Tuesday, 16 August 2016

Indian Navy SSC officers Jobs, CIMAP Technicians Jobs , Ordnance Factory LDC posts , IISC librarian posts , Oil India jobs . ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్స్, సీఐఎంఏపీలో టెక్నీషియన్స్, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఎల్‌డీసీ పోస్టులు , ఐఐఎస్సీ లో లైబ్రెరీయన్ పోస్టులు, ఆయిల్ ఇండియా ఉద్యోగాలు.

ఇండియన్ నేవీలో ఎస్‌ఎస్‌సీ ఆఫీసర్స్,
బీఈ/బీటెక్ చేసిన అభ్యర్థులకు నేవీలో ఉద్యోగాలు. జూన్ 2017 లో కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో ప్రారంభమయ్యే కోర్సు ద్వారా అవకాశం. శిక్షణ పూర్తయిన తర్వాత లెఫ్టినెంట్ హోదాలో ఉద్యోగం. మంచి జీతాలు, చాలెంజింగ్ కెరీర్.. ఉద్యోగ భద్రత, దేశ సేవలో ప్రత్యక్షంగా పాల్గొనే సదుపాయం.. వీటన్నింటి సమాహారమే నేవీలో ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ బ్రాంచ్‌లో షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ కింద వెలువడిన పోస్టులు. దరఖాస్తు దాఖలు చేయడానికి చివరితేదీ సెప్టెంబర్13 సందర్భంగా వాటి వివరాలు సంక్షిప్తంగా..

-భారత ప్రభుత్వ రక్షణశాఖ పరిధిలోని ఇండియన్ నేవీ (ఐఎస్) షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ (ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్) జూన్ 2017లో ప్రారంభించే కోర్స్ కోసం అర్హత గల అవివాహిత అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను ఇండియన్ నేవల్ అకాడమీ విడుదల చేసింది.
వివరాలు: ఇండియన్ నేవీ ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌లో సర్వీస్ కమీషన్ ఆఫీసర్ కోర్సు - జూన్ 2017. ఈ కోర్సు కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2017 నుంచి ప్రారంభమవుతుంది. కేవలం అవివాహిత మహిళ అభ్యర్థులు మాత్రమే నేవల్ ఆర్కిటెక్చర్ (టెక్నికల్ బ్రాంచ్) అర్హులు.

అర్హతలు:ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్, హైడ్రో క్యాడర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
-విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/ బీటెక్ (కంప్యూటర్ సైన్స్, ఐటీ/కంప్యూటర్ ఇంజినీరింగ్), బీఎస్సీ (ఐటీ),ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్), బీసీఏ/ ఎంసీఏలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.టెక్నికల్ బ్రాంచ్ (జనరల్ సర్వీస్, సబ్‌మెరైన్, నేవల్ ఆర్కిటెక్చర్)

విద్యార్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఈ/బీటెక్ (మెకానికల్, మెరైన్, ఆటోమోటివ్, మెకట్రానిక్స్, ఇండస్ట్రియల్ అండ్ ప్రొడక్షన్, ఏరోనాటికల్/ఏరోస్పేస్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్‌స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్, పవర్ ఇంజినీరింగ్, కంట్రోల్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ అండ్ మేనేజ్‌మెంట్, ప్రొడక్షన్ ఇంజినీరింగ్, సివిల్, నేవల్ ఆర్కిటెక్చర్, పవర్ ఇంజినీరింగ్), బీఎస్ మెరైన్ ఇంజినీరింగ్‌లో 60 శాతం (సబ్‌మెరైన్ బ్రాంచ్ 55శాతం) మార్కులతో ఉత్తీర్ణత.

