Saturday, 11 June 2016

Dena bank Recruitment Notification దేనాబ్యాంక్ ఉద్యోగాలు

భారత ప్రభుత్వ పరిధిలోని దేనా బ్యాంక్ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
వివరాలు: దేనా బ్యాంక్‌ను 1938, మే 26న దేవకరణ్ నాన్జీ కుటుంబం ప్రారంభించింది. 1969లో బ్యాంకుల జాతీయీకరణలో భాగంగా దీన్ని జాతీయం చేశారు.
పోస్టులు: చీఫ్ మేనేజర్ (ఐటీ - సీఐఎస్‌వో) - 1 పోస్టు.
చీఫ్ మేనేజర్ (ఆపరేషన్ రిస్క్) -1, చీఫ్ మేనేజర్ (క్రెడిట్ రిస్క్) - 1, మేనేజర్ (మోడల్ డెలప్‌మెంట్ అండ్ వ్యాలిడేషన్ అండర్ బేస్డ్) - 2, మేనేజర్ (ఆపరేషన్ రిస్క్ మేనేజ్‌మెంట్) - 1, మేనేజర్ (మార్కెట్ రిస్క్ మేనేజ్‌మెంట్) - 1, మేనేజర్ (సీఏ/ఐసీడబ్ల్యూఏ) - 17, మేనేజర్ (సెక్యూరిటీ) - 23, కంపెనీ సెక్రటరీ - 1 ఉన్నాయి.
మొత్తం ఖాళీల సంఖ్య - 48
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
చివరితేదీ: జూన్ 24
ఫీజు చెల్లించడానికి చివరితేదీ: జూన్ 24
ఆన్‌లైన్ టెస్ట్ - జూలై 23 (మేనేజర్ పోస్టులకు)
వెబ్‌సైట్: HTTP://WWW.DENABANK.COM

0 comments:

Post a Comment