Sunday, 8 January 2017

HPCL Recruitment Officers jobs.EFS MTS jobs.ICHR Research fellowships . హెచ్‌పీసీఎల్‌లో ఆఫీసర్స్ ఉద్యోగాలు. ఈఎఫ్‌ఎస్‌లో ఎంటీఎస్‌ ఉద్యోగాలు. ఐసీహెచ్‌ఆర్‌లో రిసెర్చ్ ఫెలోషిప్‌లు.

హెచ్‌పీసీఎల్‌లో ఆఫీసర్స్ ఉద్యోగాలు.

హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఆఫీసర్ ట్రెయినీ పోస్టుల భర్తీకి (గేట్ 2017 స్కోర్ ద్వారా) అర్హులైన ఇంజినీరింగ్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
HPCLGATE
వివరాలు:
హెచ్‌పీసీఎల్ నవరత్న కంపెనీ. దీనిని 1974లో ఏర్పాటు చేశారు. పార్చ్యూన్ 500 గ్లోబల్ కంపెనీలలో హెచ్‌పీసీఎల్ ఒకటి.
ఆఫీసర్ ట్రెయినీ
-పనిచేసే ప్రదేశం: దేశవ్యాప్తంగానున్న హెచ్‌పీసీఎల్ యూనిట్లలో
-విభాగాలు: మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కెమికల్

-అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి 60 శాతం మార్కులతో ఇంజినీరింగ్ డిగ్రీ లేదా బీఈ/బీటెక్ (మెకానికల్, మెకానికల్ అండ్ ప్రొడక్షన్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ ప్రాసెస్ కంట్రోల్, కెమికల్, పెట్రోకెమికల్, పెట్రోలియం రిఫైనింగ్ అండ్ పెట్రోకెమికల్, పెట్రోలియం రిఫైనింగ్)లో ఉత్తీర్ణత. గేట్-2017 స్కోర్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
-వయస్సు: 2017 జూన్ 30 నాటికి 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
-పే స్కేల్ : రూ. 24,90050,500/- (ఏడాదికి సుమారుగా రూ. 10.73 లక్షలు)

-అప్లికేషన్ ఫీజు: రూ.265/- (ఎస్‌బీఐ చలానా)
-ప్రొబేషనరీ పీరియడ్: ఏడాది
-ఎంపిక: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) 2017 స్కోర్ ఆధారంగా.. ప్రొబేషన్ పీరియడ్‌లో చూపిన పర్‌ఫార్మెన్స్ ఆధారంగా దేశంలో ఎక్కడైనా పోస్టింగ్ ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో నిర్ణీత నమూనా ఫొటో, సంతకాన్ని అప్‌లోడ్ చేయాలి. వినియోగంలో ఉన్న ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి.
-ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: జనవరి 10
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 10
-వెబ్‌సైట్: WW.HINDUSTANPETROLEUM.COM
------------------------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------------------
ఈఎఫ్‌ఎస్‌లో ఎంటీఎస్‌ ఉద్యోగాలు.
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన విశాఖపట్నంలోని చీఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్ (ఈఎఫ్‌ఎస్) మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
DGQALogo
వివరాలు:
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) మొత్తం పోస్టుల సంఖ్య: 4 పోస్టులు
-అర్హత: గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి పదోతరగతితోపాటు ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత
-పే స్కేల్: రూ. 5, 200-20, 200 + గ్రేడ్ పే రూ.1,800/-
-వయస్సు : 25 ఏండ్లకు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

-ఎంపిక: రాత పరీక్ష ద్వారా
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని, పూర్తిగా నింపి అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా:CQAO,CHIEF QUALITY ASSUR ANCE ESTABLISHMENT (EFS), NATIONAL HIGHWAY- 5, PO MARRIP ALEM, VISAKHAPATNAM - 530 018
-చివరితేదీ: 2017 జనవరి 13
-వెబ్‌సైట్: WWW.DGQADEFENCE.GOV.IN


------------------------------------------------------------------------------------------------------------------------
------------------------------------------------------------------------------------------------------------------------
ఐసీహెచ్‌ఆర్‌లో రిసెర్చ్ ఫెలోషిప్‌లు.



న్యూఢిల్లీలోని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ హిస్టారికల్ రిసెర్చ్ (ఐసీహెచ్‌ఆర్) 2017-18 విద్యా సంవత్సారానికి జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ పొందడానికి అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ICHR
వివరాలు:
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ మొత్తం ఫెలోషిప్‌ల సంఖ్య: 80
-విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ (హిస్టరీ), సంబంధిత సబ్జెక్ట్‌ల్లో పీహెచ్‌డీలో ప్రవేశం పొంది ఉండాలి.
-ఫెలోషిప్: ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 16 వేలు ఇస్తారు. కంటింజెన్సీ గ్రాంట్ కింద ఏడాదికి రూ. 15 వేల చొప్పున రెండేండ్లు ఇస్తారు.

-దరఖాస్తు ఫీజు: రూ. 200/-
-ఎంపిక: ప్రవేశ పరీక్ష ద్వారా
-పరీక్షా విధానం: మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-30 మార్కులకు 30 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఇస్తారు
-12 షార్ట్ ఎస్సే టైప్ ప్రశ్నల్లో అభ్యర్థులు 6 ప్రశ్నలకు 100 పదాల్లో సమాధానం రాయాల్సి ఉంటుంది. వీటికి 30 మార్కులు కేటాయించారు.
-మరో 6 వ్యాసరూప సమాధాన ప్రశ్నలు ఇస్తారు. వీటిలో ఏవైనా రెండు ప్రశ్నలకు ఒక్కోదానికి 500 పదాల్లో జవాబులు రాయాలి. ఒక్కో ప్రశ్నకు 20 మార్కులు
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్‌లో పంపిన దరఖాస్తులను ప్రింట్ తీసి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.

-దరఖాస్తులకు చివరి తేదీ: 2017 జనవరి 19
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపించడానికి చివరి తేదీ: 2017 జనవరి 31
-ఎంట్రెన్స్ పరీక్ష: 2017 ఫిబ్రవరి 26
-వెబ్‌సైట్: WWW.ICHR.AC.IN


0 comments:

Post a Comment