బీ నాన్ గెజిటెడ్ పోస్టు.
రూ. 35,400 - 1,12, 400/-
ఢిల్లీ పోలీస్‌లో ఎస్‌ఐ పోస్టు - ఇది గ్రూప్ సీ నాన్ గెజిటెడ్.
రూ. 35,400 - 1,12,400/-
ఏఎస్‌ఐ పోస్టు - రూ. 29, 200 - 92,300/

మొత్తం ఖాళీలు -2221
శాఖల వారీగా ఖాళీలు ...
సబ్ ఇన్‌స్పెక్టర్ (పురుష) - ఢిల్లీ పోలీస్ - 616
సబ్ ఇన్‌స్పెక్టర్ (మహిళ) - ఢిల్లీ పోలీస్ - 256
సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ) - సీఏపీఎఫ్‌లో (పురుష) - 697
సబ్ ఇన్‌స్పెక్టర్ (జీడీ) - సీఏపీఎఫ్‌లో (మహిళ) - 89
అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ - సీఐఎస్‌ఎఫ్‌లో - 563



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
సెలక్షన్ సెంటర్‌లో ఉద్యోగాలు,
బెంగళూరులోని సెలక్షన్ సెంటర్ సౌత్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:రక్షణశాఖ పరిధిలో సెలక్షన్ సెంటర్ సౌత్ పనిచేస్తుంది. 
మసల్చి - 3, మెసెంజర్ - 2, మెస్ వెయిటర్ - 2, కుక్ - 1, రూమ్ ఆర్డర్లీ (ఎంటీఎస్) - 1, వాచ్‌మ్యాన్ (ఎంటీఎస్) - 1, సఫాయివాలా (ఎంటీఎస్) - 1 ఖాళీలు ఉన్నాయి.

మొత్తం ఖాళీలు - 11
అర్హతలు: మసల్చి, మెసెంజర్, మెస్ వెయిటర్, కుక్, రూమ్ ఆర్డర్లీ, వాచ్‌మ్యాన్, సఫాయివాలా (ఎంటీఎస్) పోస్టులకు - పదోతరగతి లేదా తత్సమాన అర్హత.
వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. (ఎస్టీ అభ్యర్థులకు 30 ఏండ్లు)
పేస్కేల్: రూ. 18,000/-
పోస్టులకు - పదోతరగతి ఉత్తీర్ణత.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 21 రోజుల్లో పంపాలి. (ప్రకటన ఏప్రిల్ 29 - మే 5 ఇష్యూలో వచ్చింది)
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: ది కమాండెంట్, సెలక్షన్ సెంటర్ సౌత్, కబ్బన్ రోడ్, 

బెంగళూరు - 560042

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేన్‌జ్‌మెంట్‌ ఖాళీలు,

జాతీయ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ /మిడిల్ మేనేజ్‌మెంట్ విభాగాల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
BankofIndia

