Tuesday, 7 June 2016

Southern Railway Recruitment for 862 Apprentice Posts సదరన్ రైల్వేలో 862 అప్రెంటిస్ పోస్టులు

రైల్వేలో అప్రెంటిస్ అవకాశం
- చెన్నైలోని సదరన్ రైల్వేలో
- పదోతరగతి + ఐటీఐ
-అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక
- చివరితేదీ జూన్ 20

చెన్నై ప్రధాన కేంద్రం ఉన్న సదరన్ రైల్వే వివిధ డిపార్ట్‌మెంట్లలోని ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌షిప్ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: చెన్నై ప్రధాన కేంద్రంగా సదరన్ రైల్వే పనిచేస్తుంది. దేశంలో మొత్తం 17 రైల్వే జోన్లు ఉన్నాయి.
మొత్తం ఖాళీలు - 862
విభాగాల వారీగా ఖాళీలు:
క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్‌షాప్ పెరంబూర్(ఫ్రెషర్స్, ఎక్స్ ఐటీఐ) - 316 ఖాళీలు.
వీటిలో ఫిట్టర్ - 112, కార్పెంటర్-46, పెయింటర్-16, వెల్డర్-61, అప్‌హోల్‌స్టర్-16, మెషినిస్ట్-30, ఎమ్‌ఎమ్‌వీ-25, పాసా (ప్రోగ్రామింగ్ అండ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అసిస్టెంట్) -10 పోస్టులున్నాయి
ఎలక్ట్రికల్ వర్క్‌షాప్ పెరంబూర్ (ఫ్రెషర్స్, ఎక్స్ ఐటీఐ) - 138 ఖాళీలు. వీటిలో ఎలక్ట్రీషియన్ - 56, ఆర్ అండ్ ఏసీ-36, వైర్‌మెన్-15, విండర్ (ఆర్మేచర్)-5, కేబుల్ జాయింటర్-5, ఎలక్ట్రానిక్స్ మెకానిక్-102, మెకానిక్ (హెచ్‌టీ, ఎల్‌టీ ఎక్విప్‌మెంట్ అండ్ కేబుల్ జాయినింగ్-5, పాసా-6 పోస్టులున్నాయి.
లోకోవర్క్స్ పెరంబూర్ (ఎక్స్ ఐటీఐ) - 229 ఖాళీలు. వీటిలో ఫిట్టర్ - 108, మెకానిక్-18, డీజిల్ మెకానిక్-5,టర్నర్-10, పెయింటర్-20, వెల్డర్ (జీ అండ్ ఇ)-61, పాసా -7 పోస్టులున్నాయి
ఇంజినీరింగ్ వర్క్‌షాప్, అరక్కోణం (ఎక్స్ ఐటీఐ) - 28 ఖాళీలు. వీటిలో ఫిట్టర్ - 16, వెల్డర్ (జీ అండ్ ఈ)-6, మెషినిస్ట్-2 పోస్టులున్నాయి
చెన్నై డివిజన్ ఇఎల్‌ఎస్/ఏజేజే(ఎక్స్ ఐటీఐ) - 13 ఖాళీలు. వీటిలో ఫిట్టర్ - 6, వెల్డర్ (జీ అండ్ ఇ)-6, మెషినిస్ట్-1 పోస్టులున్నాయి
చెన్నై డివిజన్ ఆర్‌ఎస్/ఏవీడీ(ఎక్స్ ఐటీఐ) - 17 ఖాళీలు. వీటిలో ఫిట్టర్ - 6, వెల్డర్ (జీ అండ్ ఈ)-6, మెషినిస్ట్-2, పాసా -3 పోస్టులున్నాయి
చెన్నై డివిజన్ ఆర్‌ఎస్/టీబీఎమ్ (ఎక్స్ ఐటీఐ) - 47 ఖాళీలు. వీటిలో ఫిట్టర్ - 10, ఎలక్ట్రీషియన్-10, వెల్డర్ (జీ అండ్ ఇ)-15, కార్పెంటర్-6, పెయింటర్ -6 పోస్టులున్నాయి
చెన్నై డివిజన్ డీఎస్‌ఎల్/టీఎన్‌పీ(ఎక్స్ ఐటీఐ) - 14 ఖాళీలు. వీటిలో ఎలక్ట్రీషియన్-4, డీజిల్ మెకానిక్ -10 పోస్టులున్నాయి.
చెన్నై డివిజన్ సీ అండ్ డబ్ల్యూ, బీబీక్యూ(ఎక్స్ ఐటీఐ) - 15 (ఫిట్టర్) ఖాళీలు
చెన్నై డివిజన్ ఆర్‌ఎస్ /ఆర్‌పీఎమ్ (ఎక్స్ ఐటీఐ) - 22 ఖాళీలు. వీటిలో ఫిట్టర్-7, ఎలక్ట్రీషియన్ -7, టర్నర్-2, వెల్డర్ (జీ అండ్ ఈ)-3, ఎలక్ట్రానిక్ మెకానిక్-3 పోస్టులున్నాయి
రైల్వే హాస్పిటల్ పెరంబూర్ (ఫ్రెషర్స్, ఎక్స్ ఐటీఐ) -23 ఖాళీలు. వీటిలో ఎంఎల్‌టీ(రేడియాలజీ - 3, పాథాలజీ-8, కార్డియాలజీ-9, పాసా -3 పోస్టులున్నాయి
వయస్సు: 2016 అక్టోబర్ 1 నాటికి వెల్డర్, కార్పెంటర్, పెయింటర్, వైర్‌మెన్ అభ్యర్థులు-15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి.ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఆర్ అండ్ ఏసీ, టర్నర్, మెషినిస్ట్, మెకానిక్, ఎమ్‌ఎమ్‌వీ ఎంఎల్‌టీ, మెకానిక్, విండర్, కేబుల్ జాయింటర్, డీజిల్ మెకానిక్ అభ్యర్థులు-15 నుంచి 24 ఏండ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులు మూడేండ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
వైర్‌మెన్ అభ్యర్థులు-15 నుంచి 22 ఏండ్ల మధ్య ఉండాలి,
అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ఐటీఐ (ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఆర్ అండ్ ఏసీ, ఎంఎంవీ, టర్నర్, విండర్) ట్రేడ్‌లో ఉత్తీర్ణత. కార్పెంటర్, పెయింటర్, అప్‌హోల్‌స్టర్ వెల్డర్ అభ్యర్థులు 8వ తరగతితోపాటు సంబంధిత ఐటీఐలో ఉత్తీర్ణత. మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అభ్యర్థులు ఇంటర్/10+2 (ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ)లో ఉత్తీర్ణత. పాసా అభ్యర్థులు పదోతరగతితోపాటు సంబంధిత ఐటీఐలో ఉత్తీర్ణత. కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌లో ఎన్‌సీవీటీ నుంచి సర్టిఫికెట్‌ను కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు: రూ.100/-
ఎంపిక: అకడమిక్ మెరిట్ ద్వారా
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో దరఖాస్తులను పూర్తిచేసి అవసరమైన సర్టిఫికెట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: CHIEF WORKSHOP MANAGER,
CARRIAGE AND WAGON WORKS,
SOUTHERN RAILWAY,
AYANAVARAM,
CHENNAI-600023
చివరి తేదీ: జూన్ 20
వెబ్‌సైట్: WWW.SR.INDIANRAILWAYS.GOV.IN

0 comments:

Post a Comment