Friday, 19 May 2017

ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ -సీ పోస్టులు, హైదరాబాద్ ఐఐసీటీలో ఖాళీలు, ఆర్డినెన్స్ డిపోలో ఉద్యోగాలు, ఆర్మీలో టెరిటోరియల్ ఆఫీసర్ ఉద్యోగాలు, ఏఎంపీఆర్‌ఐలో సైంటిస్ట్‌లు. Air Force Recruitment Group C posts,Hyderabad IICT Recruitment,Ordinance Depot Jobs,Territorial Officer jobs in the Army,Scientists Jobs In AMPRI.

ఎయిర్‌ఫోర్స్‌లో గ్రూప్ -సీ పోస్టులు,

పదోతరగతి, ఇంటర్, ఐటీఐ విద్యార్థులకు అవకాశం
- కేంద్రకొలువులు, భరోసా జీవితం
-ప్రత్యేక అలవెన్స్‌లు, రాతపరీక్ష ద్వారా ఎంపిక
-దేశంలోని ఏ ప్రాంతం వారైనా దరఖాస్తు చేసుకోవచ్చు


INDIAN-AIRFORCE
భారత వాయుసేనలో గ్రూప్ సీ సివిలియన్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
త్రివిధ దళాలలో వాయుసేన కీలకమైంది. దీనిలో సివిలియన్ కోటాలోని ఖాళీల భర్తీకి ప్రస్తుత నోటిఫికేషన్ విడుదల చేశారు.
-మొత్తం ఖాళీల సంఖ్య - 174 విభాగాల వారీగా ఖాళీలు..
-సూపరింటెండెంట్ (స్టోర్) - 44, స్టోర్ కీపర్ - 28, ఫైర్‌మ్యాన్ - 10, టైలర్ - 1, కుక్ - 4, వాల్కనైజర్ - 1, దోబి - 1, మెస్‌స్టాఫ్ - 2, ఎంటీఎస్ - 71, సఫాయివాలా - 11, స్టెనో - 1 ఖాళీ ఉన్నాయి.
విద్యార్హతలు, పేస్కేల్:
సూపరింటెండెంట్ (స్టోర్) - డిగ్రీ ఉత్తీర్ణత. స్టోర్స్ నిర్వహణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
స్టోర్ కీపర్ - ఇంటర్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత. స్టోర్స్ నిర్వహణ, స్టోర్ అకౌంట్స్‌లో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
గ్రేడ్ - 2 స్టెనో -ఇంటర్, స్టెనోగ్రఫీలో నిమిషానికి 80 పదాలు డిక్టేషన్, నిమిషానికి 65 పదాలు టైప్‌రైటర్‌పై, 50 పదాలు కంప్యూటర్‌పై ట్రాన్స్‌క్రిప్షన్ చేయాలి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
టైలర్ - టైలరింగ్‌లో ఐటీఐ సర్టిఫికెట్. ఎక్స్‌సర్వీస్‌మెన్ అయితే సంబంధిత ట్రేడ్‌లో పనిచేసిన వారు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
కుక్ - పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్‌లో కనీసం ఆరునెలల అనుభవం ఉండాలి.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
దోబి - పదోతరగతితోపాటు గుర్తింపు పొందిన సంస్థ లేదా ఆర్గనైజేషన్‌లో కనీసం ఏడాదిపాటు దోబిగా పనిచేసిన అనుభవం ఉండాలి.

పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
వాల్కనైజర్ - పదోతరగతి ఉత్తీర్ణత.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
మెస్‌స్టాఫ్ - పదోతరగతి లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
మల్టీటాస్కింగ్ స్టాఫ్ - పదోతరగతి ఉత్తీర్ణత. వాచ్‌మెన్ లేదా లస్కర్/మాలిగా పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.
పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
వయస్సు: గ్రేడ్ - 2 స్టెనో, ఫైర్‌మెన్ పోస్టులకు 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. ఇతర పోస్టులకు 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. రిజర్వ్‌డ్ కేటగిరీలకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా
రాతపరీక్ష: దీనిలో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్, జనరల్ ఇంగ్లిష్, జనరల్ అవేర్‌నెస్‌పై ప్రశ్నలు ఇస్తారు.
ప్రశ్నపత్రం ఇంగ్లిష్/హిందీలో ఉంటుంది.
రాతపరీక్షలో అర్హత సాధించిన వారికి స్కిల్/ ప్రాక్టికల్ లేదా ఫిజికల్ టెస్ట్‌లను నిర్వహిస్తారు.
నోట్: పై పోస్టులకు మహిళా అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో (నోటిఫికేషన్‌లో పేర్కొన్న ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో ఎక్కడైనా దరఖాస్తు చేసుకోవచ్చు)
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి. ప్రకటన మే 13 -19 ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రచురితమైంది.
రాష్ట్ర అభ్యర్థులు పూర్తిచేసిన దరఖాస్తులను కింది చిరునామాకు పంపాలి.
CO, Equipment Depot C/O 408, Air Force Station,Hakimpet, Secunderabad TS -500014
వెబ్‌సైట్: http://indianairforce.nic.in



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హైదరాబాద్ ఐఐసీటీలో ఖాళీలు,
హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
IICT
వివరాలు:
ఐఐసీటీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న అనుబంధ సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 24
పోస్టు పేరు: సైంటిస్ట్ -19 పోస్టులు (జనరల్-9, ఓబీసీ-7, ఎస్టీ-2, పీహెచ్‌సీ-1)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆర్గానిక్ కెమిస్ట్రీ, మెడిసినల్ కెమిస్ట్రీ, నేచురల్ ప్రొడక్ట్స్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ/ ఫిజిక్స్ (మెటీరియల్ సైన్స్), కెమిస్ట్రీ కెటలైసిస్, ఫార్మకాలజీ, ఫార్మాస్యూటికల్ సైన్సెస్, జువాలజీ, ఎంటమాలజీ, అనలిటికల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ లేదా తత్సమాన సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ, వెటరర్నీ సైన్స్‌లో ఎంవీఎస్‌సీ, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.

పే స్కేల్: రూ. 15,600-39100+ గ్రేడ్ పే రూ. 6600/- (సుమారుగా నెలకు రూ. 87, 107/- పే స్కేల్ ఉంటుంది.)
వయస్సు: 2017 జూన్ 30 నాటికి 32 ఏండ్లకు మించరాదు.
పోస్టు పేరు: ప్రిన్సిపాల్ సైంటిస్ట్ -5 పోస్టులు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీ, కెమికల్ ఇంజినీరింగ్, బయోఆర్గానిక్ కెమిస్ట్రీ లేదా తత్సమాన సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ, ఎంబీబీఎస్+పీహెచ్‌డీ లేదా ఎంబీబీఎస్+ఎండీలో ఉత్తీర్ణత. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
పే స్కేల్: రూ. రూ. 37,400-67,000+ గ్రేడ్ పే రూ. 8700/- (సుమారుగా నెలకు రూ. 1,47,424/- పే స్కేల్ ఉంటుంది.)
వయస్సు: 2017 జూన్ 30 నాటికి 45 ఏండ్లకు మించరాదు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
ఎంపిక: పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: Section Officer, Recruitment Section, CSIR-Indian Institute of Chemical Technology, Uppal Raod, Tarnaka, Hyderabad 500 007
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 15
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలకు చివరితేదీ: జూన్ 30
వెబ్‌సైట్ : http://www.iictindia.org



---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్డినెన్స్ డిపోలో ఉద్యోగాలు,

ముంబైలోని సెంట్రల్ ఆర్డినెన్స్ డిపొలో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

వివరాలు:
ఈ సంస్థ రక్షణశాఖ పరిధిలో పనిచేస్తుంది.
-ఎల్‌డీసీ - 5 (జనరల్ - 3, ఓబీసీ - 2. దీనిలో ఒకటి పీహెచ్‌సీ హెచ్‌హెచ్‌కి కేటాయించారు)
-సఫాయివాలా - 1 (జనరల్)
-మెసెంజర్ - 1 (ఓబీసీ)
-ట్రేడ్స్‌మ్యాన్ మేట్ - 2 (జనరల్ -1, ఓబీసీ - 1)
-పెయింటర్ - 1
పేస్కేల్: 
ఎల్‌డీసీ, పెయింటర్ పోస్టులకు రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-మిగిలిన పోస్టులకు - రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
దరఖాస్తు: 
నిర్ణీత నమూనాలో
చివరితేదీ: 
ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 21 రోజుల్లోగా
వెబ్‌సైట్: 

www.ncsgov.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఆర్మీలో టెరిటోరియల్ ఆఫీసర్ ఉద్యోగాలు,