వివరాలు:
ప్రైవేట్ యాజమాన్యంతో 1906 సెప్టెంబర్ 7లో స్థాపించబడిన బ్యాంక్ ఆఫ్ ఇండియాను 1969 జూలై 19న జాతీయం చేశారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 32 పోస్టులు
పోస్టు పేరు :సెక్యూరిటీ ఆఫీసర్ -17 పోస్టులు (జనరల్-5, ఓబీసీ-8, ఎస్సీ-2, ఎస్టీ-2)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత.మూడు నెలల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ ఉండాలి. ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్సెస్‌లో డిప్యూటీ సూపరింటెండెంట్ హోదా లేదా తత్సమాన హోదాలో పనిచేసి ఉండాలి. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి.
పోస్టు పేరు: టెక్నికల్ (అప్రైజల్) ఆఫీసర్-10 పోస్టులు (జనరల్-5, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ (మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెక్స్‌టైల్, ప్రొడక్షన్, మెటలర్జీ, బీ ఫార్మసీ, పెట్రోలియం టెక్నాలజీ, ప్లాస్టిక్ టెక్నాలజీ, ఆయిల్ టెక్నాలజీ, పవర్ ఇంజినీరింగ్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎంబీఏ (ఫైనాన్స్/బ్యాంకింగ్)లో ఉత్తీర్ణత.
పోస్టు పేరు: టెక్నికల్ ఆఫీసర్-5 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ (సివిల్ ఇంజినీరింగ్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 ఏప్రిల్ 10 నాటికి 25 నుంచి 40 ఏండ్ల మధ్య ఉండాలి. టెక్నికల్ ఆఫీసర్‌కు 21 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి.
పే స్కేల్ : మిడిల్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్‌కు రూ.31,705 -45,950/-, జూనియర్ మేనేజ్‌మెంట్ ఆఫీసర్‌కు రూ. 23700-42020/-
అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీలకు రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు రూ. 100/- చెల్లించాలి.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై పాటు దేశవ్యాప్తంగా 26 ఎగ్జామినేషన్ సెంటర్‌లలో పరీక్షను నిర్వహిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
పరీక్ష కాలవ్యవధి 90 నిమిషాలు
పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు.
ఆన్‌లైన్‌టెస్ట్‌లో మెరిట్ పొందిన అభ్యర్థులను రిజర్వేషన్ ప్రకారం పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టులను పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: మే 12
వెబ్‌సైట్: www.bankofindia.co.in
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
పీఎన్‌బీలో స్పెషలిస్ట్ ఆఫీసర్లు,
పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) కాంట్రాక్ట్, రెగ్యులర్ విధానంలో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
పోస్టు పేరు: స్పెషలిస్ట్ ఆఫీసర్- 4 పోస్టులు
కాంట్రాక్ట్ విధానంలో..
జనరల్ మేనేజర్ -హెచ్‌ఆర్ (కార్పొరేట్)-1 పోస్టు
చీఫ్ డిజిటల్ ఆఫీసర్-1 పోస్టు
రెగ్యులర్ విధానంలో..
ఏజీఎం (ఎకానమిస్ట్)-1 పోస్టు
ఏజీఎం (కంపెనీ సెక్రటరీ)-1 పోస్టు
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరకాఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేదీ: మే 12
వెబ్‌సైట్:www.pnbindia.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నిట్‌లో ఎంబీఏ ప్రవేశాలు.

కురుక్షేత్రలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లో ఎంబీఏ కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
నిట్ కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలో పనిచేస్తుంది.
కోర్సు: ఎంబీఏ
కాలవ్యవధి: రెండేండ్లు. ఇది ఫుల్‌టైం కోర్సు.
దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
చివరితేదీ: మే 22
వెబ్‌సైట్: www.nitkkr.ac.in

బిట్స్ పిలానీలో పీహెచ్‌డీ

బ్లిరా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నలాజీ అండ్ సైన్స్ (బిట్స్) పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
బిట్స్ పిలానీ ఒక డీమ్డ్ యూనివర్సిటీ. బిట్స్ క్యాంపస్‌లు హైదరాబాద్, దుబాయి, గోవాల్లో ఉన్నాయి.
పీహెచ్‌డీ ప్రోగ్రామ్:
ఈ కోర్సును పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో నిర్వహిస్తున్నారు.
విభాగాలు: బయాలజికల్ సైన్స్, కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, సివిల్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎకనమిక్స్, ఫైనాన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మేనేజ్‌మెంట్, మ్యాథ్స్, మెకానికల్ ఇంజినీరింగ్, ఫార్మసీ, ఫిజిక్స్, హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్, బయోటెక్నాలజీ, ఎనర్జీ, ఎన్విరాన్‌మెంట్, రోబోటిక్స్, నానో సైన్స్, నానో టెక్నాలజీ, వాటర్ మేనేజ్‌మెంట్ ఉన్నాయి.
అర్హతలు: ఎంఈ/ఎంఫార్మా లేదా ఎంబీఏ లేదా ఎంఫిల్‌లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
కొన్ని విభాగాలకు ఎమ్మెస్సీ, ఎంఏలో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులే. వివరాలకు వెబ్‌సైట్ చూడవచ్చు.
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: మే 16
వెబ్‌సైట్: www.bitsadmission.com


0 comments:

Post a Comment