Thursday, 2 June 2016

Who is the first minister Defence Minister? Tspsc Preparation నెహ్రూ ప్రథమ మంత్రి మండలిలో రక్షణ శాఖ మంత్రి?

1. ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంట్‌కు ఉన్నప్పటికీ ఆ పరిమితులను సహేతుకంగా పరిశీలించే అధికారం న్యాయస్థానాలదే. అంతేకాకుండా రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతం ప్రకారం పార్లమెంట్ చేసే రాజ్యాంగ సవరణ కూడా పరిశీలించే అధికారం కోర్టుకు ఉందని సుప్రీంకోర్టు ఏ కేసులో పేర్కొంది?
1) మినర్వామిల్స్ కేసు 2) గోలక్‌నాథ్ కేసు
3) కేశవానంద భారతీ కేసు 4) 2, 3

2. ఏ అధికరణం ప్రకారం రాష్ట్ర జాబితాపై చట్టం చేయాలంటే అ తీర్మానాన్ని రాజ్యసభలో మాత్రమే ప్రవేశపెట్టాలి? జాతీయ ప్రయోజనాల దృష్ట్యా రాజ్యసభ రాష్ట్ర జాబితాలోని అంశంపై చట్టం చేస్తుంది.
1) 6వ 2) 312వ 3) 249వ 4) 250వ

3. భారతదేశంలో 1959లో మొదటిసారిగా లోక్‌పాల్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినవారు?
1) జవహర్‌లాల్ నెహ్రూ 2) బీఆర్ అంబేద్కర్
3) సీడీ దేశ్‌ముఖ్ 4) సర్దార్ వల్లభాయ్ పటేల్

4. పార్లమెంట్‌లో ఉపయోగించే భాష హిందీ కానీ, ఇంగ్లిష్ కానీ అయి ఉండాలని తెలిపే అధికరణం?
1) 120వ 2) 121వ 3) 210వ 4) 343వ

5. ప్రవేశికలు రాజ్యాంగానికి ఆత్మ, హృదయం, ఒక ఆభరణమని వర్ణించినవారు?
1) బీఆర్ అంబేద్కర్ 2) బాబు రాజేంద్రప్రసాద్
3) 1, 2 4) పండిట్ ఠాకూర్‌దాస్ భార్గవ

6. రాజ్యాంగ ప్రవేశిక (పీఠిక)లో గల సరైన పదాలు..
1) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, గణతంత్ర రాజ్యం
2) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం
3) సార్వభౌమాధికార, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య రాజ్యం
4) సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యం

7. బ్రిటిష్ ప్రభుత్వం భారతీయులకు విద్య గురించి ఒక లక్ష రూపాయలు ఖర్చు చేయాలని ఈస్టిండియా కంపెనీని ఆదేశించిన చట్టం?
1) చార్టర్ చట్టం-1813 2) చార్టర్ చట్టం-1833
3) చార్టర్ చట్టం-1953 4) పిట్స్ ఇండియా చట్టం-1784

8. 1946, డిసెంబర్ 9న జరిగిన మొదటి రాజ్యాంగ పరిషత్ సమావేశానికి హాజరైన సభ్యుల సంఖ్య?
1) 209 2) 211 3) 219 4) 229

9. నెహ్రూ ప్రవేశపెట్టిన లక్ష్యాల, ఆశయాల తీర్మానాన్ని భారతీయుల రాజకీయ చక్రమని వర్ణించిన వారు?
1) కేఎం మున్షీ 2) కేటీ షా 3) కామత్ 4) ఐవర్ జెన్నింగ్స్

10. దేశంలో తొలి మహిళా కేబినెట్ మంత్రి రాజ్‌కుమారి అమృత్‌కౌర్ నిర్వహించిన శాఖ?
1) న్యాయశాఖ 2) ఆర్థికశాఖ 3) విదేశాంగ శాఖ 4) ఆరోగ్యశాఖ

11. భారత స్వాతంత్య్ర చట్టం-1947కు సంబంధించి సరికాని అంశం?
1) లార్డ్‌మౌంట్ బాటన్ ప్రణాళిక అనికూడా అంటారు
2) 1947, జూలై 18న బ్రిటిష్ రాజ్య ఆమోదముద్ర లభించింది
3) దేశ విభజనను మహాత్మాగాంధీ తీవ్రంగా వ్యతిరేకించారు
4) పాకిస్థాన్‌ను ముస్లిం రాజ్యంగా ఏర్పాటు చేయడానికి మహ్మద్ అలీ జిన్నా వ్యతిరేకించాడు

12. బానిసత్వానికి ఒక నూతన చట్టం, భారతదేశంపై బలవంతంగా రుద్దిన, జవహర్‌లాల్ నెహ్రూ తీవ్రంగా వ్యతిరేకించిన చట్టం ఏది?
1) 1833 చార్టర్ చట్టం 2) ఇండియన్ కౌన్సిల్‌చట్టం-1892
3) భారత ప్రభుత్వ చట్టం-1919 4) భారత ప్రభుత్వ చట్టం-1935

13. కింది వాటిలో సరికానిది గుర్తించండి.
1) లార్డ్ మేయో తీర్మానం-1870 2) లార్డ్ రిప్పన్ తీర్మానం-1882
3) ప్రత్యేక చార్టర్ చట్టం-1720 4) రాయల్ కమిషన్-1909