వయస్సు: 19 1/2 నుంచి 25 ఏండ్లు (1992 జూలై 2 నుంచి 1998 జనవరి1 మధ్య జన్మించి ఉండాలి)
శారీరక ప్రమాణాలు: -పురుషులు-157 సెం.మీ.,మహిళలు-162.5 సెం.మీ. ఎత్తును కలిగి ఉండాలి
-ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. ఇండియన్ నేవీ నిర్దేశించిన కంటి చూపు, ఇతర వైద్య ప్రమాణాలు ఉండాలి.
పదోన్నతి: సబ్ లెప్టినెంట్ - లెప్టినెంట్ - లెప్టినెంట్ కమాండర్ - కమాండర్ హోదా వరకు పదోన్నతి పొందవచ్చు.
-పే స్కేల్: రూ. 15, 600-39,100 (పే బాండ్3) + గ్రేడ్ పే రూ. 5,400+ ఎంఎస్‌పీ రూ. 6000/-
-కంపెనీ/సంస్థ సబ్ లెప్టినెంట్‌గా ఎంపికైన అభ్యర్థులకు రూ. 74,100-90,600/-వరకు నెల జీతం ఉంటుంది
ఎంపిక విధానం: షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ కోర్సు ప్రవేశానికి అర్హులైన అభ్యర్థులను నేవల్ క్యాంపస్ సెలక్షన్ టీం ఎంపిక చేస్తుంది.
-పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా సర్వీసెస్ సెలక్షన్ బోర్డు అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తుంది. ఆ తర్వాత వారిని ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
-ఎస్‌ఎస్‌బీ షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు రెండు దశల్లో ఎంపిక ప్రక్రియను చేపడుతారు.
-షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు 2016 నవంబర్ నుంచి 2017 మార్చి మధ్య బెంగళూరు, భోపాల్, కోయంబత్తూరు, విశాఖపట్నంలలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.
ఇంటర్వ్యూల్లో మొదటి స్టేజీలో ఆఫీసర్ ఇంటెలిజెన్స్ టెస్ట్, పిక్చర్ పర్‌సెప్షన్, డిస్కషన్ టెస్ట్ ఇంటర్వ్యూలను మొదటిరోజు నిర్వహిస్తారు. తర్వాత రెండో దశలో వీరికి సైకలాజికల్ టెస్ట్, గ్రూప్ టెస్టింగ్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూలను మొత్తం ఐదురోజులపాటు నిర్వహిస్తారు.
-ఎస్‌ఎస్‌బీ మెడికల్ ఫిట్ అయిన అభ్యర్థుల జాబితాను ఖాళీల సంఖ్యను బట్టి ప్రకటిస్తుంది.
శిక్షణ: నేవీ ఎగ్జిక్యూటివ్/టెక్నికల్ బ్రాంచ్- షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్ కోర్సును కేరళ, ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో జూన్ 2017 నుంచి శిక్షణను ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో ఈ అప్లికేషన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలి.
-ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాపీ ప్రింట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని సెల్ఫ్ అటెస్ట్‌డ్ ఫొటో కాపీలను, సెల్ఫ్ అటెస్ట్‌డ్ టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్స్, ఇతర అర్హత సర్టిఫికెట్స్‌ను జతచేసి కేవలం స్పీడ్ పోస్ట్/కొరియర్ లో కింది చిరునామాకు పంపాలి.
చిరునామా: POST BAG NO. 04, CHANAKYA PURI POST OFFICE, NEW DELHI - 110021
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: సెప్టెంబర్ 3
-దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 13
-వెబ్‌సైట్: WWW.JOININDIANNAVY.GOV.IN

