Monday, 29 May 2017

Nalco Recruitment Management Trainees,NHAI Technical Managers Posts,NSICL Executive Assistants Jobs,IIHT Admissions Notification. నాల్కోలో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు, ఎన్‌హెచ్‌ఏఐ టెక్నికల్ మేనేజర్లు , ఎన్‌ఎస్‌ఐసీఎల్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు, ఐఐహెచ్‌టీ ప్రవేశాలు.

నాల్కోలో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు,

భువనేశ్వర్‌లోని నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ (నాల్కో)లో ఖాళీగా ఉన్న మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
nalco
వివరాలు:
ఇది గనుల మంత్రిత్వశాఖలో పనిచేస్తుంది. 1981
జనవరి 7న భవనేశ్వర్‌లో ఏర్పాటుచేశారు.
-పోస్టు పేరు: మేనేజ్‌మెంట్ ట్రెయినీ
-మొత్తం ఖాళీల సంఖ్య: 14 పోస్టులు (జనరల్-7, ఓబీసీ-3, ఎస్సీ-3, ఎస్టీ-1)
-విభాగాలు: ఫైనాన్స్-12, కంపెనీ సెక్రటరీ-2
-అర్హత: ఐసీఏఐ నుంచి సీఏ/సీఎంఏ, ఐసీఎస్‌ఐ నుంచి కంపెనీ సెక్రటరీషిప్ ఉండాలి.
-వయస్సు: 2017 మే 15 నాటికి 30 ఏండ్లకు మించరాదు.
-పేస్కేల్ : ట్రెయినింగ్ పీరియడ్‌లో రూ.16,400-3%-40,500 పేస్కేల్‌తో విజయవంతంగా ప్రొబేషనరీ పీరియడ్ పూర్తయిన తర్వాత జూనియర్ మేనేజర్‌గా పే స్కేల్ రూ. 24,900 - 50,500/- ఇస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-ఎస్సీ ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
-ఎంపిక: అకడమిక్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
-చివరి తేదీ: జూన్ 9
-వెబ్‌సైట్: www.nalcoindia.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌హెచ్‌ఏఐ టెక్నికల్ మేనేజర్లు ,

నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) సివిల్ విభాగంలో ఖాళీగా ఉన్న డిప్యూటీ టెక్నికల్ మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NHAI
వివరాలు:
ఎన్‌హెచ్‌ఏఐ మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ హైవేస్ పరిధిలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: డిప్యూటీ టెక్నికల్ మేనేజర్
-మొత్తం పోస్టుల సంఖ్య: 40 పోస్టులు (జనరల్-23, ఓబీసీ-3, ఎస్సీ-9, ఎస్టీ-5)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 2017 జూలై 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 15,600-39,100+ గ్రేడ్ పే రూ. 5400/-
-ఎంపిక: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను పూర్తిగా నింపి, కావల్సిన సంబంధిత సర్టిఫికెట్లను సెల్ఫ్ అటెస్టెడ్ డాక్యుమెంట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపించాలి.
-చిరునామా: M.N.Ghei Deputy General Manager (HR/Admn.-II) National High -ways Authority of India G-5 & 6, Sector-10 Dwarka, New Delhi-110 075
-చివరి తేదీ: జూలై 31
-వెబ్‌సైట్: www.nhai.org


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఎన్‌ఎస్‌ఐసీఎల్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్లు,
నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌ఐసీఎల్) ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ (కాంట్రాక్ట్ ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
NSIC
వివరాలు:
ఎన్‌ఎస్‌ఐసీఎల్ అనేది మినీరత్న కంపెనీ .
ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
-మొత్తం ఖాళీల సంఖ్య -15 పోస్టులు (జనరల్-8, ఓబీసీ-6, ఎస్టీ-2)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుంచి కంప్యూటర్ కోర్స్‌లో సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. స్కిల్ టెస్ట్‌లో కంప్యూటర్ స్క్రీన్ మీద ఇంగ్లిష్‌లో నిమిషానికి 40 పదాల వేగాన్ని కలిగి ఉండాలి.
-వయస్సు: 35 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్: రూ. 19,360+ ఫీల్డ్‌కు వెళ్లినప్పుడు నెలకు అదనంగా రూ. 2,500/- చెల్లిస్తారు
-ఎంపిక: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
-వెబ్‌సైట్: www.nsic.co.in




----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐఐహెచ్‌టీ ప్రవేశాలు.

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ) టెక్స్‌టైల్స్ ప్రాసెసింగ్‌లో 2017 విద్యాసంవత్సరానికి పోస్టు డిప్లొమా కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
handloom-inistitute
వివరాలు:
ఐఐపీహెటీ జౌళి మంత్రిత్వ శాఖ
ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
-పోస్టు పేరు: పోస్టు డిప్లొమా (టెక్స్‌టైల్స్ ప్రాసెసింగ్ )
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి మూడేండ్ల హ్యాండ్లూమ్ టెక్నాలజీలో డిప్లొమా / హ్యాండ్లూమ్ అండ్ టెక్స్‌టైల్ టెక్నాలజీలో డిప్లొమా, టెక్స్‌టైల్ టెక్నాలజీ, టెక్స్‌టైల్ కెమిస్ట్రీ, టెక్స్‌టైల్ ప్రాసెసింగ్‌లో డిప్లొమా ఉత్తీర్ణత. లేదా ఏదైనా సైన్స్‌లో గ్రాడ్యుయేట్ లేదా ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీలో సబ్జెక్ట్‌లతో బీఎస్సీ హోమ్ సైన్స్‌లో ఉత్తీర్ణత.
-కోర్సు ఆఫర్ చేస్తున్న సెంటర్లు: ఈ కోర్సు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ క్యాంపస్‌లు వారణాసి, సేలంలో చదవాల్సి ఉంటుంది. కోర్సు చదువుతున్న సమయంలో నెలకు రూ. 1,500/- స్టయిఫండ్ కూడా ఇస్తారు.
-కోర్సు వ్యవధి : 18 నెలలు (మూడు సెమిస్టర్లు)
-ఎంపిక: ప్రవేశ పరీక్ష
-దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా.
-చిరునామా: డైరెక్టర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఫేక్స్ కాంపౌండ్, తిల్లయ్‌నగర్, సేలం-636001 తమిళనాడు
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 20
-వెబ్‌సైట్: www. handlooms.nic.in



0 comments:

Post a Comment