Sunday, 5 June 2016

Indian Army Recruitment Notification భారత రక్షణ మంత్రిత్వ శాఖలో ఉద్యోగాలు

భారత రక్షణ మంత్రిత్వ శాఖలో కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
వివరాలు: 16 ఫీల్డ్ అమ్యునేషన్ డిపార్ట్‌మెంట్, డార్జిలింగ్‌లో ఈ ఖాళీలు ఉన్నాయి.
మెటీరియల్ అసిస్టెంట్ - 12 ఖాళీలు. జనరల్ - 6, ఓబీసీ -2, ఎస్సీ - 3, ఎస్టీ 1 ఉన్నాయి.
పే స్కేల్: రూ. 5,200 - 20, 200 + గ్రేడ్ పే రూ. 2, 800/-
అర్హతలు: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. మెటీరియల్ మేనేజ్‌మెంట్‌లో డిప్లొమా లేదా గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఏదైనా విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా. హిందీ/ ఇంగ్లిష్ పరిజ్ఞానం ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష, కంప్యూటర్ పరిజ్ఞానం పరిశీలించి ఎంపిక చేస్తారు.
ఫైర్‌మెన్ - 7 ఖాళీలు. జనరల్ - 4, ఓబీసీ - 1, ఎస్సీ - 2.
పే స్కేల్: రూ. 5,200 - 20, 200 + గ్రేడ్ పే రూ. 1,900/-
అర్హతలు: మెట్రిక్యులేషన్ లేదా తత్సమాన కోర్సు. హిందీ పరిజ్ఞానం కలిగి ఉండాలి. ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్‌ల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: కనీసం 165 సెం.మీ. ఛాతీ 81.5 సెం.మీ., బరువు - కనీసం 50 కేజీలు ఉండాలి.
ట్రేడ్స్‌మెన్ మేట్ - 37 ఖాళీలు. జనరల్ - 19, ఓబీసీ - 9, ఎస్సీ - 9.
పే స్కేల్: రూ. 5,200 - 20, 200 + గ్రేడ్ పే రూ. 1, 800/-
అర్హతలు: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణత. హిందీ వచ్చి ఉండాలి.
ఎంపిక: ఫిజికల్ టెస్ట్, రాతపరీక్ష ద్వారా చేస్తారు.
వయస్సు: పై అన్ని పోస్టులకు 18 - 25 ఏండ్ల మధ్య ఉండాలి. మెటీరియల్ అసిస్టెంట్ పోస్టుకు 18 - 27 ఏండ్ల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: ఎంప్లాయ్‌మెంట్ న్యూస్‌లో ప్రకటన వెలువడిన నాటి నుంచి 21 రోజులు
వెబ్‌సైట్: WWW.INDIANARMY.NIC.IN

0 comments:

Post a Comment