Monday, 24 April 2017

Probationary Officers in Dena Bank,Vacancies in ITDHST,spice board Recruitment, ICMR Admissions Notification,IITTM MBA (Tourism and Travel Management) Admissions,Admission to Anna University, దేనా బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్లు, ఐటీడీహెచ్‌ఎస్‌టీలో ఖాళీలు, స్పైసిస్ బోర్డులో ఉద్యోగాలు, ఐసీఎంఆర్‌లో ప్రవేశాలు, ఐఐటీటీఎం ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్) ప్రవేశాలు, అన్నా యూనివర్సిటీలో ప్రవేశాలు,

దేనా బ్యాంక్‌లో ప్రొబేషనరీ ఆఫీసర్లు,

డిగ్రీ అభ్యర్థులకు అవకాశం 
-9 నెలలు ట్రెయినింగ్ + 3 నెలలు ఇంటర్న్‌షిప్
-ఏడాది పీజీడీబీఎఫ్ కోర్సు తర్వాత పీవో ఉద్యోగం
-ఆన్‌లైన్ పరీక్ష+ జీడీ, ఇంటర్వూ ద్వారా ఎంపిక

bbb 
దేనా బ్యాంక్, అమిటీ యూనివర్సిటీ (నోయిడా) సంయుక్తంగా ఏడాదిపాటు కొనసాగే బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్‌లో పోస్టు గ్రాడ్యుయేట్ సర్టిఫికెట్ కోర్సు ద్వారా ప్రొబేషనరీ ఆఫీసర్ (జూనియర్ మేనేజ్‌మెంట్ గ్రేడ్/స్కేల్ 1 ఆఫీసర్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
దేనా బ్యాంక్‌ను మొదటగా దేవ్‌కరణ్ నాన్జీ బ్యాంకింగ్ కంపెనీ లిమిటెడ్ పేరుతో దేవకరణ్ నాజ్జీ కుటుంబం 1938 మే 26న ప్రారంభించారు. ఇది 1939 డిసెంబర్‌లో ఒక పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారింది. ఆ తర్వాత దేనా బ్యాంక్ లిమిటెడ్‌గా పేరు మార్చుకొని, 1969 జూలై 19న ఈ బ్యాంక్‌తోపాటు ఇతర 13 ప్రధాన కమర్షియల్ బ్యాంక్‌లను కేంద్రం జాతీయం చేసింది.
పోస్టు పేరు: ప్రొబేషనరీ ఆఫీసర్
కోర్సు పేరు: పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ 
మొత్తం ఖాళీలు : 300 (జనరల్-206, ఓబీసీ-22, ఎస్సీ-62, ఎస్టీ-10, పీహెచ్‌సీ-9**)
గమనిక: పీహెచ్‌సీ స్టార్ మార్క్(**) గుర్తు ఉన్న పోస్టులను మొత్తం పోస్టుల్లోని కలుపుకొని కేటాయించారు.

-వివిధ బ్యాచ్‌లవారీగా ఏప్రిల్ 2017-డిసెంబర్ 2017 వరకు ప్రతి బ్యాచ్‌లోను ఎంత మంది విద్యార్థులను తీసుకోవటం అనేది దేనాబ్యాంక్ నిర్ణయిస్తుంది. ఆ తర్వాత నోయిడాలోని అమిటీ యూనివర్సిటీ ట్రెయినింగ్ ఇస్తుంది. ప్రస్తుతం 300 పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 55 శాతం) మార్కులతో ఉత్తీర్ణత లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. 2017 ఏప్రిల్ 1 నాటికి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి.
వయస్సు: 2017 ఏప్రిల్ 1 నాటికి కనిష్టంగా 20 ఏండ్లు, గరిష్టంగా 29 ఏండ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీలకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. 

