Saturday, 11 June 2016

Power Grid Diploma trainee , Wipro Consumer Care and Wipro Care Santoor Scholarship Program పవర్‌గ్రిడ్‌లో డిప్లొమా ట్రెయినీ,విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ విప్రో కేర్ సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్

భారత ప్రభుత్వరంగ సంస్థ పవర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో డిప్లొమా ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: పవర్‌గ్రిడ్ పబ్లిక్ సెక్టారుకు చెందిన నవరత్న కంపెనీ. కేంద్ర విద్యుత్ శాఖ పరిధిలో ఈ సంస్థ పనిచేస్తుంది.
మొత్తం ఖాళీల సంఖ్య - 74
విభాగాల వారీగా ఖాళీలు:
డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రికల్) - 60 ఖాళీలు. వీటిలో జనరల్ - 33, ఓబీసీ - 15, ఎస్సీ - 12 ఉన్నాయి.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి కనీసం 70 శాతం మార్కులతో డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు డిప్లొమా పాసై ఉంటే సరిపోతుంది.
డిప్లొమా ట్రెయినీ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) - 10 ఖాళీలు. వీటిలో జనరల్ -6 ఓబీసీ - 2, ఎస్సీ -1, ఎస్టీ - 1 ఖాళీ ఉన్నాయి.
అర్హతలు: కనీసం 70 శాతం మార్కులతో డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ ఉత్తీర్ణత.
జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ (హెచ్‌ఆర్) - 4 ఖాళీలు. వీటిలో జనరల్ - 2, ఓబీసీ - 1, ఎస్టీ - 1 ఉన్నాయి.
అర్హతలు: రెండేండ్ల ఫుల్‌టైం పీజీ డిగ్రీ లేదా పీజీ డిప్లొమా లేదా ఎంబీఏ (హెచ్‌ఆర్) లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్‌లో కనీసం 55 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
వయస్సు: జనరల్ అభ్యర్థులకు 27 ఏండ్లు మించరాదు.
ఎంపిక: డిప్లొమా ట్రెయినీ పోస్టులకు రాతపరీక్ష ద్వారా, జూనియర్ ఆఫీసర్ ట్రెయినీ పోస్టులకు రాతపరీక్ష ద్వారా చేస్తారు. అయితే కంప్యూటర్‌స్కిల్ టెస్ట్ తప్పనిసరిగా క్వాలిఫై కావాలి. దీనికి ప్రత్యేకంగా మార్కులు ఏమి ఉండవు.
రాతపరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
రాతపరీక్ష కేంద్రాలు: ఢిల్లీ, అలహాబాద్, జైపూర్, డెహ్రాడూన్
శిక్షణ కాలంలో అభ్యర్థులకు నెలకు రూ. 16,500/- ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు: రూ. 300 + బ్యాంక్ చార్జీలు రూ. 60/-
ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఎటువంటి ఫీజు లేదు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూన్ 24
చివరితేదీ: జూన్ 22
వెబ్‌సైట్: HTTP://WWW.POWERGRIDINDIA.COM

బాలికలకు స్కాలర్‌షిప్స్
విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ విప్రో కేర్ సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ స్కాలర్‌షిప్స్‌ను తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ర్టాల్లో ఇంటర్ తర్వాత ఉన్నత చదువులు చదివే బాలికల కోసం.
మొత్తం స్కాలర్‌షిప్స్ - 900
విద్యార్థులకు ఏడాదికి రూ. 24,000 - 36,000 వరకు స్కాలర్‌షిప్స్‌ను ఇస్తారు. స్కాలర్‌షిప్ అభ్యర్థి చదువు అంటే డిప్లొమా/డిగ్రీని బట్టి ఇస్తారు.
అర్హతలు: ఈ స్కాలర్‌షిప్స్ కేవలం బాలికలకు మాత్రమే
విద్యార్థినులు 10, ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాల/కాలేజీల్లో 2015 -16 సంవత్సరం పూర్తిచేసిన వారు. 2016 -17 విద్యాసంవత్సరంలో డిప్లొమా లేదా డిగ్రీ కోసం గుర్తింపు పొందిన సంస్థలో (ఫుల్‌టైం కోర్సులో) ప్రవేశం పొందిన వారు అర్హులు.
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో
(HTTP://SANTOORSCHOLARSHIPS.COM/ APPLICATIONS నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు)
చివరితేదీ: జూలై 31
పూర్తి వివరాలు/ సందేహాలు, సహాయం కోసం
SANTOOR.SCHOLARSHIP@WIPRO.COM OR CALL ON
+917337835166 లో సంప్రదించవచ్చు

0 comments:

Post a Comment