Tuesday, 25 April 2017

SSC Combined Junior Hindi Examination,JRF jobs in IGCAR ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ జూనియర్ హిందీ ఎగ్జామినేషన్, ఐజీసీఏఆర్‌లో జేఆర్‌ఎఫ్‌లు ఉద్యోగాలు.

ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ జూనియర్ హిందీ ఎగ్జామినేషన్,

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, జూనియర్ ట్రాన్స్‌లేటర్, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్, హిందీ ప్రధ్యాపక్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఉమ్మడి పరీక్ష
(కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్)కు సంబంధించిన నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
SSC-TRASLATER
వివరాలు:
మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. కేంద్ర కొలువులు. మంచి జీతభత్యాలు. ప్రత్యేక అలవెన్స్‌లు. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అవకాశం. సెంట్రల్ సెక్రటేరియట్ ఆఫిషియల్ లాంగ్వేజ్ సర్వీస్, రైల్వేస్, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్, సెంట్రల్ హిందీ ట్రైయినింగ్ ఇన్‌స్టిట్యూట్, ఇతర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేస్తారు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇటీవల విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేయడానికి కంబైన్డ్ జూనియర్ హిందీ/ట్రాన్స్‌లేటర్ పోస్టుల భర్తీకి విడుదలైన నోటిఫికేషన్ వివరాలు సంక్షిప్తంగా...
పోస్టు పేరు: జూనియర్/సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ కంబైన్డ్ రిక్రూట్‌మెంట్ ఎగ్జామ్
విభాగాలవారీగా వివరాలు
జూనియర్ ట్రాన్స్‌లేటర్/జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ (సెంట్రల్ సెక్రటేరియట్ ఆఫిషియల్ లాంగ్వేజ్ సర్వీస్, రైల్వే బోర్డు, ఆర్మ్‌డ్ ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్, సబాఆర్డినేట్ ఆఫీస్‌లలో)
పే స్కేల్: రూ. 35,400 - 1,12,400/-
సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్(సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీస్/ఆఫీస్‌ల్లో)
పే స్కేల్: రూ. 44,900-1,42,400/-
హిందీ ప్రధ్యాపక్ (సెంట్రల్ హిందీ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్)
పే స్కేల్: 47,600-1,51,100/-
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి హిందీ/ఇంగ్లిష్‌లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. డిగ్రీలో హిందీ/ఇంగ్లిష్‌లను ప్రధాన సబ్జెక్టుగా చదివి ఉండాలి. ట్రాన్స్‌లేషన్‌లో డిప్లొమా/సర్టిఫికెట్ ఉండాలి. హిందీ నుంచి ఇంగ్లిష్ ట్రాన్స్‌లేషన్ వర్క్‌లో రెండు నుంచి మూడేండ్ల అనుభవం ఉండాలి. జూనియర్ ట్రాన్స్‌లేటర్/జూనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్ పోస్టుకు మాస్టర్ డిగ్రీ (హిందీ/ఇంగ్లిష్) లేదా బ్యాచిలర్ డిగ్రీలో హిందీ, ఇంగ్లిష్ ప్రధాన సబ్జెక్ట్‌లతో ఉత్తీర్ణత. హిందీ ప్రధ్యాపక్ పోస్టులకు హిందీ/ఇంగ్లిష్‌లతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. హిందీ టీచింగ్ (సీనియర్ సెకండరీ లెవల్)లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 2017 జనవరి 1 నాటికి 30 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్లకు వారి సర్వీస్, కేటగిరీలను బట్టి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (జనరల్, ఓబీసీ అభ్యర్థులు). ఫీజును ఎస్‌బీఐ చలానా/ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు.
ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు లేదు.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా హైదరాబాద్, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబైలతో సహా మొత్తం 26 సెంటర్‌లు ఉన్నాయి.
ఎంపిక: రాతపరీక్ష ద్వారా
రాత పరీక్ష విధానం: రాత పరీక్ష అనేది ఆబ్జెక్టివ్ (పేపర్ 1), డిస్క్రిప్టివ్ (పేపర్ 2) విధానంలో ఉంటుంది
ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో మొత్తం 200 మార్కులకుగానూ రెండు గంటల్లో పూర్తి చేయాలి. దీనిలో జనరల్ హిందీ-100 మార్కులు, జనరల్ ఇంగ్లిష్-100 మార్కులు వస్తాయి. పరీక్షను కంప్యూటర్ బేస్డ్ ద్వారా నిర్వహిస్తారు.
ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 0.25 మార్కుల కోత విధిస్తారు.
డిస్క్రిప్టివ్ రాత పరీక్షలో మొత్తం 200 మార్కులకుగానూ రెండు గంటల్లో పూర్తి చేయాలి. దీనిలో ట్రాన్స్‌లేషన్ అండ్ ఎస్సేకు సంబంధించిన ప్రశ్నలు వస్తాయి. ఈ ప్రశ్నలో ఇంగ్లిష్ నుంచి తెలుగు, తెలుగు నుంచి ఇంగ్లిష్‌కు కన్వెన్షనల్ విధానంలో ట్రాన్స్‌లేషన్ చేయాలి.
పేపర్ 1, పేపర్ 2లో వచ్చిన మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రకారం ఎంపిక చేస్తారు.
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పూర్తివివరాలతోపాటు, మొబైల్ నంబర్, ఈ -మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి. నిర్ణయించిన నమూనాలోనే అభ్యర్థులు ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
ముఖ్యమైన తేదీలు:
రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: మే 5 (సాయత్రం 5 గంటల వరకు)
రాతపరీక్ష : జూన్ 15 న
వెబ్‌సైట్: http://ssc.nic.in లేదా http://ssconline.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐజీసీఏఆర్‌లో జేఆర్‌ఎఫ్‌లు ఉద్యోగాలు.

