Saturday, 22 April 2017

IIT Mandy Admissions,PG Diploma in Indian Institute of Packaging. ఐఐటీ మండీలో ప్రవేశాలు, ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు.

ఐఐటీ మండీలో ప్రవేశాలు,

హిమాచల్‌ప్రదేశ్‌లోని మండీలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ఎమ్మెస్సీ, ఎంటెక్ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
-2017 - 18 విద్యాసంవత్సరానికిగాను ఈ ప్రవేశాలు.
-కోర్సు: ఎమ్మెస్సీ (కెమిస్ట్రీ)
-అర్హత: బీఎస్సీ కెమిస్ట్రీ/అప్లయిడ్ కెమిస్ట్రీలో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన/రాస్తున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
-ఎంపిక: ఐఐటీ మండీ నిర్వహించే రాతపరీక్ష ఆధారంగా
-చివరితేదీ: మే 11
-కోర్సు: ఎంటెక్ (బయోటెక్నాలజీ)
-అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఎమ్మెస్సీ/ బీటెక్ (లైఫ్ సైన్సెస్), గేట్‌లో వ్యాలిడ్‌స్కోర్ సాధించి ఉండాలి.
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-చివరితేదీ: మే 14
-వెబ్‌సైట్: http://oas.iitmandi.ac.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ప్యాకేజింగ్‌లో పీజీ డిప్లొమా ప్రవేశాలు.

 ముంబైలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ) 2017-19 అకడమిక్ ఇయర్‌కు పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (పుల్‌టైమ్) కోర్స్‌లో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: 
-ఐఐపీ అనేది కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ పరిధిలోని అటానమస్ సంస్థ. ఈ సంస్థ క్యాంపస్‌లు హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ఢిల్లీల్లో ఉన్నాయి.
-కోర్సు పేరు: పీజీ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్
-కాలవ్యవధి : రెండేండ్లు
-మొత్తం సీట్లసంఖ్య: 300
-దేశవ్యాప్తంగా ఖాళీలు: ముంబై-80, ఢిల్లీ-100, కోల్‌కతా-60, హైదరాబాద్-60
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అగ్రికల్చర్, ఫుడ్ సైన్స్, పాలీమర్ సైన్స్, ఫార్మా, ఇంజినీరింగ్ విభాగాల్లో ఇటీవల పూర్తిచేసిన బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
-వయస్సు: 2017 మే 31 నాటికి 30 ఏండ్లకు మించరాదు. 
-ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు వయోపరిమితి లో సడలింపు ఉంటుంది.
-అప్లికేషన్ ఫీజు: రూ. 500/-
-ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, ముంబై, చెన్నై, కోల్‌కతా, న్యూఢిల్లీ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
-రాతపరీక్ష: జూన్ 15
-వెబ్‌సైట్: www.iip-in.com

0 comments:

Post a Comment