అప్లికేషన్ ఫీజు: రూ.400/-(జనరల్, ఓబీసీ ), రూ. 50/-(ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు )
కోర్సు ఫీజు: బోర్డింగ్, లాడ్జింగ్, కోర్సు ఫీజు, ఇతర రుసుములు కలుపుకొని రూ. 3 లక్షలు + సర్వీస్ ట్యాక్స్ చెల్లించాలి. ఈ మొత్తాన్ని కూడా దేనా బ్యాంక్ ఏడాదికి తక్కువ వడ్డీతోవిద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ ఇస్తుంది. ఈ లోన్‌ను ఈఎంఐ రూపంలో 84 నెలల్లో చెల్లించాలి.
కోర్సు వ్యవధి: 12 నెలలు (9 నెలల కోర్సు+ 3 నెలల ఇంటర్న్‌షిప్)
-కోర్సు పూర్తి చేసిన అనంతరం పీవోగా ఐదేండ్లు దేనా బ్యాంక్‌లో కొనసాగితే అభ్యర్థులు చెల్లించిన మొత్తం ఫీజును తిరిగి ఇచ్చేస్తారు. ఏడాది కోర్సులో మొదటి 9 నెలలు అమిటీ యూనివర్సిటీ నోయిడాలో కోర్సును నిర్వహిస్తారు. చివరి 3 నెలలు ఇంటర్న్‌షిప్ చేయడానికి కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా ఏదో ఒకచోట ఇంటర్న్‌షిప్ చేయాల్సి ఉంటుంది. శిక్షణ కాలంలో వ్యక్తిగత ఖర్చుల కింద నెలకు రూ. 2500/-చొప్పున మొదటి 9 నెలలకు , రూ. 7500/- చొప్పున చివరి 3 నెలలకు ఇస్తారు. విజయవంతంగా కోర్సును పూర్తిచేసిన అభ్యర్థులకు అమిటీ యూనివర్సిటీ (నోయిడా) పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (పీజీడీబీఎఫ్) డిగ్రీ సర్టిఫికెట్‌తో పాటు ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగ అవకాశాన్ని కల్పిస్తారు.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్+ గ్రూప్ డిస్కషన్ + పర్సనల్ ఇంటర్వ్యూ 
-ఆన్‌లైన్ పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో 200 మార్కులకు నిర్వహిస్తారు. 
-కనీసం కటాఫ్ మార్కులను బ్యాంక్ నిర్ణయిస్తుంది.

-పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు.
-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులను తగ్గిస్తారు.
-డిస్క్రిప్టివ్ టెస్ట్ (ఇంగ్లిష్ లాంగ్వేజ్) కూడా ఆన్‌లైన్‌లోనే ఉంటుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్‌పై పరిజ్ఞానం పరీక్షించడానికి ఈ టెస్ట్‌ను నిర్వహిస్తారు. ఈ పరీక్షలో 2 ప్రశ్నలకుగాను 50 మార్కులు కేటాయించారు. దీన్ని 30 నిమిషాల్లో పూర్తిచేయాలి.
-ఆన్‌లైన్‌టెస్ట్‌లో మెరిట్ పొందిన అభ్యర్థులను రిజర్వేషన్ ప్రకారం 1:4 చొప్పున గ్రూప్ డిస్కషన్+ పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.
-గ్రూప్ డిస్కషన్‌కు 20 మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకు 80 మార్కులు.
-గ్రూప్ డిస్కషన్+ పర్సనల్ ఇంటర్వ్యూలో కనీసం 40 శాతం అర్హత మార్కులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 35 శాతం) సాధించాలి.
-ఆన్‌లైన్‌టెస్ట్+గ్రూప్ డిస్కషన్+ పర్సనల్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కులను కలిపి తుది ఎంపిక చేస్తారు.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతితో సహా దేశవ్యాప్తంగా 96 కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, విద్యార్హతలు, తదితర వివరాలను ఎంటర్ చేయాలి. నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మే 9
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: మే 9
డౌన్‌లోడ్ కాల్‌లెటర్స్: మే 30 నుంచి 
ఆన్‌లైన్ పరీక్షతేదీ: జూన్ 11
వెబ్‌సైట్: www.denabank.co.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐటీడీహెచ్‌ఎస్‌టీలో ఖాళీలు,

బెంగళూరులోని ది ఇన్‌స్టిట్యూట్ ఆప్ ట్రాన్స్ డిసిప్లినరీ హెల్త్ సైన్స్ & టెక్నాలజీ (ఐటీడీహెచ్‌ఎస్‌టీ) టీచింగ్, నాన్‌టీచింగ్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
ప్రొఫెసర్స్అసోసియేట్ ప్రొఫెసర్స్
-అసిస్టెంట్ ప్రొఫెసర్స్
-సీనియర్ లీగల్ &పాలసీ ఆఫీసర్స్
-రిజిస్ట్రార్, డీన్ రిసెర్చ్
-ఇంగ్లిష్ లాంగ్వేజ్ ఎడిటర్
-మీడియా రిలేషన్స్&సోషల్ మీడియా స్పెషలిస్ట్
-ఫైనాన్స్ ఆఫీసర్, ఇంటర్న్ 
-ఐటీ సపోర్ట్ ఆఫీసర్
దరఖాస్తు విధానం: ఈ-మెయిల్ ద్వారా పంపాలి.
చివరి తేదీ: మే 10
వెబ్‌సైట్:http://tdu.edu.in/careers
----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
స్పైసిస్ బోర్డులో ఉద్యోగాలు,