తమిళనాడు (కల్పకం)లోని ఇందిరా గాంధీ సెంటర్ ఫర్ అటామిక్ ఎనర్జీ (ఐజీసీఏఆర్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
igcar
వివరాలు:
ఐజీసీఏఆర్ అనేది డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ పరిధిలో పనిచేస్తున్న సంస్థ.
పోస్టు పేరు: జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్
మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య-40 
విభాగాలు: ఫిజికల్ సైన్సెస్, కెమికల్ సైన్సెస్, ఇంజినీరింగ్ సైన్సెస్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్/ఇంటిగ్రేటెడ్ ఎమెస్సీ (ఫిజిక్స్, మెటీరియల్స్ సైన్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్), ఎంటెక్/ఎంఈ (న్యూక్లియర్ ఇంజినీరింగ్, న్యూక్లియర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ), బీఈ/బీటెక్, బీఎస్సీ (ఇంజినీరింగ్/టెక్నాలజీ)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత. వినియోగంలో ఉన్న యూజీసీ/సీఎస్‌ఐఆర్ నెట్ , జెస్ట్ లేదా గేట్ స్కోర్‌ను కలిగి ఉండాలి.
వయస్సు: 28 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పే స్కేల్ : రూ. 25,000/- మొదటి ఏడాదికి, మూడో ఏడాది నుంచి రూ. 28000/-, ఫెలోషిప్ కింద స్టయిఫండ్ ఇస్తారు. బుక్ అలవెన్స్ కింద ఏడాదికి రూ. 32,000/- కంటింజెన్సీ కింద ప్రత్యేక అలవెన్స్ ఇస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం, చెన్నై, భువనేశ్వర్, కొచ్చి, కోల్‌కతా 
ఎంపిక: రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో అభ్యర్థి ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
దరఖాస్తులకు చివరితేదీ: మే 1
రాతపరీక్ష: మే 14
ఇంటర్వ్యూ: జూన్‌లో

వెబ్‌సైట్: www.igcar.gov.in




0 comments:

Post a Comment