Saturday, 22 April 2017

Bank of India Recruitment Managers, National Seeds Corporation Recruitment Trainee Posts,UPSC-Technical Officers Jobs,Developers Jobs in BEICI,Scientific Assistants Jobs In ECIL బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్లు, నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌లో ట్రెయినీలు, యూపీఎస్సీ-టెక్నికల్ ఆఫీసర్స్, బీఈసీఐఎల్‌లో డెవలపర్లు, ఈసీఐఎల్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్లు.

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మేనేజర్లు,
దేశంలో ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ ఇండియా జూనియర్ /మిడిల్ మేనేజ్‌మెంట్
విభాగాల్లో ఖాళీగా ఉన్న మేనేజర్, ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి
దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
-బ్యాచిలర్ డిగ్రీ + ఎంబీఏ అభ్యర్థులకు అవకాశం.
-ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వూ ద్వారా ఎంపిక
-మేనేజర్ ఉద్యోగం, ఆకర్షణీయమైన జీతభత్యాలు
-దరఖాస్తులకు చివరితేదీ: మే 5

వివరాలు:
ప్రైవేట్ యాజమాన్యంతో 1906 సెప్టెంబర్ 7లో స్థాపించిన బ్యాంక్ ఆఫ్ ఇండియా 1969 జూలై 19న జాతీయం చేశారు. ఈ బ్యాంక్ ట్యాగ్‌లైన్-Relation -ship beyond Banking. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 54 జోనల్ ఆఫీసులతో, 4963 బ్రాంచీ నెట్‌వర్క్‌ను కలిగివుంది.

-మొత్తం ఖాళీల సంఖ్య: 670 పోస్టులు మేనేజర్-400, క్రెడిట్ ఆఫీసర్-270
-పోస్టు పేరు: క్రెడిట్ ఆఫీసర్ జేఎంజీఎస్-స్కేల్1-270 పోస్టులు జనరల్-113, ఓబీసీ-75, ఎస్సీ-45, ఎస్టీ-37, పీహెచ్‌సీ-16**
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎంబీఏ/పీజీడీబీఎం, పీజీబీఎం, పీజీడీబీఏ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ (కామర్స్, సైన్స్, ఎకనామిక్స్)లో ఉత్తీర్ణత. ప్రస్తుతం ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సంబంధిత ఫైనల్ ఇయర్ డిగ్రీ ఫలితాలు 2017 జూన్ 30 నాటికి వెలువడి ఉండాలి. సీఏ/ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ పరీక్షలోఉత్తీర్ణత.

line
-మూడునెలల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
-పే స్కేల్: రూ. 23700-980/7-30560-1145/2-32850-1310/7-42020
-పోస్టు పేరు: మేనేజర్ (ఎంఎంజీఎస్-స్కేల్ 2- 400 పోస్టులు (జనరల్-188, ఓబీసీ-111, ఎస్సీ-68, ఎస్టీ-33, పీహెచ్‌సీ-12**)
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ప్రథమ శ్రేణిలో బ్యాచిలర్ డిగ్రీతోపాటు ఎంబీఏ/పీజీడీబీఎం, పీజీబీఎం, పీజీడీబీఏ లేదా పోస్టు గ్రాడ్యుయేషన్ (కామర్స్, సైన్స్, ఎకనామిక్స్)లో ఉత్తీర్ణత. సీఏ/ఐసీడబ్ల్యూఏ, కంపెనీ సెక్రటరీ పరీక్షలోఉత్తీర్ణత. మూడు నెలల కంప్యూటర్ కోర్సు సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పబ్లిక్ సెక్టార్ బ్యాంక్/ప్రైవేట్ బ్యాంక్‌లో రెండేండ్లపాటు పనిచేసిన అనుభవం ఉండాలి.

-పే స్కేల్ :రూ.31,705-1145/1-32850-1310/10-45,950/-
-వయసు: 2017 ఏప్రిల్ 10 నాటికి ఆఫీసర్ పోస్టుకు కనిష్టంగా 21 ఏండు,్ల గరిష్టంగా 30 ఏండ్లకు మించరాదు. మేనేజర్ పోస్టుకు కనిష్టంగా 23 ఏండు,్ల గరిష్టంగా 35 ఏండ్లకు మించరాదు.ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లవరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-గమనిక: పీహెచ్‌సీ స్టార్ మార్క్(**) గుర్తు ఉన్న పోస్టులు మొత్తం పోస్టుల్లోని కలుపుకొని కేటాయించారు.
-అప్లికేషన్ ఫీజు: జనరల్/ ఓబీసీలకు రూ. 600/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలు రూ. 100/- చెల్లించాలి.
-పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ, గ్రేటర్ కోల్‌కతా, భోపాల్‌తో పాటు దేశవ్యాప్తంగా 26 ఎగ్జామినేషన్ సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తారు.
-ఎంపిక విధానం: ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-ఇది పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
-ఇంగ్లిష్ లాంగ్వేజ్ అనేది కేవలం క్వాలిఫయింగ్ మాత్రమే
-పరీక్ష కాలవ్యవధి 120 నిమిషాలు

-పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు జవాబుకు 1/4 మార్కులు కోత విధిస్తారు.
-ఆన్‌లైన్ టెస్ట్‌లో మెరిట్ పొందిన అభ్యర్థులను రిజర్వేషన్ ప్రకారం పర్సనల్ ఇంటర్వ్యూకు ఎంపికచేస్తారు.
-పర్సనల్ ఇంటర్వ్యూ 100 మార్కులకు నిర్వహిస్తారు. దీనిలో కనీసం 40 శాతం అర్హత మార్కులు (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 35 శాతం) సాధించాలి.
-ఆన్‌లైన్ టెస్ట్‌కు 80 శాతం, పర్సనల్ ఇంటర్వ్యూకు 20 శాతం వెయిటేజీ. వచ్చిన మొత్తం మార్కులను కలిపి తుది ఎంపిక చేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో దరఖాస్తులను నింపేటప్పుడు నిర్ణీత నమూనాలో ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి.
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరితేదీ: మే 5
-వెబ్‌సైట్: www.bankofindia.co.in



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
నేషనల్ సీడ్స్ కార్పొరేషన్‌లో ట్రెయినీలు,


నేషనల్ సీడ్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్‌ఎస్‌సీ) ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్, సూపర్‌వైజర్ స్థాయిలోని మేనేజ్‌మెంట్ ట్రెయినీ, డిప్లొమా/ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

వివరాలు:
-పోస్టు పేరు: మ్రేనేజ్‌మెంట్ ట్రెయినీ, డిప్లొమా/ట్రెయినీ
-మొత్తం ఖాళీల సంఖ్య: 188
-ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టుల సంఖ్య-63
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (హెచ్‌ఆర్)-7 పోస్టులు
-అర్హత: పీజీ డిగ్రీ/ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్‌మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్, ఎంబీఏ (హెచ్‌ఆర్‌ఎం)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ మెటీరియల్స్ మేనేజ్‌మెంట్ -2 పోస్టులు
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ లీగల్, అసిస్టెంట్ కో సెక్రటరీ -2 పోస్టులు
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ప్రొడక్షన్)-30 పోస్టులు

-అర్హత: అగ్రికల్చర్ బీఎస్సీతోపాటు ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్)లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఎమ్మెస్సీ అగ్రికల్చర్ (ఆగ్రానమీ, సీడ్ టెక్నాలజీ, ప్లాంట్ బ్రీడింగ్ అండ్ జెనిటిక్స్, అగ్రికల్చర్ ఎంటమాలజీ, ప్లాంట్ పాథాలజీ)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత.
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (మార్కెటింగ్)-9 పోస్టులు
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (అగ్రి/సివిల్ ఇంజినీరింగ్)-7 పోస్టులు
-మేనేజ్‌మెంట్ ట్రెయినీ (ఎఫ్ అండ్ ఏ)-6 పోస్టులు
-పే స్కేల్ :రూ. 35,998/-, (కన్సాలిడేటెడ్ స్టయిఫండ్)

నాన్ ఎగ్జిక్యూటివ్ స్థాయి పోస్టులు
-అసిస్టెంట్ (లీగల్)-3 పోస్టులు
-పే స్కేల్ : రూ. 9400-25,700/-
-సూపర్‌వైజర్ స్థాయి పోస్టుల సంఖ్య-54
-సీనియర్ ట్రెయినీ(మార్కెటింగ్)-40 పోస్టులు
-అర్హత: ఎంబీఏ (అగ్రి బిజినెస్ మేనేజ్‌మెంట్)/బీఎస్సీ అగ్రికల్చర్‌లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. డిప్లొమా ఇన్ మార్కెటింగ్ మేనేజ్‌మెంట్/సేల్స్ మేనేజ్‌మెంట్‌లో సర్టిఫికెట్ ఉండాలి.
-డిప్లొమా ట్రెయినీ (సివిల్, అగ్రికల్చర్, ఎలక్ట్రికల్) -14 పోస్టులు
-అర్హత: మూడేండ్ల డిప్లొమా (అగ్రికల్చర్, సివిల్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్)లో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.

-పే స్కేల్ : రూ. 20,633/- కన్సాలిడేటెడ్ స్టయిఫండ్
-నాన్ సూపర్‌వైజర్ స్థాయి పోస్టుల సంఖ్య-68
-ట్రెయినీ (అగ్రికల్చర్)-26 పోస్టులు
-అర్హత: అగ్రికల్చర్ బీఎస్సీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ట్రెయినీ (టెక్నీషియన్)-8 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన సంస్థ/ఎన్‌సీవీటీ నుంచి ఫిట్టర్ ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-ట్రెయినీ (హ్యూమన్ రిసోర్స్)-11 పోస్టులు
-అర్హత: బీబీఏ, బీసీఏ, బీఏ(పర్సనల్ మేనేజ్‌మెంట్) లేదా ఏదైనా డిగ్రీలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత. ఇండస్ట్రియల్ రిలేషన్, లేబర్ లా/కంప్యూటర్ అప్లికేషన్‌లో ఏడాది డిప్లొమా సర్టిఫికెట్ ఉండాలి.
-ట్రెయినీ (అకౌంటెంట్)-15 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీకాంలో 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
-ట్రెయినీ (స్టోర్స్, ల్యాబొరేటరీ)-8 పోస్టులు
గమనిక: అన్ని పోస్టులకు ఎంఎస్ ఆఫీస్ లేదా బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.
-పే స్కేల్ : రూ. 15,804/-(కన్సాలిడేటెడ్ స్టయిఫండ్)
-వయస్సు: 2017 మే 6 నాటికి 27 ఏండ్లకు మించరాదు. అసిస్టెంట్ (లీగల్)కు గరిష్టంగా 30 ఏండ్లు మించరాదు.