కొచ్చిన్‌లోని స్పైసిస్ బోర్డులో ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు: 
స్పైసిస్ బోర్డు భారత వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలో పనిచేస్తుంది.
-ఈ పోస్టులన్నింటిని ఎస్సీ కేటగిరీకి కేటాయించారు.
ట్రెయినీ అనలిస్ట్ (కెమిస్ట్రీ) - 9 పోస్టులు
అర్హతలు: ఎమ్మెస్సీలో కెమిస్ట్రీ/ఫుడ్ కెమిస్ట్రీ లేదా అప్లయిడ్ కెమిస్ట్రీ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
ట్రెయినీ అనలిస్ట్ (మైక్రోబయాలజీ) - 3 పోస్టులు
అర్హతలు: ఎమ్మెస్సీలో మైక్రోబయాలజీ/ఫుడ్ మైక్రోబయాలజీ లేదా అప్లయిడ్ మైక్రోబయాలజీ ఉత్తీర్ణులై ఉండాలి.
వయస్సు: 2017, ఏప్రిల్ 1 నాటికి 35 ఏండ్లు మించరాదు.
కాలపరిమితి: ఏడాది
స్టయిఫండ్: నెలకు రూ. 18,000/- ఇస్తారు.
ఎంపిక: టెస్ట్ ద్వారా
టెస్ట్‌తేదీ: ఏప్రిల్ 28న కొచ్చిన్‌లోని స్పైసిస్ బోర్డు కార్యాలయంలో నిర్వహిస్తారు.
వెబ్‌సైట్: http://www.indianspices.com

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీఎంఆర్‌లో  ప్రవేశాలు,
చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడమాలజీ (ఐసీఎంఆర్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
IIE 
వివరాలు: 
ఈ సంస్థ ఐసీఎంఆర్ పరిధిలోనిది.
-సైంటిస్ట్ డీ (మెడికల్) - 1, సైంటిస్ట్ సీ (మెడికల్/నాన్ మెడికల్) - 1, సైంటిస్ట్ బీ (మెడికల్)(ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్) -1.
-పై పోస్టులకు దరఖాస్తు చేసుకొన్న అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి స్కైప్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
-కన్సల్టెంట్ - 2, రిసెర్చ్ అసోసియేట్స్ (స్టాటిస్టిక్స్) - 1, సీనియర్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 1, ప్రాజెక్ట్ అసిస్టెంట్ - 1, ప్రాజెక్ట్ టెక్నీషియన్ - 1. 
-ఈ పోస్టులను వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
-పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.nie.gov.in

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------ఐఐటీటీఎం ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్) ప్రవేశాలు,
భారత ప్రభుత్వ పరిధిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్ (ఐఐటీటీఎం) ఎంబీఏ, బీబీఏ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.
INDIAN-INSTITUTE 
వివరాలు: 
కేంద్ర టూరిజం శాఖ పరిధిలో గ్వాలియర్, భువనేశ్వర్, నోయిడా, నెల్లూరుల్లో ఐఐటీటీఎం క్యాంపస్‌లు ఉన్నాయి. ఈ సంస్థ అమర్‌కంటక్‌లోని ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీతో కలిసి ఈ కోర్సులను నిర్వహిస్తున్నారు. 2017 - 18 విద్యాసంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు.
కోర్సులు: ఎంబీఏ (టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్‌మెంట్). రెండేండ్ల కోర్సు.
బీబీఏ (టూరిజం అండ్ ట్రావెల్) - మూడేండ్ల కోర్సు.
పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్: www.iittm.net

----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------

అన్నా యూనివర్సిటీలో ప్రవేశాలు,



చెన్నైలోని అన్నా యూనివర్సిటీ ఎమ్మెస్సీ, ఎంఫిల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
AnnaUniversity 
వివరాలు: 
దేశంలోని ప్రముఖ యూనివర్సిటీల్లో అన్నా యూనివర్సిటీ ఒకటి.
ఎమ్మెస్సీ కోర్సులు: అప్లయిడ్ మ్యాథమెటిక్స్, మెటీరియల్ సైన్స్, అప్లయిడ్ కెమిస్ట్రీ, అప్లయిడ్ జియాలజీ, ఎలక్ట్రానిక్ మీడియా (సెల్ఫ్ సపోర్టింగ్)
ఎంఫిల్: మ్యాథమెటిక్స్, ఫిజిక్స్/మెడికల్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్, క్రిస్టల్ సైన్స్, అప్లయిడ్ జియాలజీ.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నేటి నుంచి ప్రారంభం
చివరితేదీ: మే 13
వెబ్‌సైట్: www.annauniv.edu

0 comments:

Post a Comment