ఇండియన్ ఆర్మీ (ఐఏ) టెరిటోరియల్ ఆఫీసర్ ఉద్యోగం చేయడానికి దేశంలోని వివిధ ప్రాంతాల్లో నివసిస్తున్న పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
Indian-Army
వివరాలు: 
పోస్ట్ పేరు: ఆర్మీ టెరిటోరియల్ ఆఫీసర్
పనిచేసే ప్రదేశం: దేశవ్యాప్తంగా ఏ ప్రదేశంలోనైనా
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. అభ్యర్థి శారీరంగా, వైద్యపరంగా ఫిట్‌గా ఉండాలి
వయస్సు: 18 నుంచి 42 ఏండ్ల మధ్య ఉండాలి
పే అండ్ అలవెన్స్‌లు: లెఫ్టినెంట్ హోదాలో పే బ్యాండ్ రూ. 15,600-39,100+గ్రేడ్ పే రూ. 5,400 తోపాటు మిలిటరీ సర్వీస్ పే రూ. 6,000/- ఉంటుంది. 
అప్లికేషన్ ఫీజు: రూ. 200/-
ఎంపిక: ఆబ్జెక్టివ్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-రాత పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ విధానంలో పేపర్ -1, పేపర్ - 2 లుగా ఉంటుంది.
-ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. 
-పేపర్ 1లో ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్, రీజనింగ్‌కు కేటాయించిన సమయం 2 గంటలు. 

-ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌లో అర్థమెటిక్, యూనిటరీ మెథడ్, ఎలిమెంటరీ నంబర్ థియరీ, ఆల్‌జీబ్రా, త్రికోణమితి, జామెట్రీ, మెన్స్‌రేషన్, స్టాటిస్టిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.
-పేపర్ 2లో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లిష్‌కు కేటాయించిన సమయం 2 గంటలు
-ప్రతి పేపర్‌లో 100 ప్రశ్నలు వస్తాయి. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది
-ప్రతి అభ్యర్థి పేపర్ 1 అండ్ పేపర్ 2లో కనీసం 40 శాతం అర్హత మార్కులను సాధించాలి. సగటున 50 శాతం మార్కులను సాధించాలి
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. 
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30 
రాత పరీక్ష: జూలై 30

వెబ్‌సైట్: www.indanarmy.nic.in


---------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఎంపీఆర్‌ఐలో సైంటిస్ట్‌లు.




భోపాల్‌లోని అడ్వాన్స్‌డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఏఎంపీఆర్‌ఐ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సైంటిస్ట్/సీనియర్ సైంటిస్ట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
AMPRI
వివరాలు:
ఏఎంపీఆర్‌ఐ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్‌ఐఆర్) పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
పోస్టు పేరు: గ్రేడ్4 సైంటిస్ట్-5 పోస్టులు
వయస్సు: 32 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: 85,134/-
పోస్టు పేరు: సీనియర్ సైంటిస్ట్-2 పోస్టులు
వయస్సు: 37 ఏండ్లకు మించరాదు.
పే స్కేల్: 98,454/-
పోస్టు పేరు: ప్రిన్సిపాల్ సైంటిస్ట్-2 పోస్టులు
వయస్సు: 32 ఏండ్లకు మించరాదు.

పే స్కేల్: 1,46,094/-
అప్లికేషన్ ఫీజు: రూ. 100/-
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తు హార్డ్‌కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని, సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: The Director,CSIR - Advanced Materials and Processes Research Institute, Near Habibganj Naka,Hoshangabad Road, Bhopal - 462026.
చివరితేదీ: జూన్ 12
ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: జూన్ 27
వెబ్‌సైట్: www.ampri.res.in

0 comments:

Post a Comment