Wednesday, 3 May 2017

Air Force Recruitment 110 Posts,Non-executives Jobs at IOCL,Scientist jobs in DRDO,Admissions in the Indo-Swiss Training Center. ఎయిర్‌ఫోర్స్‌లో 110 పోస్టులు, ఐవోసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు, డీఆర్‌డీవోలో సైంటిస్ట్ జాబ్స్, ఇండో - స్విస్ ట్రెయినింగ్ సెంటర్‌లో ప్రవేశాలు

ఎయిర్‌ఫోర్స్‌లో 110 పోస్టులు,

-పదోతరగతి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ విద్యార్థులకు అవకాశం
-రాతపరీక్ష ద్వారా ఎంపిక

Air-Force
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ గ్రూప్- సీ సివిలియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: దేశవ్యాప్తంగా ఉన్న పలు యూనిట్లలో ఈ ఖాళీలు ఉన్నాయి.
మొత్తం ఖాళీల సంఖ్య - 110
-యూనిట్ల వారీగా ఖాళీల వివరాలు:
-సీవో, న్యూఢిల్లీ - 11 పోస్టులు(ఎల్‌డీసీ - 6, కుక్ -1, ఎంటీఎస్ - 1, మెస్‌స్టాఫ్ - 2, సఫాయివాలా -1)
-ఏవోసీ, ఏఎఫ్ శ్రీనగర్ - 4 (సూపరింటెండెంట్ (స్టోర్) - 1, స్టోర్ కీపర్ - 2, కుక్ - 1)
-ఏవోసీ, ఏఎఫ్ స్టేషన్, న్యూఢిల్లీ - 7 (ఎల్‌డీసీ - 1, ఎంటీఎస్- 5, మెస్‌స్టాఫ్ -1)
-సీవో, 73 ఆర్‌ఎంయూ, పాలం, న్యూఢిల్లీ - 1
-సీవో, 350, ఏ డీఎస్సీ ప్లాటూన్, అంబాలా - 1 (ఎల్‌డీసీ)
-ఏవోసీ, ఏఎఫ్ అంబాలా - 7 (కార్పెంటర్ - 1, ఎంటీఎస్ -3, మెస్‌స్టాఫ్ - 1, సఫాయివాలా -2)
-సీవో, 14 ఎస్‌క్యూఎన్, అంబాలా - 2 (సఫాయివాలా)
-ఏవోసీ, ఏఎఫ్ స్టేషన్, అదంపూర్, పంజాబ్ - 10 (స్టోర్‌కీపర్ - 1, ఎల్‌డీసీ - 1, ఎంటీఎస్ - 5, మెస్‌స్టాఫ్ - 2, సఫాయివాలా - 1)
-సీవో, 735 ఎస్‌యూ, ఏఎఫ్ అదంపూర్ - 1 (ఎంటీఎస్)
-సీవో, 21 ఎంఎంపీయూ, అదంపూర్ - 1(సఫాయివాలా)
-ఏవోసీ, ఏఎఫ్ హల్వారా - 6 (ఎల్‌డీసీ - 1, కార్పెంటర్ - 1, ఎంటీఎస్ - 4)
-సీవో, ఏఎఫ్ స్టేషన్, చండీగఢ్ - 4 (స్టోర్‌కీపర్ -1, కార్పెంటర్ - 1, ఎంటీఎస్ - 1, మెస్‌స్టాఫ్ - 1)
-సీవో, ఎఫ్‌బీఎస్‌యూ, అమృత్‌సర్ - 1 (మెస్‌స్టాఫ్)
-ఏవోసీ, పఠాన్‌కోట్ - 4 (సీఎంటీడీ -1, పెయింటర్ -1, ఎంటీఎస్ - 1, సఫాయివాలా - 1)
-ఇంకా పలు ఏవోసీ, సీవో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లలో ఖాళీలు ఉన్నాయి.

వయస్సు: 18 - 25 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: సూపరింటెండెంట్ పోస్టుకు డిగ్రీ, స్టోర్ కీపర్ పోస్టుకు ఇంటర్. ఎల్‌డీసీ పోస్టుకు ఇంటర్‌తోపాటు నిమిషానికి 35 పదాలు ఇంగ్లిష్‌లో టైపింగ్ చేసే సామర్థ్యం ఉండాలి. సీఎంటీడీ పోస్టుకు వ్యాలిడ్ ఎల్‌ఎంవీ, పదోతరగతి ఉత్తీర్ణత. కుక్ పోస్టుకు పదోతరగతితోపాటు వంటలో ఆరునెలల అనుభవం ఉండాలి. కార్పెంటర్ పోస్టుకు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ.

పేస్కేల్:
-సూపరింటెండెంట్ (స్టోర్) - రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
-స్టోర్ కీపర్ - రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-ఎల్‌డీసీ - రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-సివిలియన్ డ్రైవర్ (సీఎంటీడీ) - రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-కుక్ - రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-కార్పెంటర్, పెయింటర్ పోస్టులకు - రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-వల్కనైజర్, ఎంటీఎస్, మెస్‌స్టాఫ్, ధోబి, సఫాయివాలా పోస్టులకు - రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,800/-
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి. ప్రకటన ఏప్రిల్ 29 - మే 5 ఇష్యూలో వచ్చింది.
వెబ్‌సైట్: http://indianairforce.nic.in





----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఐవోసీఎల్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్‌లు,

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐవోసీఎల్) దేశవ్యాప్తంగా వివిధ రీజియన్లలోని పైప్‌లైన్స్ విభాగంలో ఖాళీగా ఉన్న నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
iocl-PIPELINES
వివరాలు:
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది భారతదేశంలోని ఫార్చ్యూన్ గ్లోబల్ 500 కంపెనీల్లో అతిపెద్ద వాణిజ్య సంస్థ.
మొత్తం పోస్టుల సంఖ్య: 40
-ఇంజినీరింగ్ అసిస్టెంట్ (గ్రేడ్ 4) -18 పోస్టులు
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, టీ అండ్ ఐ
అర్హత: మెకానికల్, ఎలక్ట్రికల్ , ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా లేదా ఐటీఐ తర్వాత (లెటరల్ ఎంట్రీ) సంబంధిత ఇంజినీరింగ్‌లో రెండేండ్ల డిప్లొమా /తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.

