Saturday, 22 April 2017

Southern Railway Recruitment Staffnurse Jobs,Primary Teachers' Jobs in HAL,Associate professors jobs in AIIA, Balmer Lawrie Recruitment Notification సదరన్ రైల్వేలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు, హెచ్‌ఏఎల్‌లో ప్రైమరీ టీచర్స్ ఉద్యోగాలు, ఏఐఐఏలో అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు, బామర్ లారీస్‌లో ఉద్యోగాలు.

సదరన్ రైల్వేలో స్టాఫ్‌నర్స్ ఉద్యోగాలు,

చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సదరన్ రైల్వే ఖాళీగా ఉన్న స్టాఫ్‌నర్స్ పోస్టుల భర్తీకి (తాత్కాలిక
ప్రాతిపదికిన) అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య: 14
-జనరల్-8, ఓబీసీ-3, ఎస్సీ-2, ఎస్టీ-1
-పోస్టు పేరు: స్టాఫ్‌నర్స్
-అర్హత: బీఎస్సీ నర్సింగ్ లేదా మూడేండ్ల జనరల్ నర్సింట్ అండ్ మిడ్ వైఫరీ కోర్సుతోపాటు నర్స్/మిడ్‌వైఫ్ లేదా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి.
-వయస్సు : 20 నుంచి 38 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్ : రూ. 21,190/- (కన్సాలిడేటెడ్ పే)
-ఎంపిక : రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు : ఆఫ్‌లైన్ ద్వారా. దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసికొని, పూర్తిగా నింపి సంబంధిత
రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పంపాలి.
-చిరునామా : Assistant Personnel Officer/Engg, Southern Railway, Park Town, Chennai 600 003
-దరఖాస్తులకు చివరితేది : మే 5
-వెబ్‌సైట్:www.sr.indianrailways.gov.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
హెచ్‌ఏఎల్‌లో ప్రైమరీ టీచర్స్ ఉద్యోగాలు,


హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)లో ప్రైమరీ టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
-ప్రైమరీ టీచర్స్ - 8 ఖాళీలు
-పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4, 600/-
-అర్హతలు: బీఎస్సీ (సీబీజెడ్/పీసీఎం), బీఈడీ. మ్యాథ్స్/సైన్స్ మెథడాలజీగా కలిగి ఉండాలి. లేదా బీఏ (హిస్టరీ, ఇంగ్లిష్, పొలిటికల్‌సైన్స్, ఎకనామిక్స్)తో బీఈడీ. ఇంగ్లిష్ ఒక మెథడ్‌గా చదివి ఉండాలి.
లోయర్ డివిజన్ క్లర్క్ - 1 ఖాళీ
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-అర్హతలు: బీకాం/బీఎస్సీతోపాటు కంప్యూటర్‌లో నైపుణ్యం కలిగి ఉండాలి.
-ప్యూన్ - 1 పోస్టు
-పేస్కేల్: నెలకు రూ. 10,000/-
-అర్హత: పదోతరగతి ఉత్తీర్ణత.
-వయస్సు: పై అన్ని పోస్టులకు 2017, జూన్ 1 నాటికి 40 ఏండ్లు మించరాదు.
-నోట్: పై పోస్టులన్నింటిని తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-ఫీజు: రూ. 200/-
-దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
-చివరితేదీ: మే 4
-వెబ్‌సైట్: http://www.hal-india.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఏఐఐఏలో అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉద్యోగాలు,

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టీచింగ్, హాస్పిటల్ స్టాఫ్, ప్రొఫెసర్పో స్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
-మొత్తం పోస్టుల సంఖ్య:43
-ప్రొఫెసర్-5 పోస్టులు
-అసోసియేట్ ప్రొఫెసర్-6 పోస్టులు
-అసిస్టెంట్ ప్రొఫెసర్-1 పోస్టు

-సీనియర్ మెడికల్ ఆఫీసర్-1, మెడికల్ ఆఫీసర్-1, డైటీషియన్-1, ల్యాబ్ అసిస్టెంట్-2, సోనోగ్రఫీ అసిస్టెంట్-1, మెడికల్ రికార్డ్ క్లర్క్-1, ఫార్మసీ మేనేజర్-1, ఫార్మసిస్ట్-1, కంప్యూటర్ ప్రోగ్రామర్-1, అకౌంట్స్ ఆఫీసర్-1, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్-1, ప్రైవేట్ సెక్రటరీ-2, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్-1, సీనియర్ హిందీ ట్రాన్స్‌లేటర్-1, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్-1, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్-1, అసిస్టెంట్-2, పర్సనల్ అసిస్టెంట్-2, స్టోర్ కీపర్-2, అకౌంటెంట్-1, సెక్యూరిటీ ఆఫీసర్-1, ఫైర్ ఆఫీసర్-1, అప్పర్ డివిజన్ క్లర్క్-2, లోయర్ డివిజన్ క్లర్క్-2

-అర్హత: సంబంధిత ఆయుర్వేద విభాగంలో మాస్టర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులకు ఐదేండ్ల అనుభవం ఉండాలి. మిగిలిన పోస్టులు వేర్వేరు అర్హతలు కలిగి ఉన్నాయి.
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆఫ్‌లైన్. దరఖాస్తులను పూర్తిగా నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: The Director, All India Instittute of Ayurveda (AIIA) Gautampuri, Sarita Vihar, mathura Road, New Delhi-110076
-చివరి తేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోగా దరఖాస్తులను పంపించాలి.
-వెబ్‌సైట్: www. aiia.co.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బామర్ లారీస్‌లో ఉద్యోగాలు.



 ప్రభుత్వ రంగ సంస్థ బామర్ లారీస్‌లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
-ఇది కేంద్రప్రభుత్వ రంగ సంస్థ.
-జూనియర్ ఆఫీసర్ (ట్రావెల్) - 5 పోస్టులు
-అర్హత: ఇంటర్, డిప్లొమా ఇన్ ట్రావెల్ అండ్ టూరిజం
-వయస్సు: 35 ఏండ్లు మించరాదు
-పనిచేయాల్సిన ప్రదేశం: బెంగళూరు, ముంబై
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: మే 4
-ఫీల్డ్ అసిస్టెంట్ - 2 పోస్టులు
-అర్హతలు: ఏదైనా విభాగంలో డిగ్రీ. దీంతోపాటు కస్టమ్స్ జీ/హెచ్ కార్డు కలిగి ఉండాలి.
-దరఖాస్తుకు చివరితేదీ: మే 3
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ అసిస్టెంట్ - 1 ఖాళీ
-అర్హతలు: గ్రాడ్యుయేట్ (నాన్ ఇంజినీరింగ్), కామర్స్ అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తారు.
-చివరితేదీ: మే 2
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-వెబ్‌సైట్: www.balmerlawrie.com

0 comments:

Post a Comment