Friday, 10 June 2016

Western Coal Fields 50 surveyors jobs , NTPC artisiyan Trainees Recruitment వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్‌లో 50 సర్వేయర్స్ ఉద్యోగాలు , ఎన్టీపీసీలో ఆర్టీషియన్ ట్రెయినీలు

కోల్ ఇండియా లిమిటెడ్ పరిధిలోని పనిచేస్తున్న వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (డబ్ల్యూసీఎల్)లో ఖాళీగా ఉన్న సర్వేయర్ (మైనింగ్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ (నాగ్‌పూర్) కోల్ ఇండియా లిమిటెడ్‌లోని ఎనిమిది సంస్థల్లో ఒక అనుబంధ సంస్థ. 1975లో ఏర్పాటైన డబ్ల్యూసీఎల్ 2007లో మినీరత్న హోదాను పొందింది.
మొత్తం పోస్టులు: 52 (జనరల్-28, ఓబీసీ-14, ఎస్సీ-7, ఎస్టీ-3)
అర్హత: మెట్రిక్యులేషన్/పదోతరగతితోపాటు డీజీఎమ్‌ఎస్ నుంచి సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత లేదా మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్‌లో డిప్లొమా, డీజీఎమ్‌ఎస్ నుంచి సర్వేయర్ కాంపిటెన్సీ సర్టిఫికెట్‌లో ఉత్తీర్ణత.
పే స్కేల్: రూ. 20,552+ఇతర అలవెన్స్‌లు కూడా ఉంటాయి
వయసు: 2016 మార్చి 1 నాటికి 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, ఎస్సీ, ఎస్సీ అభ్యర్థులకు ఐదేండ్లు వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది
అప్లికేషన్ ఫీజు: రూ. 100/- (ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు)
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
రాత పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది
రాత పరీక్షలో మొత్తం 100 ప్రశ్నలను రెండు గంటలల్లో పూర్తి చేయాలి.
ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో అర్హత మార్కులను సాధించాలి. జనరల్ అభ్యర్థులు 40 శాతం మార్కులు, ఓబీసీ అభ్యర్థులు 35 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 30 శాతం మార్కులను సాధించాలి.
కేవలం ఆబ్జెక్టివ్ రాత పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగానే ఎంపిక చేస్తారు
రాత పరీక్ష తేదీని సంబంధిత అభ్యర్థికి రిజిస్టర్డ్ పోస్ట్ తెలియజేస్తారు లేదా కంపెనీ వెబ్‌సైట్‌లో ఉంచుతారు
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకొని పూర్తిగా నింపి సంబంధిత అటెస్టెడ్ సర్టిఫికెట్లను జతపరిచి, దరఖాస్తులను రిక్రూట్‌మెంట్ పర్సనల్ అధికారికి పోస్ట్ ద్వారా పంపాలి.
చిరునామా GENERAL MANGER(P/IR),WESTERN COALFIELDS LIMITED,
COAL ESTATE, CIVIL LINES, NAGPUR-440001
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 24
వెబ్‌సైట్: WWW.WESTERNCOAL.GOV.IN
WesternCoalfields

ఎన్టీపీసీలో ఆర్టీషియన్ ట్రెయినీలు
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్టీపీసీ) ఐటీఐ అభ్యర్థులకు ఖాళీగా ఉన్న ఆర్టీషియన్ ట్రెయినీ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
ట్రెయినీ పోస్టుల సంఖ్య: 50 (ఫిట్టర్-18, ఎలక్ట్రీషియన్-21, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్-11)
అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్స్)లో ఉత్తీర్ణత
ఎంపిక విధానం: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్.
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరి తేదీ: జూలై 31
వెబ్‌సైట్: WWW.NTPC.CO.IN

0 comments:

Post a Comment