Tuesday, 16 August 2016

BSF inspector , constables jobs , CSIR- UGC - NET in December / 2016 , ISB PGP- Pro Management Admissions , Osmania distance learning courses Admissions . బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు, సీఎస్‌ఐఆర్-యూజీసీ-నెట్ డిసెంబర్/2016, ఐఎస్‌బీలో పీజీపీ-ప్రొ మేనేజ్‌మెంట్‌లో అడ్మిషన్స్, ఉస్మానియా దూరవిద్య కోర్సులు,

బీఎస్‌ఎఫ్‌లో ఎస్‌ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలు,

మినిస్ట్రీ ఆఫ్ హోం అఫైర్స్ పరిధిలో పనిచేస్తున్న డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) వాటర్ వింగ్ గ్రూప్ బీ అండ్ సీలోని యుద్ధక్షేత్ర విభాగాల్లో ఖాళీగా ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్, హెడ్ కానిస్టేబుల్/ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు:
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ భారతదేశ ఐదు సాయుధ పోలీస్ దళాల్లో ఒకటి. దీన్ని డిసెంబర్ 1, 1965న ఏర్పాటు చేశారు
కానిస్టేబుల్/సబ్ ఇన్‌స్పెక్టర్‌లు

-మొత్తం పోస్టుల సంఖ్య:
176 (జనరల్-75, ఓబీసీ-46, ఎస్సీ-24, ఎస్టీ-31)
-సబ్ ఇన్‌స్పెక్టర్ (మాస్టర్)-7 పోస్టులు (జనరల్-6, ఎస్టీ-1)
-సబ్ ఇన్‌స్పెక్టర్ (ఇంజిన్ డ్రైవర్)-9 పోస్టులు (జనరల్-4, ఓబీసీ-3, ఎస్సీ-1, ఎస్టీ-1)
అర్హత:
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10+2/ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సెంట్రల్ లేదా స్టేట్ ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ/మర్చంటైల్ మెరైన్ డిపార్ట్‌మెంట్‌చే మాస్టర్/ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి
వయస్సు:
22 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి
-పే స్కేల్:
రూ. 9,300-34,800 + గ్రేడ్ పే రూ. 4,200/-
-హెడ్ కానిస్టేబుల్ (మాస్టర్)-62 పోస్టులు
(జనరల్-26, ఓబీసీ-19, ఎస్సీ-10, ఎస్టీ-7)
-హెడ్ కానిస్టేబుల్ (ఇంజిన్ డ్రైవర్)-65 పోస్టులు
(జనరల్-26, ఓబీసీ-23, ఎస్సీ-9, ఎస్టీ-7)
-హెడ్ కానిస్టేబుల్ (వర్క్‌షాప్)-1 పోస్టు (ఎస్సీ)
అర్హత:
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సిరంగ్, ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి. వర్క్‌షాప్ పోస్టుకు ఇండస్ట్రియల్ ట్రెయినింగ్ సంస్థ నుంచి డిప్లొమా (మోటార్ మెకానిక్, మెషినిస్ట్, వెల్డర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఎయిర్ కండీషనర్, ప్లంబింగ్)లో ఉత్తీర్ణత
వయస్సు:
20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి
-పే స్కేల్:
రూ. 5,200-20,200 + గ్రేడ్ పే రూ. 2,400/-
-కానిస్టేబుల్ (క్య్రూ)-32 పోస్టులు (జనరల్-13, ఓబీసీ-1, ఎస్సీ-3, ఎస్టీ-15)
అర్హత:
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. బోట్ ఆపరేటింగ్‌లో ఏడాదిపాటు అనుభవం ఉండాలి. స్విమ్మింగ్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి
వయస్సు:
20 నుంచి 25 ఏండ్ల మధ్య ఉండాలి
-పే స్కేల్:
రూ. 5,200-20,200 +
గ్రేడ్ పే రూ. 2,000/-
-అప్లికేషన్ ఫీజు:
రూ. 50/-
ఎంపిక:
రాత పరీక్ష, పీఎస్‌టీ/పీఈటీ ద్వారా
-దరఖాస్తు:
ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను నింపి, సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
-చివరి తేదీ:
సెప్టెంబర్ 12
-వెబ్‌సైట్:
HTTP://BSF.NIC.IN


