Monday, 29 May 2017

Ordinance factories Recruitment 5186 Posts,Air India Express Recruitment Coordinators,Jobs in IIT Madras ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 5186 ఉద్యోగాలు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కోఆర్డినేటర్లు, ఐఐటీ మద్రాస్‌లో ఉద్యోగాలు.

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో 5186 ఉద్యోగాలు,

కేంద్ర కొలువులు, ప్రత్యేక అలవెన్స్‌లు,
-పదోతరగతి, ఐటీఐ అభ్యర్థులకు అవకాశం
-దేశంలో ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు
-తెలంగాణలో 133 ఖాళీలు
-తెలుగులో పరీక్ష
-జూన్ 19 చివరితేదీ

sarathb-product
దేశవ్యాప్తంగా ఉన్న ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సెమీస్కిల్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రిక్రూట్‌మెంట్ సెంటర్ విడుదల చేసింది.

వివరాలు: 
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు రక్షణ మంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా 41 ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటిలో రక్షణశాఖకు కావలసిన ఉత్పత్తులను తయారుచేస్తారు. వీటితోపాటు 22 ఇతర ట్రెయినింగ్, సేఫ్టీ, ఆర్ అండ్ డీ, రిక్రూట్‌మెంట్ విభాగాలు ఈ బోర్డు పరిధిలో ఉన్నాయి.
-మొత్తం ఖాళీల సంఖ్య - 5186 
పోస్టు: ఇండస్ట్రియల్ ఎంప్లాయీ (సెమీస్కిల్డ్) & లేబర్ గ్రూప్ సీ 
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/- (ఎంట్రీ లెవల్ పే 7వ పే కమిషన్ ప్రకారం) ప్రారంభ జీతం నెలకు సుమారు రూ. 18,000/- వరకు వస్తుంది. 
అలవెన్స్‌లు: కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే అన్ని అలవెన్స్‌లు ఇస్తారు.
వయస్సు: దరఖాస్తు చివరితేదీ నాటికి 18 - 32 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: సెమీస్కిల్డ్ వర్క్‌మ్యాన్ పోస్టుకు - మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణతతోపాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ లేదా నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి. లేదా తత్సమాన కోర్సు (ఐటీఐ) ఉండాలి.
-లేబర్ పోస్టుకు - మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత.
ఎంపిక: రెండు దశల్లో జరుగుతుంది.
-రాతపరీక్ష 100 మార్కులకు, ట్రేడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్.
-రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా 1.25 నిష్పత్తిలో అభ్యర్థులను ట్రేడ్ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు. ట్రేడ్ టెస్ట్ కేవలం క్వాలిఫయింగ్ పరీక్ష మాత్రమే. దీనికి ఎటువంటి మార్కులు ఉండవు. 

రాతపరీక్ష విధానం: సెమీస్కిల్డ్ పోస్టులకు 
-ఒక పేపర్ ఉంటుంది. ఇది ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ టైప్‌లో 100 మార్కులకు ఉంటుంది.
-పేపర్‌లో రెండు విభాగాలు ఉంటాయి. అవి పార్ట్ - ఏ 20 మార్కులు ఇవి జనరల్ సైన్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌పై పదిమార్కుల చొప్పున ఇస్తారు. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి. 
-పార్ట్ - బీ 80 మార్కులకు ఉంటుంది. దీనిలో సంబంధిత ట్రేడ్‌పై ప్రశ్నలు ఇస్తారు.
-నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు.
-పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు
Posts 
లేబర్ పోస్టులకు రాతపరీక్ష: 
-న్యూమరికల్ ఎబిలిటీ - 40 మార్కులు, జనరల్ సైన్స్ - 30, జనరల్ అవేర్‌నెస్ - 30 ప్రశ్నల చొప్పున మొత్తం 100 ప్రశ్నలు. 100 మార్కులు.
-పరీక్ష కాలవ్యవధి 2 గంటలు. ప్రశ్నలు పదోతరగతి స్థాయిలో ఉంటాయి.
పరీక్ష కేంద్రాలు: భువనేశ్వర్, చెన్నై, కోయంబత్తూరు, ఢిల్లీ, హైదరాబాద్, జబల్‌పూర్, కోల్‌కతా, కాన్పూర్, ముంబై, నాగ్‌పూర్, పుణె, తిరుచ్చి. అవసరాన్ని బట్టి భోపాల్, లక్నో, డెహ్రాడూన్‌ల్లో సెంటర్లు కేటాయిస్తారు.
-పరీక్ష హిందీ/ఇంగ్లిష్, స్థానిక భాషల్లో నిర్వహిస్తారు. రాష్ట్ర అభ్యర్థులు తెలుగులో పరీక్ష రాసుకోవచ్చు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో మే 29 నుంచి ప్రారంభం
చివరితేదీ: జూన్ 19
అప్లికేషన్ ఫీజు: రూ. 50/-

వెబ్‌సైట్: http://www.ofb.gov.in.



