Tuesday, 23 May 2017

Hyderabad NRSC Recruitment Notification,PhD admissions at TS Agriculture University,HPCL Recruitment Technicians Posts. హైదరాబాద్ ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగాలు, టీఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు, హెచ్‌పీసీఎల్‌లో టెక్నీషియన్లు ఉద్యోగాలు.,

హైదరాబాద్ ఎన్‌ఆర్‌ఎస్‌సీలో ఉద్యోగాలు,

పదోతరగతి, ఐటీఐ, డిగ్రీ అభ్యర్థులకు అవకాశం
-కేంద్ర కొలువులు
-రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ ద్వారా ఎంపిక
-చివరితేదీ: జూన్ 10


హైదరాబాద్ బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ)లో టెక్నీషియన్, సైంటిఫిక్ అసిస్టెంట్ తదితర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
ఎన్‌ఆర్‌ఎస్‌సీ ఇస్రో పరిధిలో పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ఐదు రీజినల్ సెంటర్స్‌ను కలిగి ఉంది. బెంగళూరు, నాగ్‌పూర్, కోల్‌కతా, జోధ్‌పూర్, న్యూఢిల్లీలో ఈ సెంటర్లు ఉన్నాయి.
పోస్టులు - ఖాళీలు - అర్హతలు:
టెక్నీషియన్ - బీ (ఎలక్ట్రానిక్ మెకానిక్) - 22 (జనరల్ - 10, ఓబీసీ - 7, ఎస్సీ - 4, ఎస్టీ -1)
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత. ఐటీఐ/ఎన్‌టీసీ లేదా ఎన్‌ఏసీలో ఎలక్ట్రానిక్ మెకానిక్ ట్రేడ్ ఉత్తీర్ణత.
టెక్నీషియన్ బీ (ఎలక్ట్రీషియన్) - 14 (జనరల్ - 7, ఓబీసీ - 4, ఎస్సీ - 2, ఎస్టీ - 1)
అర్హతలు: పదోతరగతితోపాటు ఐటీఐలో ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
టెక్నీషియన్ బీ (ఫిట్టర్) - 2 (జనరల్ - 1, ఓబీసీ -1)
అర్హతలు: పదోతరగతి, ఐటీఐలో ఫిట్టర్ ట్రేడ్ చేసినవారు.
టెక్నీషియన్ బీ (ల్యాబొరేటరీ అసిస్టెంట్ కెమికల్) - 1 (జనరల్)
అర్హత: పదోతరగతి, ఐటీఐలో ల్యాబొరేటరీ అసిస్టెంట్ - కెమికల్ ట్రేడ్ చదివి ఉండాలి.
టెక్నీషియన్ బీ (ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్) - 4 (జనరల్ - 1, ఓబీసీ - 1, ఎస్సీ-1, ఎస్టీ - 1).
అర్హత: పదోతరగతి, ఐటీఐలో ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్ ట్రేడ్ ఉత్తీర్ణత.
టెక్నీషియన్ బీ (మెకానిస్ట్) - 6 (జనరల్ - 2, ఓబీసీ - 1, ఎస్సీ-2, ఎస్టీ - 1)
అర్హత: పదోతరగతి, ఐటీఐలో మెకానిస్ట్ ట్రేడ్ ఉత్తీర్ణత.
టెక్నీషియన్ బీ (మోటార్ మెకానిక్) - 2 (జనరల్ -1, ఓబీసీ -1)
అర్హత: పదోతరగతి, ఐటీఐలో మోటార్ మెకానిక్ ట్రేడ్ ఉత్తీర్ణత.
టెక్నీషియన్ బీ (ప్లంబర్) - 1 (జనరల్)
అర్హత: పదోతరగతితోపాటు ఐటీఐలో ప్లంబర్ ట్రేడ్ ఉత్తీర్ణత. 
టెక్నీషియన్ బీ (రిఫ్రిజిరేషన్ & ఎయిర్‌కండీషనింగ్) - 4 (జనరల్ - 2, ఓబీసీ - 1, ఎస్సీ-1)
అర్హత: పదోతరగతి, ఐటీఐలో రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ ట్రేడ్ ఉత్తీర్ణత.
డ్రాఫ్ట్స్‌మెన్ బీ (సివిల్) - 6 (జనరల్ - 5, ఓబీసీ - 1)
అర్హత: పదోతరగతి, ఐటీఐలో డ్రాఫ్ట్స్‌మ్యాన్ సివిల్ ట్రేడ్ ఉత్తీర్ణత.
టెక్నికల్ అసిస్టెంట్ - 1 (ఎస్సీ)
అర్హతలు: డిప్లొమా ఇన్ ఈఈఈలో ప్రథమశ్రేణి ఉత్తీర్ణత.
సైంటిఫిక్ అసిస్టెంట్ - 2 (జనరల్ - 1, ఎస్టీ - 1)
అర్హత: బీఎస్సీ కెమిస్ట్రీలో ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత.
సైంటిఫిక్ అసిస్టెంట్ - 5 (జనరల్ - 2, ఓబీసీ - 2, ఎస్సీ -1)
అర్హత: బీఎస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్ సైన్స్) ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
సైంటిఫిక్ అసిస్టెంట్ - 3 (జనరల్ - 2, ఓబీసీ - 1)
అర్హత: బీఎస్సీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్) ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణత.
పనిచేయాల్సిన ప్రదేశాలు: ఎన్‌ఆర్‌ఎస్‌సీ - ఎర్త్‌స్టేషన్, షాద్‌నగర్ క్యాంపస్, బాలానగర్.
బేసిక్ పే అండ్ పే లెవల్:
టెక్నికల్ అసిస్టెంట్: రూ. 44,990/- లెవల్ -7
టెక్నీషియన్ బీ, డ్రాఫ్ట్స్‌మ్యాన్ బీ: రూ. 21, 700/- లెవల్ - 3
వయస్సు: 2017, జూన్ 10 నాటికి 18 - 35 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 6