టెక్నికల్ అసిస్టెంట్ (గ్రేడ్1)-22 పోస్టులు
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 11,900-32,000/-, టెక్నికల్ అసిస్టెంట్‌కు రూ. 10500-24500/-
వయస్సు: 2017, ఏప్రిల్ 27 నాటికి 26 ఏండ్లకు మించరాదు.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులకు)
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఫిజికల్ టెస్ట్, ప్రొఫెషియెన్సీ టెస్ట్ ద్వారా. అభ్యర్థులు రాత పరీక్షలో సంస్థ నిర్ణయించిన కనీస అర్హత మార్కులను సాధించాలి.
-రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో మొత్తం 100 మార్కులకు ఉంటుంది. సంబంధిత సబ్జెక్ట్ నుంచి 75 మార్కులు, జనరల్ ఆప్టిట్యూడ్ అండ్ రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్, న్యూమరికల్ ఆప్టిట్యూడ్ అండ్ జనరల్ నాలెడ్జ్‌ల నుంచి 25 మార్కులు.
-ఈ ఆబ్జెక్టివ్ పరీక్షను 90 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-నెగెటివ్ మార్కింగ్ విధానం లేదు
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తులకు చివరితేదీ: మే 17
హాల్‌టిక్కెట్ల డౌన్‌లోడింగ్: మే 27 నుంచి
రాత పరీక్ష: జూన్ 11
వెబ్‌సైట్: https://plis.indianoilpipelines.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
డీఆర్‌డీవోలో సైంటిస్ట్ జాబ్స్,

డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో) సైంటిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
DRDO
వివరాలు:
డీఆర్‌డీవో రక్షణశాఖ పరిధిలోని సంస్థ.
-మొత్తం ఖాళీల సంఖ్య - 23. విభాగాల వారీగా ఖాళీలు..
-ఏరోనాటికల్ ఇంజినీరింగ్ - 1, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ - 7, ఈసీఈ - 5, మెకానికల్ ఇంజినీరింగ్ - 6, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ - 1, సివిల్ ఇంజినీరింగ్ 1, నేవల్ ఇంజినీరింగ్ - 2 పోస్టులు ఉన్నాయి.
పోస్టు: సైంటిస్ట్ బీ
పేస్కేల్: నెలకు రూ. 72,000 +గ్రేడ్ పే రూ. 5,400/-
అర్హతలు: ప్రథమశ్రేణిలో బీఈ/బీటెక్ సంబంధిత బ్రాంచీలో ఉత్తీర్ణత. 2015, 2016, 20 17లో వ్యాలిడ్ గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
వయస్సు: 2017, మే 19 నాటికి 31 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు 33 ఏండ్లు, ఓబీసీలకు 31 ఏండ్లు మించరాదు.
ఎంపిక: వ్యక్తిగత ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 19
వెబ్‌సైట్: http://rac.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

ఇండో - స్విస్ ట్రెయినింగ్ సెంటర్‌లో ప్రవేశాలు



చండీగఢ్‌లోని ఇండో - స్విస్ ట్రెయినింగ్ సెంటర్‌లో డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
SWIS 
వివరాలు: 
ఇండో స్విస్ సెంటర్‌ను సీఎస్‌ఐఆర్- సెంట్రల్ సైంటిఫిక్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ 1963లో ప్రారంభించింది. స్విట్జర్లాండ్ సహకారంతో ఈ సంస్థను ఏర్పాటుచేశారు. ఈ సెంటర్ ద్వారా నాణ్యమైన విద్యను అందించి, పరిశ్రమలకు నిష్ణాతులైన డిప్లొమా విద్యార్థులను అందించాలనే లక్ష్యంతో దీన్ని ఏర్పాటుచేశారు.
మొత్తం సీట్ల సంఖ్య - 140
కోర్సులు: 
-అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ డై అండ్ మౌల్డ్ మేకింగ్ - నాలుగేండ్లు - 16 సీట్లు
-అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ మెకట్రానిక్స్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్ - 4 ఏండ్లు - 16 సీట్లు
-డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ - 3 ఏండ్లు - 54 సీట్లు
-డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజినీరింగ్ - 3 ఏండ్లు - 54 సీట్లు
-ఈ కోర్సులను ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), న్యూఢిల్లీ అనుమతించింది. 
ఎంపిక: ఐఎస్‌టీసీ ఎంట్రెన్స్ టెస్ట్ 2017 ద్వారా ఎంపిక
ఎంట్రెన్స్ టెస్ట్ తేదీ: 2017, జూలై 9
-ఎంట్రెన్స్‌టెస్ట్‌లో మ్యాథ్స్, సైన్స్, ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్, జనరల్ నాలెడ్జ్‌పై ప్రశ్నలు ఇస్తారు. పరీక్ష పదోతరగతి స్థాయిలో ఉంటుంది. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది.
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణులైన వారు.
వయస్సు: 1998, ఆగస్టు 1న లేదా తర్వాత జన్మించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: మే 31
ఫీజు: జనరల్, ఓబీసీలకు రూ. 1,200/-
ఎస్సీ, ఎస్టీలకు రూ. 600/-
వెబ్‌సైట్: www.istc.ac.in / www.csio.res.in.



0 comments:

Post a Comment