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్‌లో కోఆర్డినేటర్లు,

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ లిమిటెడ్ ఆపరేషన్, కమర్షియల్, ైఫ్లెట్ సేఫ్టీ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
airindia-express
వివరాలు:
గతంలో ఎయిర్ ఇండియా చార్టర్స్ లిమిటెడ్‌గా పిలిచేవారు. ఈ పోస్టులను నిర్ణీత కాలవ్యవధికి భర్తీ చేస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 32
-కో ఆర్డినేటర్ (ఆపరేషన్ డిపార్ట్‌మెంట్) -10 (జనరల్-7, ఓబీసీ-2, ఎస్సీ-1)
అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్, విండోస్ ఎక్స్‌పీ, ఎంఎస్ ఆఫీస్‌లో నాలెడ్జ్ ఉండాలి. సంబంధిత ఏవియేషన్ రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 25 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 25,000/-
-రూట్ మేనేజర్ (కమర్షియల్ డిపార్ట్‌మెంట్)-7 (జనరల్ -5, ఓబీసీ-1, ఎస్సీ-1)
అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ సేల్స్, ఏవియేషన్ ), బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్, ఎంఎస్ ఆఫీస్‌లో నాలెడ్జ్ ఉండాలి. ఎయిర్‌లైన్ రంగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. పే స్కేల్ రూ. 50,000/-

-డిమాండ్ అనలిస్ట్ (కమర్షియల్ డిపార్ట్‌మెంట్)-3
అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ సేల్స్, ఏవియేషన్ ), బీఈ/బీటెక్‌లో ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్, ఎంఎస్ ఆఫీస్‌లో నాలెడ్జ్ ఉండాలి. ఎయిర్‌లైన్ రంగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 35 ఏండ్లకు మించరాదు.
-పే స్కేల్ రూ. 50,000/-
-ఆఫీసర్ సేల్స్ (కమర్షియల్ డిపార్ట్‌మెంట్)-9 (జనరల్-6, ఓబీసీ-2, ఎస్సీ-1)
అర్హత: ఎంబీఏ (మార్కెటింగ్ అండ్ సేల్స్)లో ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేషన్, ఎంఎస్ ఆఫీస్‌లో నాలెడ్జ్ ఉండాలి. ఎయిర్‌లైన్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) రంగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.

-పే స్కేల్ రూ. 25,000/-
-మేనేజర్ (ైఫ్లెట్ సేఫ్టీ)-1
అర్హత: బీఈ/బీటెక్ లేదా పీజీలో ఉత్తీర్ణత. యాక్సిడెంట్, ఇన్వెస్టిగేషన్, ఎస్‌ఎంఎస్ ైఫ్లెట్ సేఫ్టీ రంగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 40 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 70,000/-

-ఆఫీసర్ (ైఫ్లెట్ సేఫ్టీ)-2
అర్హత: బీఈ/బీటెక్ లో ఉత్తీర్ణత. ఎయిర్‌లైన్ ఫీల్డ్ రంగంలో అనుభవం ఉండాలి.
వయస్సు: 30 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: రూ. 35,000/-

-ప్యూన్-1 (ఏడో తరగతిలో ఉత్తీర్ణత)
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూలో ఎంపికైనవారికి మెడికల్ ఎగ్జామినేషన్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి రిక్రూట్‌మెంట్ అధికారికి పంపాలి.
చివరి తేదీ: పూర్తి వివరాలకు మే 27-జూన్ 2న ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ చూడవచ్చు.
వెబ్‌సైట్: www.airindiaexpress.in.




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐటీ మద్రాస్‌లో ఉద్యోగాలు.





చెన్నైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో టెక్నికల్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
-మొత్తం ఖాళీల సంఖ్య - 22
-టెక్నికల్ ట్రెయినీ - 8
జీతం: నెలకు రూ. 9,000/-
అర్హత: మూడేండ్ల కాలవ్యవధిగల డిప్లొమా (ఎలక్ట్రానిక్స్/ఈసీఈ లేదా ఈఈఈ, ఈఐ) ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత.
-గ్రాడ్యుయేట్ ట్రెయినీ - 14 పోస్టులు
జీతం: నెలకు రూ. 10,000/-
అర్హత: బీఈ/బీటెక్‌లో మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజినీరింగ్ లేదా సంబంధిత మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
వయస్సు: టెక్నికల్ ట్రెయినీ పోస్టులకు 23 ఏండ్లు, గ్రాడ్యుయేట్ ట్రెయినీ పోస్టులకు 28 ఏండ్లు మించరాదు.
ఎంపిక: రాతపరీక్ష/ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా
అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: జూన్ 16
వెబ్‌సైట్: https://recruit.iitm.ac.in/trainee

0 comments:

Post a Comment