Tuesday, 2 May 2017

Sailor posts in the Indian Navy,Engineers in the RRI. ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులు, ఆర్‌ఆర్‌ఐలో ఇంజినీర్లు

ఇండియన్ నేవీలో సెయిలర్ పోస్టులు,
భారత రక్షణశాఖ పరిధిలోని నావికాదళంలో సెయిలర్ (మ్యూజిక్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
త్రివిధదళాల్లో నావికా దళం ఒకటి. దేశ తీరప్రాంత రక్షణలో ఇది కీలకభూమిక పోషిస్తుంది.
పోస్టు: సెయిలర్ (మ్యుజీషియన్)
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 1996, అక్టోబర్ 1 - 2000, సెప్టెంబర్ 30 మధ్య జన్మించి ఉండాలి. (ఆ రెండు రోజులు కలుపుకొని). సంగీతంలో ఉన్నత అర్హతలు ఉన్నవారికి వయస్సు సడలింపు ఇస్తారు.
మ్యూజికల్ ఎబిలిటీ: ఓరల్ ఆప్టిట్యూడ్, థియరీ ఆఫ్ మ్యూజిక్‌లో బేసిక్ నాలెడ్జ్, ఇండియా, విదేశీ ఇన్‌స్ట్రుమెంట్లలో ప్రాక్టికల్ స్కిల్ కలిగి ఉండాలి.
ఒకటి లేదా అంతకంటే ఎక్కువ స్ట్రింగ్, కీబోర్డు, ఉడ్‌విండ్, బ్రాస్ తదితర సంగీత సాధనాలను ఉపయోగించగలిగే సామర్థ్యం ఉండాలి.
పే అండ్ అలవెన్స్: శిక్షణా కాలంలో నెలకు రూ. 5,700/- ఇస్తారు. శిక్షణ విజయవంతంగా పూర్తిచేసుకొన్నవారికి నెలకు రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/- ఇస్తారు.
పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టీ ఆఫీసర్ - 1 (సుబేదార్ మేజర్ స్థాయి) వరకు పదోన్నతి పొందవచ్చు.
నోట్: శిక్షణ, శిక్షణానంతరం పుస్తకాలు, ఇతర మెటీరియల్, యూనిఫాం, ఆహారం, వసతి తదితరాలు పూర్తి ఉచితంగా కల్పిస్తారు.
IndianNavy

ఎంపిక విధానం:
ప్రిలిమినరీ సెలక్షన్, పీఎఫ్‌టీ, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా చేస్తారు. వీటన్నింటికి కనీసం 3 - 4 రోజుల సమయం పడుతుంది.
చివరగా వైద్యపరీక్షలు నిర్వహిస్తారు. దీనిలో అర్హత సాధించినవారిని తుది ఎంపిక చేస్తారు.
మొదట మ్యూజికల్ స్క్రీనింగ్ టెస్ట్, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
మ్యూజికల్ ఆప్టిట్యూడ్, ఓరల్ ఎబిలిటీ స్థాయిని బట్టి ఎంపిక జరుగుతుంది. ఈ టెస్ట్ 2017, జూలై 14న నిర్వహిస్తారు.
దీనిలో క్వాలిఫై అయినవారికి ఐఎన్‌ఎస్ కుంజలి, కొలాబా, ముంబైల్లో మెడికల్ టెస్ట్‌లను సెప్టెంబర్ 4 - 8 వరకు నిర్వహిస్తారు.
ఐఎన్‌ఎస్ కుంజలిలో ఎంపికైనవారిని తుది ఎంపిక కోసం ఐఎన్‌హెచ్‌ఎస్ అశ్వినికి పంపిస్తారు. అక్కడ ఎంపికైన వారిని ఐఎన్‌ఎస్ చిల్కా (ఒడిశా)కు ప్రాథమిక శిక్షణకు పంపిస్తారు.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):
ఈ టెస్ట్‌లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి.
7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి. 20 ఉతక్,బైటక్‌లు, 10 ఫుష్‌అప్స్ చేయాలి.
శారీరక ప్రమాణాలు:
కనీస ఎత్తు 157 సెం.మీ., ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. గాలి పీల్చినప్పుడు కనీసం 5 సెం.మీ. వ్యాకోచించాలి.
శిక్షణ: కోర్సు అక్టోబర్ 2017 నుంచి ప్రారంభమవుతుంది. ఐఎన్‌ఎస్ చిల్కాలో 15 వారాలపాటు ప్రాథమిక శిక్షణనిస్తారు. తర్వాత 26 వారాలపాటు ప్రత్యేక శిక్షణ ముంబైలో ఇస్తారు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో (వెబ్‌సైట్‌లో ఉంది)
దరఖాస్తును ఆర్డినరీ పోస్టులో మాత్రమే పంపాలి.
పరీక్ష కేంద్రాలు: ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, కొచ్చి, విశాఖపట్నం
చివరితేదీ: మే 19
వెబ్‌సైట్: www.joinindiannavy.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్‌ఆర్‌ఐలో ఇంజినీర్లు


బెంగళూరులోని రామన్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఆర్‌ఆర్‌ఐ) కంప్యూటర్ విభాగంలో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
పోస్టు పేరు: ఇంజినీర్-2 పోస్టులు
విభాగాలు: డిజిటల్ అప్లికేషన్స్, అనలాగ్ అప్లికేషన్స్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 70 శాతం మార్కులతో బీఈ/బీటెక్ (ఎలక్ట్రానిక్స్& కమ్యూనికేషన్ ఇంజినీరింగ్)లో ఉత్తీర్ణత లేదా ఎంఈ/ఎంటెక్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: 15,600-39,100/-
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా.
దరఖాస్తుకు చివరితేదీ: మే 31
వెబ్‌సైట్:www.rri.res.in

0 comments:

Post a Comment