Thursday, 9 June 2016

What is the average crop density greater than the density of the district రాష్ట్ర సగటు పంటల సాంద్రత కంటే ఎక్కువ సాంద్రతగల జిల్లా ఏది

1. రాష్ట్ర సగటు పంటల సాంద్రత కంటే ఎక్కువ సాంద్రతగల జిల్లా ఏది?
1) నల్లగొండ 2) ఖమ్మం
3) మహబూబ్‌నగర్ 4) వరంగల్

2. కింది వాటిలో సరైనవి ఏవి?
ఎ. రాష్ట్రంలో ఎక్కువ సేద్య విస్తీర్ణం కలిగిన భూ కమతాలు చిన్న కమతాల రకానికి చెందినవి
బి. 2010-11 నాటికి తెలంగాణలో సగటు కమతాల పరిమాణం 1.11గా నమోదైంది
సి. రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం తక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్
డి. రాష్ట్రంలో సగటు కమతాల పరిమాణం ఎక్కువగా ఉన్న జిల్లా ఆదిలాబాద్
1) ఎ, బి, డి 2) బి, సి, డి 3) ఎ, బి, సి, డి 4) బి, డి

3. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. రాష్ట్ర సగటు కమతాల పరిమాణం దేశ సగటు కమతాల పరిమాణం కంటే ఎక్కువ
బి. దేశంలో ఎక్కువ శాతం ఉపాంత రైతులే ఉన్నారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

4. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాల కంటే నైరుతి రుతుపవనాలతోనే వర్షపాతం ఎక్కువగా నమోదవుతుంది
బి. రాష్ట్ర సాధారణ సగటు వర్షపాతం 906 లీటర్లు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

5. మిషన్ కాకతీయకు సంబంధించి సరైన అంశాలను గుర్తించండి.
ఎ. రాబోయే సంవత్సరాల్లో 20 వేల కోట్ల అంచనాతో దాదాపు 260 టీఎంసీల నీటిని చెరువుల ద్వారా నిల్వచేసి, 25 లక్షల హెక్టార్ల భూమికి సాగునీటి సౌకర్యం కల్పించడమే మిషన్ కాకతీయ లక్ష్యం
బి. 2013-14 నుంచి 1/5వ వంతు చొప్పున 46,531 చెరువులను పునరుద్ధరించి గత వైభవాన్ని తీసుకురావడం
సి. మిషన్ కాకతీయకు మరోపేరు మన చెరువు - మన ఊరు
డి. 1960లో మొత్తం సేద్యపు భూమిలో 60 శాతం చెరువుల ద్వారానే సేద్యం అయ్యేది
1) ఎ, బి, సి 2) బి, సి 3) ఎ, డి 4) ఎ, బి, సి, డి

6. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. రాష్ట్రంలో బోరుబావులు అత్యధికంగా కలిగిన జిల్లా ఆదిలాబాద్, అత్యల్పంగా ఉన్న జిల్లా మహబూబ్‌నగర్
బి. ఉపరితల బావులు ఎక్కువగా ఉన్న జిల్లా కరీంనగర్, తక్కువగా ఉన్న జిల్లా వరంగల్
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

7. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) బావులు > చెరువులు > కాలువలు > ఇతరాలు
2) బావులు < కాలువలు < చెరువులు < ఇతరాలు
3) బావులు > ఇతరాలు < కాలువలు < చెరువులు
4) బావులు > కాలువలు > చెరువులు > ఇతరాలు

8. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. దేశ జనాభాలో వ్యవసాయరంగంపై ఆధారపడే వారికంటే, రాష్ట్ర జనాభాలో వ్యవసాయరంగంపై ఆధారపడే వారి శాతం అధికం
బి. రాష్ట్రంలో వ్యవసాయరంగంపై ఆధారపడేవారి సంఖ్య క్రమంగా క్షీణిస్తూ, దేశంలో వ్యవసాయరంగంపై ఆధారపడే వారి సంఖ్య కంటే తగ్గింది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

9. తెలంగాణ వ్యవసాయ మండళ్లకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.
ఎ. ఉత్తర తెలంగాణ మండలం: నిజామాబాద్, ఆదిలాబాద్,కరీంనగర్
బి. దక్షిణ తెలంగాణ మండలం: వరంగల్, నల్లగొండ, రంగారెడ్డి
సి. కేంద్రీయ తెలంగాణ మండలం: ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్
డి. ఎక్కువ ఎత్తులో ఉన్న గిరిజన ప్రాంతాల మండలం:ఖమ్మం, ఆదిలాబాద్
1) ఎ, డి 2) ఎ, బి, సి 3) బి, సి 4) ఎ, బి, సి, డి

10. సరైనది గుర్తించండి.
ఎ. తెలంగాణ రాష్ట్రం కూరగాయల పెంపకంలో 220 హెక్టార్లతో దేశంలోనే 3వ స్థానంలో ఉంది
బి. పండ్ల ఉత్పత్తి విస్తీర్ణం దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే 2వ స్థానంలో ఉంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

11. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. 1 నుంచి 2 ఎకరాల భూ కమతాన్ని చిన్న కమతంగా పరిగణిస్తారు
బి. 4 నుంచి 10 ఎకరాల భూ కమతాన్ని మధ్యతరహా కమతంగా పరిగణిస్తారు
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

12. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. నీటి పారుదల సాంద్రత గరిష్టంగా నమోదైన జిల్లా నిజామాబాద్ కాగా, అతి తక్కువగా నమోదైన జిల్లా కరీంనగర్
బి. రాష్ట్రంలో స్థూల సేద్యభూమి 55 శాతంగా నమోదైంది
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

13. పంటల సాంద్రతను ఏ విధంగా గణిస్తారు?
1) నికర పంట భూమికి, స్థూల పంట భూమికి మధ్య నిష్పత్తి
2) నికర పంట భూమికి, మొత్తం భూమికి మధ్యగల నిష్పత్తి
3) స్థూల పంట భూమికి, నికర పంట భూమికి మధ్య నిష్పత్తి
4) మొత్తం భూ విస్తీర్ణానికి, నికర పంటభూమికి మధ్య నిష్పత్తి

14. ప్రస్తుత సంవత్సరం సాగుచేయకుండా గత 5 సంవత్సరాల నుంచి సాగుచేయని భూములను ఏ రకమైనవిగా పేర్కొనవచ్చు?
1) శాశ్వత పచ్చిక బీళ్లు
2) బంజరు భూమి
3) సాగుకు పనికిరాని బీడు భూములు
4) సాగుకు పనికివచ్చే బంజరు భూమి

15. 5 ఏండ్ల కంటే తక్కువ కాలం నుంచి సేద్యం చేయకుండా ఉన్న భూములను ఏ రకమైన భూములుగా పేర్కొనవచ్చు?
1) సాగుకు పనికొచ్చే బంజరు భూమి
2) ఇతర బీడు భూములు
3) శాశ్వత పచ్చిక బీళ్లు
4) బంజరు భూమి

16. కింది వాటిలో సరైనదాన్ని గుర్తించండి.
ఎ. ఎక్కువ అటవీ విస్తీర్ణంగల జిల్లా ఖమ్మం కాగా, అతి తక్కువ అటవీ విస్తీర్ణ శాతంగల జిల్లా రంగారెడ్డి
బి. తెలంగాణలో అటవీ విస్తీర్ణ శాతం ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం కాగా, అత్యల్ప అటవీ విస్తీర్ణంగల జిల్లా నల్లగొండ
1) ఎ 2) బి 3) ఎ, బి 4) ఏదీకాదు

17. కింద పేర్కొనబడిన జిల్లాలను విస్తీర్ణం ప్రకారం గుర్తించండి.
ఎ. ఆదిలాబాద్ బి. మహబూబ్‌నగర్
సి. నిజామాబాద్ డి. రంగారెడ్డి
1) ఎ, బి, సి, డి 2) బి, డి, ఎ, సి
3) బి, సి, ఎ, డి 4) బి, సి, డి, ఎ

18. TMC అంటే?
1) THOUSAND MILLION CUSSECS = 108
2) THOUSAND MILLION CUBIC FEET = 109
3) THOUSAND METRIC CUSSECS = 109
4) THOUSAND METRIC CUBIC = 108

ప్రతిభకు పరీక్ష

1. సూరసేన మహాజనపద రాజధాని ఏది?
1) విరాఠనగరం 2) మధుర
3) తక్షశిల 4) కాశి

line1
2. ప్రపంచంలో మొదటిసారిగా ఆయిల్ పేయింటింగ్స్‌ను ఏ దేశంలో కనుగొన్నారు?
1) భారతదేశం 2) పాకిస్థాన్
3) ఆఫ్ఘనిస్థాన్ 4) ఇరాన్

3. కిందివాటిలో ఏ ప్రాంతంలో అతిపురాతన ప్రదేశమైన దేహ్ మోర్సాయ్ గుండాయ్ బయటపడింది?
1) ఉత్తర పాకిస్థాన్
2) తూర్పు పర్షియా
3) ఆధునిక టర్కీ
4) ఆఫ్ఘనిస్థాన్

line
4. సున్నపురాతి యుగంలో వివిధ రకాల ఆహార ధాన్యాలు పెద్దమొత్తంలో ఎక్కడ లభించాయి?
1) నవ్డాటోలి 2) గిలున్డ్
3) ఆదమ్‌గఢ్ 4) బన్హాలీ

5. కింది వాటిలో సరైనది గుర్తించండి.
ఎ. మొదటి మానవ జాతి ఆస్ట్రాలో పితికస్ జాతిని పోలిఉంది
బి. మొదటి మానవ జాతి హీడెల్బర్గెన్సిస్
1) ఎ మాత్రమే 2) బి మాత్రమే
3) రెండూ సరైనవే 4) ఏదీకాదు

6. పత్తిని పండించినట్లు మొదటిసారిగా ఆధారాలు లభించిన ప్రాంతం ఏది?
1) పిక్లిహల్ 2) హతోనోరా
3) నల్ 4) ఘలిగాయ్

0 comments:

Post a Comment