Tuesday, 23 May 2017

Guest Faculty jobs at Hyderabad Central University,Management Trainees at CanFin Homes. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు. కెన్‌ఫిన్ హోమ్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు.

గెస్ట్ ఫ్యాకల్టీలు

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ వివిధ సబ్జెక్టుల్లో ఖాళీగా ఉన్న గెస్ట్ ఫ్యాకల్టీ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి 
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని పోస్టు గ్రాడ్యుయేట్‌లోని టీచింగ్ అండ్ రిసెర్చ్ రంగంలో మెళకువలను అందించడానికి ప్రాథమిక విద్యా సంస్థగా 1974 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు.
మొత్తం ఖాళీల సంఖ్య: 8 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-2, ఎస్సీ-1, ఎస్టీ-1)
విభాగాలు: అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్, కొరియన్, రష్యన్, స్పానిష్
విద్యార్హతలు: 
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ (ఎంఏ- ఫారెన్ లాంగ్వేజ్)లో ఉత్తీర్ణత. యూజీసీ నెట్ ఉత్తీర్ణత ఉండాలి.
పే స్కేల్: రూ. 25,000/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ లేదా ఈ-మెయిల్ (csflhod@gmail.com) ద్వారా. 
దరఖాస్తుకు చివరితేదీ: జూన్ 2
వెబ్‌సైట్:www.uohyd.ac.in
university-of-hyderabad

కన్సల్టెంట్ పోస్టులు
హైదరాబాద్ యూనివర్సిటీలో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
హైదరాబాద్ యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ. కేంద్ర మానవ వనరుల శాఖ పరిధిలోనిది.
కన్సల్టెంట్ ఇన్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ - 5
అర్హతలు: బీకాంలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. లేదా సెకండ్ క్లాస్‌లో ఎంకాం లేదా ఎంబీఏ ఫైనాన్స్ ఉత్తీర్ణతతోపాటు డిగ్రీస్థాయిలో బీకాం చదివి ఉండాలి. అనుభవం ఉండాలి.
కన్సల్టెంట్ ఇన్ ఇంటర్నల్ ఆడిట్ - 1
అర్హత: ఏదైనా డిగ్రీలో ఎస్‌ఏఎస్ గ్రేడ్‌లో ఉత్తీర్ణత
కన్సల్టెంట్ ఇన్ ఇంజినీరింగ్ అకౌంట్ - 1
అర్హత: ఇండియన్ ఆడిట్ ఆఫీసర్స్‌గా పనిచేసినవారు.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: నిర్ణీత నమనాలో
చివరితేదీ: జూన్ 10

వెబ్‌సైట్: http://www.uohyd.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
కెన్‌ఫిన్ హోమ్స్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీలు.


బెంగళూరులోని కెన్‌ఫిన్ హోమ్స్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ, మేనేజర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
స్పెషలిస్ట్ ఆఫీసర్-5 పోస్టులు
చీఫ్ మేనేజర్ (క్రెడిట్)-2 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సీఏ, ఐసీడబ్ల్యూఏ, ఎంబీఏ (ఫైనాన్స్) ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
చీఫ్ మేనేజర్ (ఆర్‌ఎం)-1 పోస్టు
అర్హత: మాస్టర్ డిగ్రీ (మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, ఎంబీఏ (ఫైనాన్స్)లో ఉత్తీర్ణత.్ట
మేనేజర్ (టీపీఓ)-2 పోస్టులు
అర్హత: బీఈ/బీటెక్ (సివిల్), బీఆర్క్‌లో బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత
పోస్టు పేరు: జూనియర్ మేనేజ్‌మెంట్ ట్రెయినీ-30
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఎంబీఏ (ఫైనాన్స్ ) ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.
వయస్సు: 2017 ఏప్రిల్ 1 నాటికి 28 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్ : రూ.17,850-34,700/- (నెలకు సుమారుగా రూ. 32,287/-)
ప్రోబేషనరీ పీరియడ్: ఏడాది
అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 6
వెబ్‌సైట్: www.canfinhomes.com.



0 comments:

Post a Comment