Sunday, 5 June 2016

Union Public Service Commission (UPSC ) the Employees' Provident Fund Organisation ( EPFO) Enforcement Officers / Ao jobs Notification యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్/ఏవో ఉద్యోగాలు

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్‌వో)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్/ఏవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది.
వివరాలు: ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కేంద్ర ప్రభుత్వ సంస్థ.
పోస్టులు: ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్స్/ అకౌంట్స్ ఆఫీసర్స్ ఇన్ ఎంప్లాయీస్
మొత్తం ఖాళీల సంఖ్య - 257. వీటిలో 21 పోస్టులు పీహెచ్‌సీ అభ్యర్థులకు కేటాయించారు.
పేస్కేల్: రూ. 9,300 - 34,800 + గ్రేడ్ పే రూ. 4,600/-
వయస్సు: 30 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అర్హతలు: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. లా/ఎంబీఏ, పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, సీఏ చదివిన వారికి ప్రాధాన్యతనిస్తారు.
విధులు: వర్క్ ఎన్‌ఫోర్స్‌మెంట్, రికవరీ, అకౌంట్స్, అడ్మినిస్ట్రేషన్ క్యాష్, లీగల్ పెన్షన్ అండ్ కంప్యూటర్, విచారణలు, నష్టపరిహారాల మదింపు, జనరల్ అడ్మినిస్ట్రేషన్ తదితరాలు ఉంటాయి.
భారతదేశంలో జమ్ముకశ్మీర్ తప్ప మిగిలిన ఏ ప్రదేశంలోనైనా ఉద్యోగ విధులు నిర్వహించాల్సి ఉంటుంది.
ప్రొబేషన్: రెండేండ్లు
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా
రాతపరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో పరీక్షను నిర్వహిస్తారు.
పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది
అన్ని ప్రశ్నలకు సమాన మార్కులు కేటాయిస్తారు.
ప్రతి తప్పు జవాబుకు 1/3 మార్కుల కోత విధిస్తారు.
రాత పరీక్ష సిలబస్: జనరల్ ఇంగ్లిష్ - అభ్యర్థులకు ఇంగ్లిష్ భాషలో ఉన్న జ్ఞానాన్ని పరిశీలిస్తారు. పదాలను ఉపయోగించే సామర్థ్యం.
భారత స్వాతంత్య్ర సంగ్రామం, కరెంట్ అఫైర్స్, డెవలప్‌మెంట్ ఇష్యూస్, ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ అండ్ లేబర్ లా, జనరల్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్ పై పరిజ్ఞానం, జనరల్ మెంటల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, సోషల్ సెక్యూరిటీ ఇన్ ఇండియా.
రాతపరీక్షలో క్వాలిఫై అయిన అభ్యర్థులను పోస్టుల సంఖ్యను బట్టి షార్ట్‌లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 23
ఆన్‌లైన్‌లో పూర్తిచేసిన దరఖాస్తు ప్రింట్‌ను సమర్పించడానికి చివరితేదీ: జూన్ 24
అప్లికేషన్ ఫీజు: రూ. 25/-
వెబ్‌సైట్: HTTP://WWW.UPSC.GOV.IN

0 comments:

Post a Comment