14. భారత రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం అని, ఇది ఐరావతం అని చమత్కరించినవారు?
1) ఆస్టిన్ 2) హెచ్‌వీ కామత్ 3) సైమన్ 4) ఐవర్ జెన్నింగ్

15. రాజ్యాంగం వైఫల్యం చెందితే రాజ్యాంగాన్ని నిందించరాదు. దాన్ని అమలుపరిచే వారిని నిందించాలని సూచించివారు?
1) బాబు రాజేంద్రప్రసాద్ 2) బీఆర్ అంబేద్కర్
3) మహాత్మాగాంధీ 4) జయప్రకాశ్ నారాయణ్

16. కింది వాటిలో సరైనవాటిని గుర్తించండి
ఎ) దేశానికి ప్రత్యేక రాజ్యాంగం కావాలని మొదట డిమాండ్ చేసినవారు-ఎంఎన్ రాయ్
బి) మన దేశానికి సంబంధించి మొదటి లిఖిత చట్టం-1773 రెగ్యులేటింగ్ చట్టం
సి) 1774లో కలకత్తాలో ఏర్పాటు చేసిన సుప్రీంకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తి- హెలిజా హంపే
డి) కేంద్ర బడ్జెట్ నుంచి రాష్ట్ర బడ్జెట్‌ను 1919 చట్టం ద్వారా వేరుచేశారు.

1) ఎ, సి 2) ఎ, డి 3) ఎ, బి, సి 4) పైవన్నీ సరైనవే

17. కిందివాటిలో తప్పుగా ఉన్నదాన్ని గుర్తించండి.
1) మొదటిసారిగా లోక్‌సభ 1970, డిసెంబర్ 27న రద్దయింది
2) నాలుగో లోక్‌సభ కొనసాగుతున్న కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ అదేశాల మేరకు రద్దు చేశారు
3) నాలుగో లోక్‌సభ రద్దుకాలంలో రాష్ట్రపతిగా వీవీ గిరి ఉన్నారు
4) నాలుగో లోక్‌సభను రాష్ట్రపతి జాకీర్ హుస్సేన్ రద్దు చేశారు

18. వరకట్న నిషేధ బిల్లుపై పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని మొదటిసారిగా ఎప్పుడు ఏర్పాటు చేశారు?
1) మే 4, 1961 2) మే 5, 1961
3) మే 6, 1961 4) మే 7, 1961

19. 1947లో నెహ్రూ ప్రథమ మంత్రి మండలిలో రక్షణ శాఖ మంత్రిగా పనిచేసినవారు?
1) షన్ముఖచెట్టి 2) సర్దార్ బల్దేవ్‌సింగ్
3) జాన్ యథాయ్ 4) మౌలానా అబుల్ కలాం ఆజాద్

ప్రతిభకు పరీక్ష
1. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉదయ్ (ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన) పథకానికి సంబంధించి సరైనది ఏది?
1) గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు 24 గంటల విద్యుత్ సరఫరా
2) గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేద రైతులకు విద్యుత్ సౌకర్యం
3) దేశంలోని అన్ని గ్రామాలకు విద్యుద్దీకరణ కల్పించుట
4) విద్యుత్ పంపిణీ సంస్థల కార్యకలాపాలకు మెరుగైన వసతుల ఏర్పాటు

line
2. కింది వాటిలో సరైనది ఏది?
1) పట్టణ ప్రాంతాల్లోని ఐపీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ పవర్ డెవలప్‌మెంట్ పథకం), గ్రామీణ ప్రాంతాల్లో డీడీయూజీజేవై (దీన్‌దయాళ్ ఉపాధ్యాయ గ్రామ జ్యోతియోజన)ల ద్వారా పంపిణీ వ్యవస్థతో పాటు సమానస్థాయిలో పెంపుదల
2) డొమెస్టిక్ ఎఫిషియెంట్ లైటింగ్ ప్రోగ్రాం (డీఈఎల్‌పీ) ద్వారా గృహాలు, వీధి దీపాలకు ఎల్‌ఈడీ బల్బులను అందించుట
3) రెండూ సరైనవే
4) ఏదీ సరికాదు

3. ప్రపంచ నీటి దినోత్సవం -2016 థీమ్ ఏమిటి?
1) ప్రపంచంలోనీ నీరు: సరిపోతుందా? 2) నీరు, సంస్కృతి
3) బెటర్ వాటర్, బెటర్ జాబ్స్ 4) శుభ్రమైన నీరు, యుద్ధం

4. మానవాభివృద్ధి సూచికను లెక్కించే అంశాలేవి?
1) హెచ్‌పీఐ-1 2) హెచ్‌పీఐ-2 3) జీఈఎం
4) జీడీఐ 5) హెచ్‌డీఐ
1) 1, 2, 3 2) 1, 4, 5 3) 3, 4
4) పైవన్నీ సరైనవే

line1
5. PAHAL (పహల్) DBTL పథకానికి సంబంధించి సరైనవి గుర్తించండి.
1) పహల్ యోజన ప్రత్యక్ష బదిలీ పథకం ఎల్‌పీజీ గ్యాస్ వినియోగదారులకు సంబంధించింది
2) ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లను అత్యధిక రేటుకు విక్రయించంపై నియంత్రణ
3) ప్రపంచంలోనే భారీ స్థాయిలో సబ్సిడీపై అందించే నగదు బదిలీ పథకం
1) 1 2) 1, 2 3) 1, 3 4) పైవన్నీ సరైనవే

0 comments:

Post a Comment