Wednesday, 3 May 2017

Indin navy Recruitment Group c Posts నేవీలో గ్రూప్-సీ ఖాళీలు

-పదోతరగతి విద్యార్థులకు అవకాశం
-రాతపరీక్ష, సర్టిఫికెట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, భద్రమైన కొలువులు

indiannavy
ఇండియన్ నేవీ గ్రూప్ సీ కేటగిరీ కింద ట్రేడ్స్‌మ్యాన్ మేట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
సివిలియన్ పర్సనల్ రిక్రూట్‌మెంట్ కోటాలో ఈ పోస్టులను భర్తీ చేస్తున్నారు. ప్రస్తుత నోటిఫికేషన్‌లో ఎంపికైన అభ్యర్థులు ముంబైలోని వెస్ట్రన్ నేవల్ కమాండ్ పరిధిలో పనిచేయాల్సి ఉంటుంది.
పోస్టు: ట్రేడ్స్‌మ్యాన్ మేట్ (టీఎంఎం)
-మొత్తం ఖాళీల సంఖ్య - 384. వీటిలో జనరల్ - 194, ఎస్సీ - 57, ఎస్టీ - 29, ఓబీసీ - 104 ఖాళీలు ఉన్నాయి. అదేవిధంగా ఎక్స్‌సర్వీస్‌మెన్ కోటాలో 68, పీహెచ్‌సీ - 12 పోస్టులు కేటాయించారు.
-ఈ పోస్టులు గ్రూప్ సీ నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ పోస్టులు.
జీతం: రూ. 18,000 - 56,900/-
అర్హతలు: గుర్తింపు పొందిన సంస్థ నుంచి పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
వయస్సు: 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి.
-ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం: దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను 1:50 నిష్పత్తిలో షార్ట్‌లిస్ట్ చేసి రాతపరీక్షకు ఎంపిక చేస్తారు.
రాతపరీక్ష:
-ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ - 25 మార్కులు, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ - 25, జనరల్ ఇంగ్లిష్ - 25, జనరల్ అవేర్‌నెస్ - 25 మార్కులకు ఇస్తారు.
-మొత్తం 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
-ప్రశ్నలు పదోతరగతిస్థాయిలో ఇస్తారు.
-రాతపరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది. రాతపరీక్ష మార్కులు వచ్చిన తర్వాత సర్టిఫికెట్స్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 21 రోజుల్లో దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్‌సైట్: www.bhartiseva.com

0 comments:

Post a Comment