వెబ్‌సైట్: www.nrsc.gov.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

టీఎస్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో పీహెచ్‌డీ ప్రవేశాలు,

రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 2017-18 విద్యా సంవత్సారానికి వివిధ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

pjtsau
వివరాలు:
ఈ యూనివర్సిటీ 2014లో ఏర్పాటైంది.
(గతంలో ఆచార్య ఎన్ జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో భాగంగా ఉండేది) తెలంగాణ రాష్ట్రంలోని వ్యవసాయ పరిశోధన, అనుబంధ విద్య, విస్తరణను పర్యవేక్షిస్తుంది.
కోర్స్ పేరు: ఫ్యాకల్టీ ఆఫ్ అగ్రికల్చర్
మొత్తం సీట్ల సంఖ్య: 17
విభాగాలు: ఆగ్రానమీ, అగ్రికల్చర్ ఎకనామిక్స్, ఎంటమాలజీ, అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ పాథాలజీ, క్రాప్ ఫిజియాలజీ, సాయిల్ సైన్స్, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మాలిక్యులార్ బయాలజీ, బయోటెక్నాలజీ
కోర్స్ పేరు: ఫ్యాకల్టీ ఆఫ్ హోం సైన్స్
మొత్తం సీట్ల సంఖ్య: 4
విభాగాలు: ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్, హోం సైన్స్ ఎక్స్‌టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్
కోర్స్ పేరు: ఫ్యాకల్టీ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ
మొత్తం సీట్ల సంఖ్య: 2
విభాగాలు : సాయిల్ అండ్ వాటర్ ఇంజినీరింగ్, ఫామ్ మెషినరీ అండ్ పవర్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ ఆఫ్ సైన్స్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత లేదా అగ్రికల్చర్/హోం సైన్స్‌లో 50 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీ స్థాయిలో బీఎస్సీ (అగ్రికల్చర్), బీఎస్సీ (హోం సైన్స్), బీటెక్ (అగ్రికల్చర్ అండ్ టెక్నాలజీ), బీహెచ్‌ఎస్సీ (రూరల్)లో నాలుగేండ్ల బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత.
వయస్సు: 2017 జూలై 1 నాటికి 40 ఏండ్లకు మించరాదు.
అప్లికేషన్ ఫీజు: జనరల్, బీసీ అభ్యర్థులు రూ. 1,325/- ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 725/-చెల్లించాలి.
ఎంపిక: అకడమిక్ సబ్జెక్ట్‌ల్లో వచ్చిన మార్కులు+ ప్రవేశ పరీక్ష/ఎంట్రెన్స్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ
ఎంట్రెన్స్ టెస్ట్ 50 శాతం, ఎమ్మెస్సీ లెవల్‌కు 30 శాతం, బీఎస్సీ లెవల్‌కు 10 శాతం, ఇంటర్వ్యూకు 10 శాతం వెయిటేజీ అధారంగా తుది ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ హార్డ్‌కాపీని ప్రింట్ తీసి, సంబంధిత పర్సనల్ అధికారికి స్పీడ్‌పోస్ట్‌లో మాత్రమే పంపాలి.
చిరునామా: The Registrar, Administrative Office, Professor Jayashankar Telangana State Agricultural University, Rajendranagar,
Hyderabad - 500 030
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
హార్డ్‌కాపీని పంపడానికి చివరితేదీ: జూన్ 22 (సాయంత్రం 4 గంటల వరకు)
వెబ్‌సైట్ : http://www.pjtsau.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఎస్సీ ఫారెస్ట్రీలో

తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఫారెస్ట్ కాలేజ్, పరిశోధన ఇన్‌స్టిట్యూట్ (ఎఫ్‌సీఆర్‌ఐ) 2017-18 విద్యా సంవత్సారానికి నాలుగేండ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ డిగ్రీ కోర్సులో ప్రవేశానికి (రెసిడెన్షియల్ ప్రోగ్రామ్) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఈ కళాశాల దూలపల్లిలో ఏర్పాటుచేశారు. సిద్దిపేట జిల్లా ములుగులో శాశ్వత భవనాలు నిర్మాణాలు పూర్తయ్యే వరకు తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లిలో ఈ కోర్సును నిర్వహిస్తారు.
కోరు: పేరు: నాలుగేండ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ
మొత్తం సీట్ల సంఖ్య:50
అర్హత: రాష్ట్ర ఇంటర్ బోర్డ్‌చే గుర్తించబడిన ఇంటర్ (బైపీసీ) లేదా తత్సమాన పరీక్షలో 45 శాతం మార్కులతో (ఎస్సీ, ఎస్టీలకు 40 శాతం) ఉత్తీర్ణత. బయాలజీ, భౌతికశాస్త్రం, రసాయన శాస్త్రంలో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
వయస్సు: 17 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 25 ఏండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 27 ఏండ్ల వరకు సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో రూ. 500/- (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 250/-చెల్లించాలి)
ఎంపిక: ఇంటర్ బైపీసీ అకడమిక్ మార్కుల ఆధారంగా.
నాలుగేండ్ల బీఎస్సీ ఫారెస్ట్రీ ఎంపికలో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉంటాయి.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలోనే సర్టిఫికెట్లు, ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
చిరునామా: ఆఫీసర్ ఇన్ చార్జ్ అడ్మిషన్స్, ఫారెస్ట్ కాలేజ్, పరిశోధన ఇన్‌స్టిట్యూట్ తెలంగాణ స్టేట్ ఫారెస్ట్ అకాడమీ, దూలపల్లి, హైదరాబాద్-500014మొబైల్ నంబర్: 8332975516, 8333924137
ఈ మెయిల్: tsfcri2016@gmail.com.
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15 (సాయంత్రం 5 గంటల వరకు)
అపరాధ రుసుం రూ. 1000/-లతో చివరితేదీ: జూన్ 30 (సాయంత్రం 5 గంటల వరకు)
వెబ్‌సైట్:www.fcrits.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్

కొచ్చిన్ షిప్‌యార్డ్ లిమిటెడ్‌లో కింది కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
కొచ్చిన్ షిప్‌యార్డ్ భారత ప్రభుత్వ రంగ సంస్థ.
కోర్సు: మెరైన్ ఇంజినీరింగ్ ట్రెయినింగ్
కాలవ్యవధి: ఏడాది
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌లో మెకానికల్/మెకానికల్ ఆటోమొబైల్ లేదా నేవల్ ఆర్కిటెక్చర్ ఉత్తీర్ణత. పదోతరగతి, ఇంటర్ ఇంగ్లిష్‌లో కనీసం 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లు మించరాదు
దరఖాస్తు: వెబ్‌సైట్‌లో
చివరితేదీ: జూలై 1
వెబ్‌సైట్: www.cochinshipyard.com





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌పీసీఎల్‌లో టెక్నీషియన్లు ఉద్యోగాలు.,


వైజాగ్‌లోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) బాయిలర్, ఆపరేషన్స్ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైనఅభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
హెచ్‌పీసీఎల్ నవరత్న కంపెనీ. దీనిని 1974లో ఏర్పాటు చేశారు. ఫార్చ్యూన్ 500 గ్లోబల్ కంపెనీల్లో హెచ్‌పీసీఎల్ ఒకటి.
పోస్టు పేరు: టెక్నీషియన్ (బాయిలర్/ఆపరేషన్స్)
మొత్తం పోస్టుల సంఖ్య: 60 (జనరల్-23, ఓబీసీ-18, ఎస్సీ-7, ఎస్టీ-12)
అర్హత: ఆపరేషన్ విభాగంలోని పోస్టులకు డిప్లొమా ఇన్ కెమికల్ ఇంజినీరింగ్, బాయిలర్ విభాగంలోని పోస్టులకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్‌లో ఉత్తీర్ణత. దీంతోపాటు ఫస్ట్‌క్లాస్ బాయిలర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్ ఉండాలి. సంబంధిత కోర్సుల్లో జనరల్/ఓబీసీ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, మిగతా అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2017 మే 1 నాటికి 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
పే స్కేల్ : రూ. 40,000/- ఎంపికైన అభ్యర్థులు 9 నెలలు ప్రొబేషనరీ పీరియడ్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ఇది పూర్తయిన తర్వాత రెగ్యులర్ ఉద్యోగిగా పరిగణిస్తారు. ఏడాదికి రూ. 5-6 లక్షల వేతనం ఉంటుంది. అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా హెచ్‌పీసీఎల్ యూనిట్లలో పనిచేయాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ.600/- (జనరల్/ఓబీసీ అభ్యర్థులు), ఎస్సీ, ఎస్టీ , పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
దరఖాస్తులుచివరి తేదీ: జూన్ 8
వెబ్‌సైట్: www.hindustanpetroleum.com


0 comments:

Post a Comment