-దరఖాస్తు ఫీజు: రూ. 525/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులకు ఫీజు రూ. 25/-
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-ఎంపిక: రాతపరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. అర్హతగల అభ్యర్థులు కేవలం ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
-దరఖాస్తులకు చివరితేదీ: 2017 మే 6
-రాతపరీక్ష తేదీ: మే చివరి వారం/జూన్ మొదటివారం
-వెబ్‌సైట్: http://www.indiaseeds.com


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
యూపీఎస్సీ-టెక్నికల్ ఆఫీసర్స్,

యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో/శాఖల్లో ఖాళీగా ఉన్న ఫోర్‌మెన్, టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు:
-యూపీఎస్సీ స్వతంత్ర ప్రతిపత్తిగల సంస్థ.
-మొత్తం పోస్టుల సంఖ్య - 17
-ఫోర్‌మెన్ (కెమికల్)-4 పోస్టులు
-ఫోర్‌మెన్ (ఎలక్ట్రానిక్స్)-1 పోస్టు
-ఫోర్‌మెన్ (మెకానికల్)-4 పోస్టులు
-టెక్నికల్ ఆఫీసర్ (ఫారెస్ట్రీ)-3 పోస్టులు
-అసిస్టెంట్ రిజిస్ట్రార్ జనరల్ (లాంగ్వేజీ)-1
-రిసెర్చ్ ఆఫీసర్/ప్లానింగ్ ఆఫీసర్-1 పోస్టు
-డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ మైన్స్-3 పోస్టులు
-అర్హత :గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత సబ్జెక్ట్‌ల్లో నుంచి బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, బీఈ/బీటెక్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో అనుభవం ఉండాలి. వివిధ పోస్టులకు వేర్వేరు అర్హతలు ఉన్నాయి. పూర్తి వివరాలకు యూపీఎస్సీ వెబ్‌సైట్ చూడవచ్చు.
-ఎంపిక: రాత పరీక్ష/ పర్సనల్ ఇంటర్వ్యూ
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-దరఖాస్తులకు చివరి తేదీ: మే 11
-వెబ్‌సైట్: http://upsconline.nic.in


----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
బీఈసీఐఎల్‌లో డెవలపర్లు,
బ్రాడ్ కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
-మొత్తం పోస్టులు:10
-టెక్నికల్ ప్రాజెక్ట్ మేనేజర్-1, సాఫ్ట్‌వేర్ ఆర్కిటెక్-1, హార్డ్‌వేర్ ఆర్కిటెక్-1, టెస్ట్ ఆర్కిటెక్-1, సాఫ్ట్‌వేర్ డెవలపర్-2 , టెస్ట్ అండ్ వ్యాలీడేషన్ ఇంజినీర్-2, పీసీబీ లేఅవుట్ ఇంజినీర్-1, సీనియర్ టెక్నీషియన్-1
-అర్హత: బీఈ/బీటెక్. సీనియర్ టెక్నీషియన్ పోస్టులకు డిప్లొమా ఉండాలి.
-ఎంపిక: రాత పరీక్ష,/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు: ఆన్‌లైన్/ఈ-మెయిల్ ద్వారా.
-చివరి తేదీ : ఏప్రిల్ 25
-వెబ్‌సైట్: www.becil.com



----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
ఈసీఐఎల్‌లో సైంటిఫిక్ అసిస్టెంట్లు.



-ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

వివరాలు:
-ఈ పోస్టులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేస్తున్నారు.
-టెక్నికల్ ఆఫీసర్ - 1
-పేస్కేల్: నెలకు రూ. 21,000/-
సైంటిఫిక్ అసిస్టెంట్ - 4 ఖాళీలు
-పేస్కేల్: నెలకు రూ. 13,356/-
-జూనియర్ ఆర్టీజియన్ - 4 ఖాళీలు
-పేస్కేల్: రూ. 11,764/-
-పనిచేయాల్సిన ప్రదేశం: విశాఖపట్నం
-ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
-ఇంటర్వ్యూ తేదీ: మే 6
-అర్హతలు: వయస్సు తదితరాల కోసం
-వెబ్‌సైట్: http://www.ecil.co.in

0 comments:

Post a Comment