సీఎస్‌ఐఆర్-యూజీసీ-నెట్ డిసెంబర్/2016,
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ ( సీఎస్‌ఐఆర్) సైన్స్ సబ్జెక్ట్‌ల్లో బోధన, పరిశోధన చేయడానికి నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)-డిసెంబర్ 2016 ప్రకటనను విడుదల చేసింది.
వివరాలు: దేశంలోని యూనివర్సిటీల్లో, అనుబంధ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేయడానికి, పరిశోధనలు చేసేందుకు ఈ ప్రవేశ పరీక్ష ద్వారా అర్హత కల్పిస్తున్నది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏడాదికి రెండుసార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది.
జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్‌ఎఫ్), లెక్చరర్‌షిప్
-సీఎస్‌ఐఆర్ యూజీసీ నెట్-డిసెంబర్/2016 సైన్స్ సబ్జెక్ట్‌ల్లోని ఈ కింది వాటిలో పరీక్షను నిర్వహిస్తుంది
-కెమికల్ సైన్సెస్
-ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషియన్ ప్లానెటరీ సైన్సెస్
-లైఫ్ సైన్సెస్
-మ్యాథమెటికల్ సైన్సెస్
-ఫిజికల్ సైన్సెస్
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో సంబంధిత సైన్స్ సబ్జెక్ట్‌లతో ఎమ్మెస్సీ ఉత్తీర్ణులై ఉండాలి (ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు 50 శాతం) . చివరి ఏడాది మాస్టర్ డిగ్రీ పరీక్షలు రాస్తున్న అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఎమ్మెస్సీగా ఎన్‌రోల్ చేసుకొన్న అభ్యర్థులు డిగ్రీ స్థాయి వరకు 10+2+3 విధానంలో విద్యను పూర్తిచేసి ఉండాలి.
వయస్సు: 2016 జూలై 1 నాటికి జేఆర్‌ఎఫ్‌కు 28 ఏండ్లకు మించరాదు. లెక్చరర్‌షిప్‌కు వయోపరిమితి లేదు.
-ఎగ్జామినేషన్ ఫీజు: జనరల్ అభ్యర్థులు-రూ. 1000/-, ఓబీసీ అభ్యర్థులు-రూ. 500/-, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ అభ్యర్థులు రూ. 250/-
ఎంపిక: రాత పరీక్ష
-రాత పరీక్ష మల్టిపుల్ చాయిస్‌లో 200 మార్కులకు ఉంటుంది.
-180 నిమిషాల్లో పూర్తి చేయాలి.
పరీక్ష కేంద్రాలు: దేశవ్యాప్తంగా.. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, గుంటూరుతో సహా మొత్తం 27 సెంటర్లలో పరీక్షను నిర్వహిస్తారు
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ప్రారంభ తేదీ: ఆగస్టు 16
-ఎగ్జామినేషన్ ఫీజును చెల్లించడానికి చివరితేదీ: సెప్టెంబర్ 8
-ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: సెప్టెంబర్ 9
-ఆన్‌లైన్ హార్డ్‌కాపీలను పంపడానికి చివరి తేదీ: సెప్టెంబర్ 16
-అప్లికేషన్ ఫామ్‌లో తప్పు ఒప్పుల సవరణ : అక్టోబర్ 14
-రాత పరీక్ష : డిసెంబర్ 18
-వెబ్ సైట్ : WWW. CSIRHRDG.RES.IN


ఐఎస్‌బీలో పీజీపీ-ప్రొ మేనేజ్‌మెంట్‌లో అడ్మిషన్స్,
హైదరాబాద్‌లోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) పోస్టు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ (పీజీపీ-ప్రొ మేనేజ్‌మెంట్) కోర్సులో ప్రవేశాలకు అర్హులైన వర్కింగ్ ప్రొఫెషనల్స్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పీజీపీ-ప్రొ మేనేజ్‌మెంట్ 8కోర్సు వ్యవధి: 16 నెలలు
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత వ్యాపార ఎగ్జిక్యూటివ్ రంగంలో 5 నుంచి 12 ఏండ్ల అనుభవం ఉండాలి.
ఎంపిక: గ్రూప్ డిస్కషన్/పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా.
-దరఖాస్తు: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా
పూర్తి వివరాలకు ఫోన్ నంబర్ : 9133444283, 9133444285 లేదా ఈ మెయిల్ PGPPRO@ISB.EDU ద్వారా సంప్రదించవచ్చు.
చిరునామా: INDIAN SCHOOL OF BUSINESS, GACHIBOWLI,
HYDERABAD, TELANGANA-500032
-వెబ్‌సైట్ : WWW.ISB.EDU/PGPPRO

ఉస్మానియా దూరవిద్య కోర్సులు,


ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ప్రొ.జి రాంరెడ్డి సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: దూరవిద్యా విధానంలో కోర్సులు
-యూజీ: బీఏ, బీకాం, బీబీఏ
-పీజీ: ఎమ్మెస్సీ (మ్యాథ్స్, స్టాటిస్టిక్స్), ఎంకాం, ఎంఏ, ఎంబీఏ, ఎంసీఏ
-పీజీ డిప్లొమా కోర్సులు: మ్యాథ్స్, ఇంగ్లిస్, బిజినెస్ మేనేజ్‌మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్, బయో ఇన్ఫర్మాటిక్స్
అర్హతలు: డిగ్రీ కోర్సులకు ఇంటర్. పీజీ కోర్సులకు డిగ్రీ ఉత్తీర్ణత.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా డిసెన్స్ ఎడ్యుకేషన్ కార్యాలయం లేదా స్టడీ సెంటర్స్‌లో లభిస్తాయి.
-చివరితేదీ: అక్టోబర్ 10
-వెబ్‌సైట్: HTTP://WWW.OUCDE.NET

0 comments:

Post a Comment