Wednesday, 1 June 2016

ISRO Satellite Centre Recruitment For 166 posts ఇస్రో శాటిలైట్ సెంటర్‌లో 166 పోస్టులు

ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లో ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇస్రో శాటిలైట్ సెంటర్ (బెంగళూరు) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్-బీ, డ్రాఫ్ట్స్‌మెన్-బీ, టెక్నికల్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, లైబ్రెరీ అసిస్టెంట్, నర్స్-బీ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు: బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఏర్పాటుచేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)ను విక్రమ్ సారాభాయ్ 1969 ఆగస్టు 15న స్థాపించారు. ఇది అంతరిక్ష పరిశోధనల కోసం భారత ప్రభుత్వం నెలకొల్పిన సంస్థ.

-పోస్టు పేరు: టెక్నీషియన్ బీ-120 పోస్టులు
-విభాగాలు: ఎలక్ట్రో మెకానిక్, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్, మెకానికల్
-విభాగాల వారీగా ఖాళీలు: ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్-57, ఫిట్టర్-27, ఎలక్ట్రికల్-14, ఎసీ అండ్ రిఫ్రిజిరేషన్-4, ఎలక్ట్రోప్లేటింగ్-1, గ్రైండర్-3, కార్పెంటర్-2, డీజిల్ మెకానిక్-1, మోటార్ వెహికల్ మెకానిక్-2, ప్లంబర్-4, టర్నర్-3, ఫొటోగ్రాఫర్/డిజిటల్ ఫొటోగ్రాఫర్-2

అర్హత: పదోతరగతి/మెట్రిక్యులేషన్+ ఐటీఐ (ఎలక్ట్రానిక్స్ మెకానిక్, టెక్నీషియన్ పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయెన్సెస్, మెకానికల్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్, ఎలక్ట్రికల్, ఏసీ అండ్ రిఫ్రిజిరేషన్, ఎలక్ట్రోప్లేటింగ్, గ్రైండర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, మోటార్ వెహికల్ మెకానిక్, ప్లంబర్, టర్నర్, ఫొటోగ్రాఫర్/డిజిటల్ ఫొటోగ్రాఫర్) ట్రేడ్‌ల్లో ఉత్తీర్ణత

-పోస్టు పేరు: డ్రాఫ్ట్స్‌మెన్-బీ: 6 పోస్టులు (డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్-5 , డ్రాఫ్ట్స్‌మెన్ సివిల్-1)
అర్హత: పదో/మెట్రిక్యులేషన్+ ఐటీఐ (డ్రాఫ్ట్స్‌మెన్ మెకానికల్/సివిల్) ట్రేడ్‌ల్లో ఉత్తీర్ణత
-పోస్టు పేరు: టెక్నికల్ అసిస్టెంట్:-33 పోస్టులు (మెకానికల్-13, ఎలక్ట్రానిక్స్-18, కంప్యూటర్ సైన్స్-2)
అర్హత: మూడేండ్ల డిప్లొమా ఇన్ మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్‌ల్లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత
-పోస్టు పేరు: సైంటిఫిక్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)-3 పోస్టులు
అర్హత: బీఎస్సీ (కెమిస్ట్రీ)లో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత
-పోస్టు పేరు: లైబ్రెరీ అసిస్టెంట్ -3 పోస్టులు
అర్హత: బ్యాచిలర్ డిగ్రీ+పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ లైబ్రెరీ సైన్స్/ లైబ్రెరీ ఇన్ఫర్మేషన్ సైన్స్‌లో ఉత్తీర్ణత
-పోస్టు పేరు: నర్స్ - 1 పోస్టు
అర్హత: ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ఎస్‌ఎస్‌సీ, మూడేండ్ల డిప్లొమా ఇన్ నర్సింగ్ ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత
-వయస్సు: 2016 జూన్ 17 నాటికి 18 నుంచి 35 ఏండ్ల మధ్య ఉండాలి
-పే స్కేల్: టెక్నీషియన్/డ్రాఫ్ట్‌మెన్ పోస్టులకు రూ. 5,200-20,200+ గ్రేడ్ పే రూ. 2000/-, మిగతా పోస్టులకు రూ. 9,300-34,800+ గ్రేడ్ పే రూ. 4,600/-. అదనంగా ఇంటిఅద్దె, రవాణా అలవెన్స్, ఉద్యోగుల కొత్త పెన్షన్ పథకం, గ్రూప్ ఇన్సూరెన్స్, వైద్యసౌకరాలు తదితర ఇతర సౌకర్యాలను కల్పిస్తారు.
-అప్లికేషన్ ఫీజు: రూ. 250/- (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌సర్వీస్‌మెన్, పీహెచ్‌సీ, మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు)
-ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్
-రాతపరీక్షకు షార్ట్‌లిస్ట్ పొందిన అభ్యర్థులకు ఇ-మెయిల్ ద్వారా తెలియజేస్తారు.
-దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా. ఇస్రో వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు వినియోగంలో ఉన్న ఇ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా ఎంటర్‌చేయాలి. ఫీజు బ్యాంక్ చలానాను సంబంధిత పర్సనల్ అధికారికి ఆర్డినరీ పోస్ట్‌లో పంపాలి.

చిరునామా: SR. ADMINISTRATIVE OFFICER (RMT), ISRO SATELLITE CENTRE, OLD AIRPORT ROAD, VIMANAPURA POST, BENGALURU -560 017
-ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 17
-వెబ్‌సైట్: WWW.ISRO.GOV.IN

0 comments:

Post a Comment