Sunday, 5 June 2016

Hotel Management courses హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులు

హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ & అప్లయిడ్ న్యూట్రిషన్ కింది కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.
వివరాలు: ఐహెచ్‌ఎం టూరిజం మంత్రిత్వ శాఖ పరిధిలోని సంస్థ. ఇది హైదరాబాద్‌లోని విద్యానగర్‌లో ఉంది.
కోర్సులు:
క్రాప్ట్స్‌మెన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్
కాలవ్యవధి: ఏడాదిన్నర (18 నెలలు)- రెండు సెమిస్టర్లు
ఫీజు: రూ. 21,500 (మొదటి టర్మ్), రూ. 19,500 (రెండో టర్మ్)
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: జూలై 4(ఉదయం 9:30 గంటలకు)
క్రాప్ట్స్‌మెన్‌షిప్ కోర్స్ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ ఫుడ్ అండ్ బేవరేజస్ సర్వీస్:
కాల వ్యవధి: 24 వారాలు (ఫుల్‌టైమ్ కోర్సు)
అర్హత: పదో తరగతి లేదా ఇంటర్ ఉత్తీర్ణత. ఇంగ్లిషు సబ్జెక్టుగా కలిగి ఉండాలి.
ఫీజు: రూ. 7,525 (మొదటి టర్మ్), రూ. 7,425 (రెండో టర్మ్)
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: జూలై 7
పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ అకామిడేషన్ ఆపరేషన్స్ అండ్ మేనేజ్‌మెంట్
కాలవ్యవధి: ఏడాదిన్నర (18 నెలలు)
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉండాలి. డిగ్రీ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసిన విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఫీజు: రూ. 16,000 (మొదటి టర్మ్),రూ. 14,000 (రెండో టర్మ్)
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీ: జూలై 8
వయస్సు: జూలై 1, 2016 నాటికి 25 ఏండ్లు మించరాదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు మూడేండ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
రిజిస్ట్రేషన్ ఫీజు: రూ. 400/- (జనరల్), ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు: రూ. 250
ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా
ఎంపికైన విద్యార్థులు ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూలై 15
తరగతులు ప్రారంభం - జూలై 18
దరఖాస్తు: నిర్ణీత నమూనాలో (సంస్థ ప్రధాన కార్యాలయంలో తగు రుసుం చెల్లించి పొందవచ్చు)
వెబ్‌సైట్: HTTP://WWW.IHMHYD.ORG

0 comments:

Post a Comment