Wednesday, 1 June 2016

TS Eamcet- 2 notification , EPTRI entrance Notification, IIT Guwahati junior assistant jobs టీఎస్ ఎంసెట్ - 2 నోటిఫికేషన్ ,ఈపీటీఆర్‌ఐలో ప్రవేశాలు,ఐఐటీ గువాహటి జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

రాష్ట్రంలోని ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి టీఎస్ ఎంసెట్ - 2 నోటిఫికేషన్‌ను జేఎన్‌టీయూహెచ్ విడుదల చేసింది.
వివరాలు: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి ఎంసెట్- 2 (మెడికల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)ను నిర్వహిస్తున్నారు. ఎంట్రెన్స్‌టెస్ట్ ద్వారా ప్రభుత్వ కాలేజీల్లో సీట్లు, ప్రైవేట్ కాలేజీల్లో కన్వీనర్ సీట్లు భర్తీ చేస్తారు.
అర్హతలు: ఇంటర్ బైపీసీ లేదా తత్సమాన పరీక్షలో (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (బాటనీ/జువాలజీలో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి) ఉత్తీర్ణత.
-వయస్సు: 2016, డిసెంబర్ 31 నాటికి 17 ఏండ్లు నిండి ఉండాలి.
-ఎంపిక: ఎంసెట్ - 2లో వచ్చిన మార్కులకు 75 శాతం, ఇంటర్‌లో సంబంధిత గ్రూప్‌లో వచ్చిన మార్కులకు 25 శాతం వెయిటేజీని ఇచ్చి వాటి ప్రకారం ర్యాంకింగ్స్‌ను ఇస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో నేటి నుంచి
-చివరితేదీ: జూన్ 7
-పరీక్ష తేదీ: జూలై 9 (ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు)
-ఫీజు: ఎస్సీ, ఎస్టీలకు రూ. 250/-, ఇతరులకు రూ. 500/-
ఫీజును టీఎస్ ఆన్‌లైన్, మీసేవా, ఈసేవా కేంద్రాల ద్వారా చెల్లించవచ్చు.
-పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, జనగాం, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, సిద్దిపేట, వికారాబాద్, వనపర్తి, వరంగల్, హైదరాబాద్
-వెబ్‌సైట్: HTTP://MED.TSEAMCET.IN

ఈపీటీఆర్‌ఐలో ప్రవేశాలు
-హైదరాబాద్‌లోని ఎన్విరాన్‌మెంటల్ ప్రొటెక్షన్ ట్రెయినింగ్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఈపీటీఆర్‌ఐ)లో పీజీ డిప్లొమా కోర్సులో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ - ఎన్విరాన్‌మెంట్ మేనేజ్‌మెంట్
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, క్యాట్/సీమ్యాట్ లేదా మ్యాట్‌లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
ఎంపిక: అకడమిక్ ప్రతిభ, అర్హత పరీక్షలో వచ్చిన మార్కులు, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ద్వారా చేస్తారు.
-దరఖాస్తు: వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
-చివరితేదీ: జూన్ 17
-వెబ్‌సైట్: WWW.EPTRI.COM

ఐఐటీ గువాహటి
-గువాహటిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ఈ పోస్టులకు దేశంలోని ఏ ప్రాంత అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకోవచ్చు.
-జూనియర్ అసిస్టెంట్ (హాస్టల్)
-ఖాళీల సంఖ్య - 14
-పేస్కేల్: రూ. 5,200 - 20,200 + గ్రేడ్ పే రూ. 2,000/-
అర్హతలు: ఏదైనా డిగ్రీతోపాటు సోషల్ వర్క్/ హాస్పిటాలిటీ లేదా హోటల్ మేనేజ్‌మెంట్, హోంసైన్స్‌తోపాటు కంప్యూటర్ ఆఫీస్ అప్లికేషన్స్ పై పరిజ్ఞానం ఉండాలి.
-వయస్సు: 27 ఏండ్లు మించరాదు
-అప్లికేషన్ ఫీజు: రూ. 300/-
-దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
-చివరితేదీ: జూన్ 4
వెబ్‌సైట్: WWW.IITG.AC.IN. OR WWW.IITG.ERNET.IN

0 comments:

Post a Comment