Sunday, 5 June 2016

Indian navy Recruitment Notification ఇంటర్‌తో నేవీలో కొలువులు

ఇంటర్ ఎంపీసీ/ఎంబైపీసీ అభ్యర్థులకు అవకాశం
-రాతపరీక్ష, పీఎఫ్‌టీ ద్వారా ఎంపిక
-మంచి జీతభత్యాలు, ప్రత్యేక అలవెన్స్‌లు
-చివరితేదీ జూన్ 19
indiannavyభారత నావికా దళంలో సెయిలర్ (ఆర్టిఫిసియర్ అప్రెంటిస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: భారత రక్షణ దళం పరిధిలోని నావికా దళంలో ఈ పోస్టులు ఉన్నాయి.
పోస్టులు: సెయిలర్స్ ఫర్ ఆర్టిఫిసియర్ అప్రెంటిస్ - 141 బ్యాచ్. ఫిబ్రవరి 2017 నుంచి కోర్సు ప్రారంభమవుతుంది.
అర్హతలు: కనీసం 60 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులతో ఇంటర్/10+2 తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్‌తోపాటు కెమిస్ట్రీ లేదా బయాలజీ లేదా కంప్యూటర్ సైన్స్‌లో ఏదైనా ఒక సబ్జెక్టు చదివి ఉండాలి.
వయస్సు: అభ్యర్థులు 1997, ఫిబ్రవరి 1 నుంచి 2000, జనవరి 31 మధ్య జన్మించి ఉండాలి.
పేస్కేల్: ఆర్టిఫిసియర్ అప్రెంటిస్ బేసిక్ పే బాండ్ - రూ. 5, 200 - 20, 200/ + గ్రేడ్ పే రూ. 2,000/, వీటితోపాటు ఎంఎస్‌పీ రూ. 2,000 + ఎక్స్ గ్రూప్ పే రూ. 1,400 + డీఏ ఇస్తారు.
పదోన్నతులు: సెయిలర్ నుంచి మాస్టర్ చీఫ్ పెట్టి ఆఫీసర్ - 1. ఈ పోస్టు సుబేదార్ మేజర్‌కు సమానమైంది.
నోట్: శిక్షణ కాలంలో సెయిలర్స్‌కు పుస్తకాలు, రీడింగ్ మెటీరియల్, యూనిఫాం, ఫుడ్ అండ్ అకామిడేషన్ తదితరాలు ఉచితంగా ఇస్తారు. వీటితోపాటు వైద్యసౌకర్యాలు, ఎల్‌టీసీ, గ్రూప్ హౌజింగ్ సౌకర్యాలు, హెచ్‌ఆర్‌ఏ, పిల్లల చదువు తదితర సౌకర్యాలు కల్పిస్తారు.
ఎంపిక ప్రక్రియ:
రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా
రాతపరీక్ష:
పరీక్ష హిందీ/ ఇంగ్లిష్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది.
ప్రశ్న పత్రంలో నాలుగు సెక్షన్లు ఉంటాయి. ఇంగ్లిష్, సైన్స్, మ్యాథ్స్, జనరల్ నాలెడ్జ్.
పరీక్ష ఇంటర్ స్థాయిలో ఉంటుంది
పరీక్ష కాలవ్యవధి 60 నిమిషాలు
అభ్యర్థులు ప్రతి సెక్షన్‌లో తప్పనిసరిగా కనీస క్వాలిఫయింగ్ మార్కులు రావాలి.
ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్ (పీఎఫ్‌టీ):
పీఎఫ్‌టీలో తప్పనిసరిగా క్వాలిఫై కావాలి
7 నిమిషాల్లో 1.6 కి.మీ. దూరాన్ని పరుగెత్తాలి
20 ఉతక్, బైతక్‌లు, 10 ఫుష్‌అప్‌లను చేయాలి
స్పోర్ట్స్, స్విమ్మింగ్ తదితర అదనపు కరికులర్ యాక్టివిటీస్ ఉన్నవారికి ప్రాధాన్యతనిస్తారు
శారీరక ప్రమాణాలు:
157 సెం.మీ. ఎత్తు ఉండాలి. ఎత్తుకు తగ్గ ఛాతీ ఉండాలి. గాలిపీల్చినప్పుడు 5 సెం.మీ. వ్యాకోచించాలి.
అభ్యర్థులు మంచి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని కలిగి ఉండాలి
శిక్షణ:
ఫిబ్రవరి 2017 నుంచి ప్రారంభమవుతుంది
ఐఎన్‌ఎస్ చిల్కాలో 9 వారాల ప్రాథమిక శిక్షణ ఉంటుంది
తర్వాత ట్రేడ్ అవసరాలను బట్టి ప్రొఫెషనల్ ట్రెయినింగ్‌ను వివిధ నావెల్ ట్రెయినింగ్ సెంటర్స్‌లో ఇస్తారు
విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకొన్న అభ్యర్థులు మొదట 20 ఏండ్ల కాలపరిమితికి అగ్రిమెంట్ ఇవ్వాల్సి ఉంటుంది.
నోట్: సబ్‌మెరైన్ ఆర్మ్‌లో పనిచేయడానికి ఆసక్తి ఉన్నవారు ప్రత్యేకంగా ఆన్‌లైన్‌లో దరఖాస్తును పూర్తిచేయాలి. వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చి సబ్‌మెరైన్ - స్పెషలైజేషన్‌లో శిక్షణను ఇస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో జూన్ 6 నుంచి ప్రారంభం
చివరితేదీ: జూన్ 19
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొన్న కాపీ ప్రింట్‌ను పంపడానికి చివరితేదీ: జూన్ 27
హార్డ్‌కాపీలను పంపాల్సిన చిరునామా: పోస్ట్‌బాక్స్ నంబర్ - 476,
గోల్‌డాక్ ఖానా, జీపీ, న్యూఢిల్లీ - 110001
వెబ్‌సైట్: WWW.JOININDIANNAVY.GOV.IN

0 comments:

Post a Comment