Tuesday, 7 June 2016

Punjab and Sind Bank jobs ,IIIt IIITM IIITDM PhD programs admissions , SAIL 69 nurse jobs , NIFT 17 jobs , Prasar Bharati jobs Notification పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ ఉద్యోగాలు,ఐఐఐటీ ఐఐఐటీఎం ఐఐఐటీడీఎంల్లో పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్ ప్రవేశాలు,సెయిల్‌లో 69 నర్స్ ఉద్యోగాలు,నిఫ్ట్‌లో 17 ఉద్యోగాలు,ప్రసార భారతి ఉద్యోగాలు

పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ క్లరికల్ క్యాడర్ (స్పోర్ట్స్ కోటా) పురుష హాకీ క్రీడాకారుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
పోస్టు పేరు: క్లరికల్ క్యాడర్
మొత్తం ఖాళీల సంఖ్య -30 పోస్టులు
వయస్సు: 2016 జనవరి 1 నాటికి 18 నుంచి 28 ఏండ్ల మధ్య ఉండాలి
అర్హత: ఇంటర్ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత. హాకీ క్రీడలో స్టేట్ లెవల్/నేషనల్ లెవల్ ఈవెంట్‌ల్లో పాల్గొని ఉండాలి
ఎంపిక: స్పోర్ట్స్ పర్‌ఫార్మెన్స్/ ఫీల్డ్ ట్రయల్స్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్‌లైన్
చిరునామా: PUNJAB & SIND BANK, SPORTS CELL,
LYALPUR KHALSA COLLEGE(FOR BOYS),
G.T.ROAD, JALANDHAR
చివరి తేదీ: జూన్ 16
వెబ్‌సైట్: WWW.PSBINDIA.COM

పీహెచ్‌డీ ప్రోగ్రామ్స్
కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఐఐఐటీ, ఐఐఐటీఎం, ఐఐఐటీడీఎంల్లో పీహెచ్‌డీ - జూలై 2016 ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: ఐఐఐటీ - అలహాబాద్, ఏబీవీ - ఐఐఐటీఎం గ్వాలియర్, పీడీపీఎం - ఐఐఐటీడీఎం -జబల్‌పూర్, ఐఐఐటీడీఎం - కాంచీపురం, ఐఐఐటీడీఎం కర్నూల్.
కోర్సు: పీహెచ్‌డీ ప్రోగ్రామ్
విభాగాలు: కంప్యూటర్ సైన్స్ అండ్ ఐటీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, మెకానికల్, మేనేజ్‌మెంట్, అప్లయిడ్ సైన్సెస్.
దరఖాస్తు: పైన పేర్కొన్న సంస్థల్లో వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాలి. ఆయా వెబ్‌సైట్స్‌లో వివరాలు ఉన్నాయి.
వెబ్‌సైట్: WWW.IIITA.AC.IN/ WWW.IIITDMJ.AC.IN

సెయిల్‌లో 69 నర్స్ పోస్టులు
స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్) దుర్గాపూర్ ప్లాంట్‌లో కింది ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: సెయిల్ భారత ప్రభుత్వ రంగ సంస్థ.
పోస్టు - ప్రొఫిషియన్సీ ట్రెయినీ (నర్స్)
మొత్తం ఖాళీల సంఖ్య - 69
అర్హతలు: బీఎస్సీ (నర్సింగ్) లేదా డిప్లొమా ఇన్ జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీ అండ్ ఇంటర్న్‌షిప్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ కలిగి ఉండాలి.
వేతనం: నెలకు రూ. 8,000/- స్టయిఫండ్ + ఇతర అలవెన్స్‌లు ఇస్తారు.
వయస్సు: 2016, మే 31 నాటికి జనరల్ అభ్యర్థులు - 30 ఏండ్లు, ఓబీసీ - 33 ఏండ్లు, ఎస్సీ, ఎస్టీలు 35 ఏండ్లు మించరాదు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో జూన్ 22లోగా మెయిల్ చేయాలి.
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: జూన్ 26
వెబ్‌సైట్: HTTP://SAILCAREERS.COM

నిఫ్ట్‌లో 17 ఖాళీలు
ముంబైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: మొత్తం ఖాళీలు - 17. వీటిలో జూనియర్ అసిస్టెంట్ - 12, ల్యాబ్ అసిస్టెంట్ - 1, డ్రైవర్ -1, ఎలక్ట్రీషియన్ - 1, ప్లంబర్ - 1, హాస్టల్ వార్డెన్ - 1 ఖాళీ ఉన్నాయి.
అర్హతలు: వయస్సు వేర్వేరు పోస్టులకు వేర్వేరుగా ఉన్నాయి. వెబ్‌సైట్‌లో వివరాలు చూడవచ్చు.
ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్ లేదా కస్టమైజ్డ్ ఎవల్యూషన్ టెస్ట్
ఫీజు: రూ. 500/-
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
చివరితేదీ: జూన్ 27
వెబ్‌సైట్: HTTP://WWW.NIFT.AC.IN

ప్రసార భారతి
ప్రసారభారతి ఆల్‌ఇండియా రేడియోలో ఖాళీగా ఉన్న న్యూస్‌రీడర్ కమ్ ట్రాన్స్‌లేటర్ (తాత్కాలిక ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టు పేరు: న్యూస్‌రీడర్ కమ్ ట్రాన్స్‌లేటర్
అర్హత:గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. సంబంధిత లాంగ్వేజీలో ప్రావీణ్యతను కలిగి ఉండాలి. రేడియో/టీవీలో జర్నలిస్ట్‌గా పనిచేసి ఉండాలి
వయస్సు: 2016 జూన్ 30 నాటికి 21 నుంచి 45 ఏండ్ల మధ్య ఉండాలి
అప్లికేషన్ ఫీజు: రూ. 300/- (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు రూ.225/-)
ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులను డౌన్‌లోడ్ చేసుకొని పూర్తి వివరాలను నింపి, సంబంధిత సర్టిఫికెట్లను జతపరిచి పర్సనల్ అధికారికి పంపాలి.
చిరునామా: INSPECTOR OF ACCOUNTS, NEWS SERVICES DIVISION,
ALL INDIA RADIO,NEW BROADCASTING HOUSE, PARLIAMENT STREET, NEW DELHI-110001
దరఖాస్తులను పంపడానికి చివరి తేదీ: జూన్ 30
వెబ్‌సైట్: WWW.NEWSONAIR.COM

0 comments:

Post a Comment