Sunday, 12 June 2016

Sashastra Seema Bal SSB Recruitment 2016 - 2068 Posts Constable Posts సశస్త్ర సీమాబల్‌లో 2068 కానిస్టేబుల్ పోస్టులు

భారత హోంమంత్రిత్వశాఖ పరిధిలోని సశస్త్ర సీమాబల్ దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ (గ్రూప్ సీ నాన్ గెజిటెడ్ ) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: సశస్త్ర సీమాబల్ కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలో పనిచేస్తుంది. దేశరక్షణకు మారుమూల సరిహద్దు ప్రాంతాల్లో కీలక విభాగం ఇది. 1963 మార్చిలో స్థాపించారు. ఈ పోస్టులకు పురుష, మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
పని చేసే ప్రదేశం : దేశంలో ఎక్కడైనా
మొత్తం కానిస్టేబుల్ ఖాళీల సంఖ్య: 2068 పోస్టులు (జనరల్-793, ఓబీసీ-372, ఎస్సీ-460, ఎస్టీ-168, ఎక్స్ సర్వీస్‌మెన్-275)
కానిస్టేబుల్ పురుషులు (డ్రైవర్) - 731 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (కుక్)- 349 పోస్టులు
కానిస్టేబుల్ మహిళలు (కుక్)- 60 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (వాషర్‌మెన్)-170
కానిస్టేబుల్ మహిళలు (వాషర్‌మెన్)- 30 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (బార్బర్)- 82 పోస్టులు
కానిస్టేబుల్ మహిళలు (బార్బర్) - 15 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (సఫాయివాలా) - 176 పోస్టులు
కానిస్టేబుల్ మహిళలు (సఫాయివాలా) - 30 పోస్టులు
కానిస్టేబుల్ పురుషులు (వాటర్ క్యారియర్) - 395 పోస్టులు
కానిస్టేబుల్ మహిళలు (వాటర్ క్యారియర్) - 30
ssb-constable


అర్హతలు:
కానిస్టేబుల్ (డ్రైవర్):
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్‌ను కలిగి ఉండాలి.
కానిస్టేబుల్ (కుక్, వాషర్‌మెన్, బార్బర్, సఫాయివాలా, వాటర్ క్యారియర్):
గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి మెట్రిక్యులేషన్/పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల డిప్లొమా కోర్సులో ఉత్తీర్ణత. సంబంధిత ట్రేడ్‌లో రెండేండ్ల అనుభవం ఉండాలి.
వయస్సు: 18 నుంచి 23 ఏండ్ల మధ్య (డ్రైవర్ పోస్టుకు 21 నుంచి 27 ఏండ్లు) వయస్సును కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేండ్లు, ఎక్స్ సర్వీస్‌మెన్, ఓబీసీలకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
పేస్కేల్ : రూ. 5, 200 - 20, 200 + గ్రేడ్ పే రూ. 2,000/- వీటికితోడు డీఏ, రేషన్ అలవెన్స్‌లు, స్పెషల్ అలవెన్స్, హెచ్‌ఆర్‌ఏ, ఉచిత వసతి, ట్రాన్స్‌పోర్ట్ తదితర సదుపాయాలు ఉంటాయి.
అప్లికేషన్ ఫీజు: జనరల్, ఓబీసీ అభ్యర్థులు- రూ.50/- (ఐపీవో/బ్యాంకర్స్ చెక్, డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఫీజు చెల్లించాలి). ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
ఎంపిక విధానం: పీఈటీ, పీఎస్‌టీ, రాతపరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్
పురుష అభ్యర్థులు 24 నిమిషాల్లో 4.8 కిలోమీటర్ల దూరాన్ని పరుగెత్తాలి, మహిళా అభ్యర్థులైతే 2.4కి.మీ. దూరాన్ని 18 నిమిషాల్లో పరిగెత్తాలి.
నోట్: పై టెస్ట్‌ల్లో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. వీటిలో అర్హత సాధించిన వారికి కింది టెస్టులను నిర్వహిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
కానిస్టేబుల్ (డ్రైవర్) పోస్టు-170 సెం.మీ. ఎత్తు, ఛాతీ 80 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
ఎస్టీ అభ్యర్థులు - 162.5 సెం.మీ. ఎత్తు, ఛాతీ 76 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
కానిస్టేబుల్ (కుక్, వాషర్‌మెన్, బార్బర్, సఫాయివాలా, వాటర్ క్యారియర్) పోస్టులు:
పురుష అభ్యర్థులు-167.5 సెం.మీ. ఎత్తు, ఛాతీ 78 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళా అభ్యర్థులు - 157 సెం.మీ. ఎత్తు ఉండాలి.
ఎస్టీ అభ్యర్థులు - పురుషులు -162.5 సెం.మీ. ఎత్తు, ఛాతీ 76 సెం.మీ, గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి. మహిళలు-150 సెం.మీ.ఎత్తు ఉండాలి.
ఎత్తుకు తగిన బరువు ఉండాలి
రాతపరీక్ష: రెండు పేపర్లు ఉంటాయి.
ఆబ్జెక్టివ్ రాత పరీక్ష (పేపర్ 1)-మల్టిపుల్ చాయిస్ 100 ప్రశ్నలు ఉంటాయి. దీనిలో జనరల్ నాలెడ్జ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ ఇంగ్లిష్&హిందీ, జనరల్ రీజనింగ్‌పై ప్రశ్నలు ఉంటాయి. 120 నిమిషాల్లో పూర్తి చేయాలి. జనరల్ అభ్యర్థులు 50 శాతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 45 శాతం క్వాలిఫయింగ్ మార్కులను సాధించాలి.
సంబంధిత టెక్నికల్ సబ్జెక్ట్ (పేపర్ 2)- 50 మార్కులకు ఉంటుంది. జనరల్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 60 శాతం క్వాలిఫయింగ్ మార్కులను సాధించాలి
మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా తుది ఫలితాలను ప్రకిటిస్తారు
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన విడుదలైన 30 రోజుల్లోగా పంపాలి.
వెబ్‌సైట్: WWW.SSBRECTT.GOV.IN

0 comments:

Post a Comment