సీఐఎంఏపీలో టెక్నీషియన్స్,
సీఎస్‌ఐఆర్ - సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ (సీఐఎంఏపీ) ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
సీఐఎంఏపీ అనేది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎఎస్‌ఆర్‌ఐ) పరిధిలో పనిచేస్తున్న సంస్థ టెక్నీషియన్ పోస్టుల సంఖ్య - 7
విభాగాలు:
ఎలక్ట్రికల్, ట్రాక్టర్ డ్రైవర్, కార్పెంటర్, లైబ్రరీ సైన్స్
వయస్సు:
2016 సెప్టెంబర్ 20 నాటికి 28 ఏండ్లకు మించరాదు
-పే స్కేల్:
రూ. 5200-20200+గ్రేడ్ పే రూ. 1900/-
అర్హత:
గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణత.
-అప్లికేషన్ ఫీజు:
రూ.100/-
ఎంపిక:
రాతపరీక్ష/ఇంటర్వ్యూ ద్వారా
-దరఖాస్తు:
ఆన్‌లైన్ ద్వారా. ఆన్‌లైన్ దరఖాస్తులను పంపిన తర్వాత ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను డౌన్‌లోడ్ చేసుకొని సంబంధిత సెల్ఫ్ అటెస్టెడ్ కాపీలు, బ్యాంక్ చలానా, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా:
CONTROLLER OF ADMINISTRATION, CSIR-CENTRAL INSTITUTE OF MEDICINAL
AND AROMATIC PLANTS, POST OFFICE- CIMAP, LUCKNOW-226015
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ:
సెప్టెంబర్ 9
-ఫీజు చెల్లింపు చివరి తేదీ:
సెప్టెంబర్ 15
-ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ:
సెప్టెంబర్ 20
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ:
సెప్టెంబర్ 20
-వెబ్‌సైట్ :
WWW.CIMAP.RES.IN


ఎల్‌డీసీ పోస్టులు
-చెన్నై అవడిలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో కింది ఖాళీల భర్తీకి రక్షణ శాఖ ప్రకటన జారీ చేసింది.
వివరాలు:
ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ రక్షణ శాఖ పరిధిలో పనిచేస్తుంది.
ఎల్‌డీసీ
-పోస్టుల సంఖ్య -3
ఫైర్‌మ్యాన్
- పోస్టుల సంఖ్య 3
సీఎండీ (ఓజీ)
-పోస్టుల సంఖ్య - 2
-పేస్కేల్:
పై మూడు పోస్టులకు రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 1,900/-
-దరఖాస్తు:
నిర్ణీత నమూనాలో
చివరితేదీ:
ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 21 రోజుల్లో దరఖాస్తు దాఖలు చేయాలి. ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ఆగస్టు 13 - 19 ఇష్యూలో ఈ ప్రకటన వెలువడింది.
-వెబ్‌సైట్:
WWW.INDIANARMY.NIC.IN

లైబ్రేరియన్ పోస్టులు
బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ (ఐఐఎస్సీ)లో లైబ్రెరీయన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: లైబ్రెరీయన్ - 1, డిప్యూటీ లైబ్రేరియన్ - 1, అసిస్టెంట్ లైబ్రేరియన్ - 2 (దీనిలో ఒక పోస్టు పీహెచ్‌సీకి కేటాయించారు) ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: కనీసం 55 శాతం మార్కులతో లైబ్రేరి సైన్స్‌లో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంఫిల్ లేదా పీహెచ్‌డీ చేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారు. మూడు పోస్టులకు అనుభవం తప్పనిసరి. వీటిలో కొన్ని పోస్టులను డిప్యూటేషన్ మీద, మిగిలినవి రెగ్యులర్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
-చివరితేదీ: సెప్టెంబర్ 10
-వెబ్‌సైట్: WWW.IISC.ERNET.IN
Oil
ఆయిల్ ఇండియా..
-ఆయిల్ ఇండియా లిమిటెడ్ కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: ఆయిల్ ఇండియా భారత ప్రభుత్వ రంగ సంస్థ. ఇది నవరత్న కంపెనీ.
-మెడికల్ స్పెషలిస్ట్ (ఫిజీషియన్) - 1
-రేడియాలజిస్ట్ - 1
-దరఖాస్తు: వెబ్‌సైట్‌లో చూడవచ్చు
-చివరితేదీ: ఆగస్టు 25
-వెబ్‌సైట్: WWW.OIL-INDIA.COM



0 comments:

Post a Comment