Monday, 22 May 2017

PG Courses at Agriculture University అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీజీ కోర్సులు

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2017-2018 విద్యా సంవత్సారానికి ఎమ్మెస్సీ, ఎంబీఏ, ఎంటెక్ కోర్సుల ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:

ఈ యూనివర్సిటీ 2014లో ఏర్పాటైంది (గతంలో ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో భాగంగా ఉండేది). రాష్ట్రంలోని వ్యవసాయ పరిశోధన, అనుబంధ విద్య, విస్తరణను పర్యవేక్షిస్తుంది.
కోర్స్ పేరు: ఎమ్మెస్సీ అగ్రికల్చర్
విభాగాలు: ఆగ్రానమీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎంటమాలజీ, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, క్రాప్ ఫిజియాలజీ, సాయిల్ సైన్స్, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, ఆగ్రానమీ (వాటర్ మేనేజ్‌మెంట్), మాలిక్యులర్ బయాలజీ, బయోటెక్నాలజీ
మొత్తం సీట్ల సంఖ్య:77
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఎస్సీ (అగ్రికల్చర్) లేదా బీఎస్సీ (సీఏ అండ్ బీఎమ్)లో ఉత్తీర్ణత.
కోర్స్ పేరు: ఎమ్మెస్సీ హోం సైన్స్
విభాగాలు: ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్, హోం సైన్స్ ఎక్స్‌టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్.
మొత్తం సీట్ల సంఖ్య:11
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (హోం సైన్స్), బీహెచ్‌ఎస్సీ (రూరల్), బీఎస్సీ (హెచ్‌ఎస్సీ), బీహెచ్‌ఎస్సీ/బీఎస్సీ (ఆనర్స్), హోం సైన్స్/బీఎస్సీ హనర్స్, నాలుగేండ్ల డిగ్రీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్)లో ఉత్తీర్ణత.
కోర్స్ పేరు: ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్
మొత్తం సీట్ల సంఖ్య:18
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఎఎస్సీ (అగ్రికల్చర్)/హార్టికల్చర్, బీటెక్ (అగ్రికల్చర్ ఇంజినీరింగ్) లేదా బీవీఎస్సీ అండ్ ఏహెచ్/ బీఎఫ్‌ఎస్సీ, బీహెచ్‌ఎస్సీ (రూరల్), బీఎస్సీ (హెచ్‌ఎస్సీ), బీటెక్ (డెయిరింగ్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ), బీఎస్సీ (ఆనర్స్), నాలుగేండ్ల డిగ్రీ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్), బీఎస్సీ(సీఏ అండ్ బీఎమ్)లో ఉత్తీర్ణత.
pjtsau

కోర్స్ పేరు: ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్
మొత్తం సీట్ల సంఖ్య: 7
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి నాలుగేండ్ల బీఎస్సీ (అగ్రికల్చర్), బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ)లో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జూలై 1 నాటికి 40 ఏండ్లకు మించరాదు.
అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ.1325/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 725/-చెల్లించాలి.
ఎంపిక: ఎమ్మెస్సీ అగ్రికల్చర్, ఎమ్మెస్సీ హోం సైన్స్, ఎంటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులకు డిగ్రీలోని అకడమిక్ సబెక్ట్‌లోని వచ్చిన మార్కులు ప్రవేశపరీక్ష/రాతపరీక్షలో వచ్చిన మార్కులను 30:70 వెయిటేజీ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
ఎంబీఏ అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుకు రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా. ఈ పరీక్షలో జనరల్ ఇంగ్లిష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్ అండ్ జనరల్ నాలెడ్జ్/ కరెంట్ అఫైర్స్ అంశాల నుంచి వస్తాయి.
నోట్: రాజేంద్రనగర్, జగిత్యాల, సంగారెడ్డి, సైఫా బాద్, బాపట్ల కళాశాలల్లో పై కోర్సులు ఉన్నాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ హార్డ్‌కాపీని ప్రింట్‌తీసి కింది చిరునామాకు స్పీడ్‌పోస్ట్‌లో మాత్రమే పంపాలి.
చిరునామా: The Registrar, Administrative Office, Professor Jayashankar Telangana State -Agricultural University, Rajendranagar,
Hyderabad 500030
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
హార్డ్‌కాపీని పంపడానికి చివరితేదీ: జూన్ 22 (సాయంత్రం 4 గంటల వరకు )
హల్‌టికెట్ డౌన్‌లోడింగ్ : జూలై 1 నుంచి
వెబ్‌సైట్: http://www.pjtsau.ac.in

0 comments:

Post a Comment